MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Superstar Krishna: కృష్ణ వల్లే రమేష్‌ బాబు కెరీర్‌ కొలాప్స్, అందులో మహేష్‌ కూడా భాగమే.. ఏం జరిగిందంటే?

Superstar Krishna: కృష్ణ వల్లే రమేష్‌ బాబు కెరీర్‌ కొలాప్స్, అందులో మహేష్‌ కూడా భాగమే.. ఏం జరిగిందంటే?

కృష్ణ పెద్ద కొడుకు రమేష్‌ బాబు హీరోగా సక్సెస్ కాకపోవడానికి కారణం ఏంటనేది ఆసక్తికరంగా మారింది. దీనికి కృష్ణనే కారణమట. ఇందులో మహేష్‌ బాబు పాత్ర కూడా ఉందట.

3 Min read
Author : Aithagoni Raju
Published : Aug 10 2026, 02:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రమేష్‌ బాబు ఫెయిల్యూర్‌ కి కారణమైన కృష్ణ
Image Credit : our own

రమేష్‌ బాబు ఫెయిల్యూర్‌ కి కారణమైన కృష్ణ

సూపర్‌ స్టార్‌ కృష్ణ టాలీవుడ్‌లో తనకంటూ ఒక సెపరేట్‌ ఇమేజ్‌ని క్రియేట్‌ చేసుకున్నారు. నటుడిగా అద్భుతమైన సినిమాలు చేసి మెప్పించారు. ప్రయోగాలకు కేరాఫ్‌ గా నిలిచారు. సినిమా మేకింగ్‌ పరంగా ఇండస్ట్రీకి కొత్త టెక్నాలజీ పరిచయం చేసిందంటే కృష్ణ అనే చెప్పాలి. సాహసాలకు మరో పేరుగా పేరుతెచ్చుకున్నారు. అదే సమయంలో నిర్మాతల హీరో అనిపించారు. మాస్‌ కమర్షియల్‌ చిత్రాలతో టాలీవుడ్‌ని షేక్‌ చేశారు. ఎన్టీఆర్‌ తర్వాత ఆ స్థాయిలో మాస్‌ సినిమాలు చేసిన హీరోగా కృష్ణ నిలుస్తారని చెప్పొచ్చు. అయితే ఆయన వారసుల్లో మహేష్‌ బాబు ఒక్కడే సక్సెస్‌ అయ్యాడు. పెద్దకొడుకు రమేష్‌ బాబు సక్సెస్‌ కాలేకపోయాడు. ఆయన ఫెయిల్యూర్‌కి కారణం కృష్ణనే అట. ఈ విషయాన్ని ప్రముఖ సినీ విశ్లేషకుడు వెల్లడించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సామ్రాట్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రమేష్‌ బాబు
Image Credit : times of india

సామ్రాట్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రమేష్‌ బాబు

రమేష్‌ బాబు బాల నటుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. `అల్లూరి సీతారామరాజు` ఆయన తొలిచిత్రం. ఇందులో చిన్నప్పటి అల్లూరిగా రమేష్‌ బాబు నటించాడు. ఆ తర్వాత 1987లో `సామ్రాట్‌` చిత్రంతో హీరోగా పరిచయం అయ్యాడు. ఇది యావరేజ్‌గా ఆడింది. `చిన్ని కృష్ణుడు` ఫర్వాలేదనిపించింది. `బజార్‌ రౌడీ` మంచి హిట్‌ అయ్యింది. `ముగ్గురు కొడుకులు` హిట్‌ అయ్యింది. అయితే ఆ తర్వాత రమేష్‌ బాబుకి సోలో హిట్‌ లేవు. వరుసగా అన్ని సినిమాలు ఫ్లాప్‌ అయ్యాయి. దీనికి కారణం సూపర్‌ స్టార్‌ కృష్ణనే అంటున్నారు విశ్లేషకులు చిల్లగట్టు శ్రీకాంత్‌. రమేష్‌ బాబు హీరోగా సినిమాలు చేస్తున్న సమయంలో కృష్ణ కూడా సినిమాలు చేశారు. సోలో హీరోగా బ్లాక్‌ బస్టర్స్ అందించారు. మాస్‌, కమర్షియల్‌ చిత్రాలతో వరుస విజయాలతో దూసుకుపోయారు.

Related Articles

Related image1
DC 3 Days Box Office: బాక్సాఫీసు దుమ్ములేపుతున్న లోకేష్‌ కనగరాజ్‌.. డీసీ మూవీకి అదిరిపోయే వసూళ్లు
Related image2
Korean Kanakaraju 3 Days Collections: బాక్సాఫీసు వద్ద కొరియన్‌ కనకరాజు రచ్చ.. వరుణ్‌ తేజ్‌ మూవీ 3 రోజుల వసూళ్లు
35
కృష్ణ వల్లే రమేష్‌ బాబు కెరీర్‌ కొలాప్స్
Image Credit : Asianet News

కృష్ణ వల్లే రమేష్‌ బాబు కెరీర్‌ కొలాప్స్

కృష్ణ యాక్షన్‌ చిత్రాలు పెద్ద హిట్‌ అవుతున్నాయి. ఆయన డైలాగ్స్ థియేటర్లో బాగా పేలుతున్నాయి. మాస్‌ ఆడియెన్స్ కి పూనకాలు తెప్పిస్తున్నాయి. దీనికితోడు డాన్సులతో ఇరగదీస్తున్నారు. కానీ రమేష్‌ బాబులో ఆ యాంగిల్‌ మిస్‌ అయ్యింది. సాఫ్ట్ గా, కూల్‌గా కనిపించాడు, కానీ మాస్‌ ఆడియెన్స్ కి దూరమయ్యాడు. కృష్ణతో పోలిక వచ్చినప్పుడు రమేష్‌ బాబు తేలిపోయాడు. దీంతో కృష్ణ అభిమానులే కొంత డిజప్పాయింట్‌ అయ్యారట. దీనికితోడు ఆ సమయంలో కృష్ణ.. కాంగ్రెస్‌లోకి వెళ్లారు. ఎన్టీఆర్‌ని ఎదురించారు. దీంతో రామారావు అభిమాలు కృష్ణ సినిమాలను చూడటం మానేశారు. ఈ ప్రభావం రమేష్‌ బాబు సినిమాలపై పడింది. అదే సమయంలో కృష్ణ మరోవైపు మహేష్‌ బాబుతోనూ సినిమాలు చేస్తున్నారు. తన సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా మహేష్‌ బాబుని దించాడు. మహేష్‌ ని చూసేందుకు అభిమానులు క్యూ కట్టారు. ఓ దశలో కృష్ణ కంటే మహేష్‌ నే చూసేందుకు అభిమానులు థియేటర్‌కి వచ్చేవాళ్లు. దీంతో రమేష్‌ బాబు సినిమాలు పక్కకెళ్లి పోయాయి.

45
రామారావు అభిమానులు హ్యాండిచ్చారు
Image Credit : the indian express

రామారావు అభిమానులు హ్యాండిచ్చారు

వీటికితోడు మరో పెద్ద కారణం ఉంది. ఇండస్ట్రీలో ఆ సమయంలోనే విజయ నిర్మల ఫ్యామిలీ నుంచి నరేష్‌ ఫామ్‌లో ఉన్నాడు. వరుసగా కామెడీ సినిమాలతో విజయాలు అందుకుంటున్నాడు. పెద్ద కమర్షియల్‌ హీరోలకు పోటీ ఇస్తున్నాడు. కృష్ణ ఫ్యామిలీ నుంచి కాంపిటీషన్‌ ఇవ్వడం, రామారావు అభిమానులు, టీడీపీ అభిమానులు దూరం పెట్టడంతో ఆ ప్రభావం రమేష్‌ బాబుపై పడింది. ఇవన్నీ కారణాలతో ఆయన హీరోగా విజయాలు అందుకోలేకపోయాడు. సక్సెస్‌ కాలేకపోయాడని తెలిపారు. ఆ సమయంలో కృష్ణ అంతగా ఫామ్‌ లో లేకపోయి ఉంటే రమేష్‌ బాబుకి స్కోప్‌ దొరికేది. కానీ అప్పుడు సూపర్‌ స్టార్‌ కూడా బ్లాక్‌ బస్టర్స్ తో దూసుకుపోయాడు. దీంతో ఆయన్నే చూసేందుకు అభిమానులు ఆసక్తిచూపించారని, రమేష్‌ బాబుని పట్టించుకోలేదని చెప్పాడు శ్రీకాంత్‌. ఆయన కామెంట్స్ వైరల్‌ అవుతున్నాయి.

55
రమేష్‌ బాబు కొడుకు జై కృష్ణకి చేదు అనుభవం
Image Credit : Asianet News

రమేష్‌ బాబు కొడుకు జై కృష్ణకి చేదు అనుభవం

ఇదిలా ఉంటే రమేష్‌ బాబు వారసుడిగా, కృష్ణ ఫ్యామిలీ నుంచి మూడో తరం వారసుడిగా జై కృష్ణ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. `శ్రీనివాస మంగాపురం` చిత్రంలో నటించాడు. ఇటీవల విడుదలైన ఈ మూవీ ఆడియెన్స్ ని ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. డిజాస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రానికి అజయ్‌ భూపతి దర్శకత్వం వహించగా, ఇందులో మోహన్‌ బాబు ఇందులో కీలక పాత్ర పోషించారు. కానీ సినిమా ఆడలేదు. అయితే ఈ చిత్రానికి మహేష్‌ బాబు సపోర్ట్ చేయలేదని, సొంత అన్న కొడుకు మూవీకే సపోర్ట్ చేయకపోవడం విచారకరం అని చాలా మంది నెటిజన్లు ట్రోల్‌ చేశారు. అయితే సినిమా ఆడాలని, పెద్ద హిట్‌ కావాలని ఆయన ట్వీట్‌ చేశాడు, అదే సమయంలో వీడియో కూడా రిలీజ్‌ చేశాడు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
తెలుగు సినిమా
మహేష్ బాబు ఘట్టమనేని
కృష్ణ ఘట్టమనేని
Latest Videos
Recommended Stories
Recommended image1
Nagavamsi: కలెక్షన్లు అన్నీ ఫేకే, పోస్టర్‌ లెక్కలపై నిర్మాత నాగవంశీ బోల్డ్ స్టేట్‌మెంట్‌, ఇంత మోసమా?
Recommended image2
DC 3 Days Box Office: బాక్సాఫీసు దుమ్ములేపుతున్న లోకేష్‌ కనగరాజ్‌.. డీసీ మూవీకి అదిరిపోయే వసూళ్లు
Recommended image3
Govinda: ఆత్మహత్యకు యత్నించిన గోవిందా.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన బాలీవుడ్ స్టార్
Related Stories
Recommended image1
DC 3 Days Box Office: బాక్సాఫీసు దుమ్ములేపుతున్న లోకేష్‌ కనగరాజ్‌.. డీసీ మూవీకి అదిరిపోయే వసూళ్లు
Recommended image2
Korean Kanakaraju 3 Days Collections: బాక్సాఫీసు వద్ద కొరియన్‌ కనకరాజు రచ్చ.. వరుణ్‌ తేజ్‌ మూవీ 3 రోజుల వసూళ్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved