MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Nagavamsi: కలెక్షన్లు అన్నీ ఫేకే, పోస్టర్‌ లెక్కలపై నిర్మాత నాగవంశీ బోల్డ్ స్టేట్‌మెంట్‌, ఇంత మోసమా?

Nagavamsi: కలెక్షన్లు అన్నీ ఫేకే, పోస్టర్‌ లెక్కలపై నిర్మాత నాగవంశీ బోల్డ్ స్టేట్‌మెంట్‌, ఇంత మోసమా?

Nagavamsi: సినిమా కలెక్షన్లపై నిర్మాత నాగవంశీ బోల్డ్ కామెంట్ చేశారు. సినిమా కలెక్షన్లకి సంబంధించి పోస్టర్‌ పై ప్రకటించే లెక్కలు నిజం కావని, అవన్నీ ఎక్కువ చేసి వేసినవే అని ఆయన చెప్పారు.

2 Min read
Author : Aithagoni Raju
Published : Aug 10 2026, 12:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
సినిమా కలెక్షన్లపై నాగవంశీ బోల్డ్ కామెంట్
Image Credit : raw talks

సినిమా కలెక్షన్లపై నాగవంశీ బోల్డ్ కామెంట్

నిర్మాత నాగవంశీ.. సంచలనాలకు, వివాదాలకు కేరాఫ్‌. మోస్ట్ వైరల్‌ ప్రొడ్యూసర్‌ అంటే ఆయనే అని చెప్పొచ్చు. ఆయన మీడియా ముందుకు వచ్చాడంటే వైరల్‌ అయిపోవాల్సిందే. బోల్డ్ గా కామెంట్లు చేస్తూ వైరల్‌ అవుతుంటాడు. అదే సమయంలో ట్రోల్స్ కి గురవుతుంటాడు. ఈ క్రమంలో ఇప్పుడు మరోసారి ఆయన బోల్డ్ స్టేట్‌మెంట్స్ ఇచ్చాడు. సినిమా కలెక్షన్ల గుట్టు రట్టు చేశాడు. అదే సమయంలో సినిమాకి సంబంధించిన కాస్ట్ ఆఫ్‌ ప్రొడక్షన్‌ గురించి ఓపెన్‌ అయ్యాడు. తప్పు ఎవరిదో బయటపెట్టాడు. తమ తప్పు లేదనే విషయాన్ని ఆయన చెప్పడం గమనార్హం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
కలెక్షన్లన్నీ ఫేకే
Image Credit : raw talks

కలెక్షన్లన్నీ ఫేకే

పోస్టర్‌పై వేసే కలెక్షన్లు నిజం కాదని చెప్పేశాడు. అవి కచ్చితంగా ఇన్‌ఫ్లూయెన్స్ అయినవే అని, ప్రతి ఒక్కరు అలానే చేస్తారని, ఒరిజినల్‌ నెంబర్స్ ఎవరూ వేయరని చెప్పారు. అభిమానుల కోసం, వారి ఆనందం కోసం ఇలా పోస్టర్‌ పై ఎక్కువ కలెక్షన్లు వేస్తారని వెల్లడించాడు. హీరోల అభిమానులను హ్యాపీ చేయడానికి ఇలాంటివి తప్పదని వెల్లడించాడు నాగవంశీ. అదే సమయంలో ఇన్‌కమ్‌ ట్యాక్స్ ప్రాబ్లమ్‌ రాదా అనే ప్రశ్నకి ఆయన స్పందిస్తూ, తాము వేసే పోస్టర్‌ లెక్కలు ఫేక్‌ అని, అవి నిజం కాదని వాళ్లకి కూడా తెలుసు అని ఓపెన్‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. అందుకే ఐటీ వాళ్లు కూడా ఈ లెక్కలను నమ్మరు అని చెప్పడం విశేషం. ఫేక్‌ కలెక్షన్లని కరెక్ట్ చేయాల్సిన అవసరం లేదని, దాన్ని ఎవరూ పట్టించుకోరని చెప్పారు.

34
ట్రోల్స్ పై నాగవంశీ కామెంట్‌
Image Credit : youtube/@shreyasgroup

ట్రోల్స్ పై నాగవంశీ కామెంట్‌

అయితే తాను సినిమా రిలీజ్‌కి ముందు మీడియాతో మాట్లాడినప్పుడు సినిమాపై హైప్‌ కోసం కొన్ని మాట్లాడాల్సి వస్తుందని, జర్నలిస్ట్ లు గిల్లే ప్రశ్నలు అడగడంతో వాళ్లకి అదే స్థాయిలో సెటైరికల్‌ గా సమాధానం చెబుతానని, దాన్ని వాళ్లు వైరల్‌ చేస్తున్నారని, ట్రోల్‌ చేస్తున్నారని చెప్పాడు. అదేసమయంలో తాను మాట్లాడే మాట తీరుని బట్టే సినిమా ఆడుతుందా లేదా అనేది తెలిసిపోతుందని, అభిమానులు, ఆడియెన్స్ ఫిక్స్ అవుతారని వెల్లడించారు.

44
సినిమా కాస్ట్ ఆఫ్‌ ప్రొడక్షన్‌ పెరగడంపై నాగవంశీ క్రేజీ రియాక్షన్స్
Image Credit : youtube/@shreyasgroup

సినిమా కాస్ట్ ఆఫ్‌ ప్రొడక్షన్‌ పెరగడంపై నాగవంశీ క్రేజీ రియాక్షన్స్

సినిమా ఖర్చులు(కాస్ట్ ఆఫ్‌ ప్రొడక్షన్‌) పెరిగే దాని గురించి చెబుతూ, ఒకప్పుడు సినిమాకి డబ్బింగ్‌ మార్కెట్‌, ఓటీటీ మార్కెట్‌ బాగా పెరిగింది. వాటి ద్వారా డబ్బులు రావడంతో హీరోలు పారితోషికాలు పెంచారు. దీంతో కాస్ట్ ఆఫ్‌ ప్రొడక్షన్‌ పెరిగింది. కానీ ఇప్పుడు ఆ మార్కెట్‌ లేదు. బాగా తగ్గిపోయింది. ఓటీటీ వాళ్లు రూల్స్ పెడుతున్నారు. అదే సమయలో డబ్బింగ్‌ మార్కెట్‌ కూడా లేదు. నిర్మాతకి ఇన్‌కమ్‌ తగ్గింది, కానీ పారితోషికం, ప్రొడక్షన్‌ కాస్ట్ తగ్గలేదు. దీనికితోడు థియేటర్‌కి వచ్చే ఆడియెన్స్ కూడా తగ్గిపోయారు. దీంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో సినిమాలు ఆడినా కూడా నిర్మాతకు డబ్బులు రావడం లేదని చెప్పాడు. అయితే ఫెడరేషన్‌ రూల్స్ బాగా ఇబ్బందికరంగా ఉన్నాయని, హీరోలు కూడా పారితోషికాల విషయంలో రాజీపడుతున్నారని, కానీ ఫెడరేషన్‌ వాళ్లు మాత్రం తగ్గడం లేదని చెప్పాడు. ఇది కాస్ట్ ఆఫ్‌ ప్రొడక్షన్‌ పెరగడానికి కారణవుతుందని చెప్పాడు నాగవంశీ. ఆయన రా టాక్స్ వంశీతో మాట్లాడుతూ ఈ విషయాలను పంచుకున్నాడు నాగవంశీ. ఆయన కామెంట్స్ వైరల్‌ అవుతున్నాయి.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
తెలుగు సినిమా
నాగ వంశీ సూర్యదేవర
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10: బిగ్ బాస్ హౌస్ గోడ ఎక్కి పారిపోయేందుకు ప్రయత్నించిన కంటెస్టెంట్.. వైరల్ అవుతున్న వీడియో
Recommended image2
Venkatesh: వెంకీ అలాంటి సినిమాలకు పనికిరాడు అంటూ కామెంట్స్.. ఆ 4 మూవీస్ తోనే సూపర్ హిట్స్ కొట్టిన విక్టరీ
Recommended image3
Vijay Ajith Meet: లండన్‌లో విజయ్‌, అజిత్ ఐకానిక్‌ మీట్.. తలాని చూసి పరుగెత్తుకెళ్లి హగ్ చేసుకున్న దళపతి
Related Stories
Recommended image1
DC 3 Days Box Office: బాక్సాఫీసు దుమ్ములేపుతున్న లోకేష్‌ కనగరాజ్‌.. డీసీ మూవీకి అదిరిపోయే వసూళ్లు
Recommended image2
Korean Kanakaraju 3 Days Collections: బాక్సాఫీసు వద్ద కొరియన్‌ కనకరాజు రచ్చ.. వరుణ్‌ తేజ్‌ మూవీ 3 రోజుల వసూళ్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved