MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • DC 3 Days Box Office: బాక్సాఫీసు దుమ్ములేపుతున్న లోకేష్‌ కనగరాజ్‌.. డీసీ మూవీకి అదిరిపోయే వసూళ్లు

DC 3 Days Box Office: బాక్సాఫీసు దుమ్ములేపుతున్న లోకేష్‌ కనగరాజ్‌.. డీసీ మూవీకి అదిరిపోయే వసూళ్లు

DC 3 Days Box Office: డైరెక్టర్ అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో, మరో స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ హీరోగా నటించిన 'DC' సినిమా థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సినిమా మూడు రోజుల బాక్సాఫీస్ కలెక్షన్ల వివరాలు ఇప్పుడు చూద్దాం.

2 Min read
Author : Aithagoni Raju
Published : Aug 10 2026, 09:21 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
లోకేష్‌ కనగరాజ్‌ హీరోగా చేసిన మూవీ `డీసీ`
Image Credit : Asianet News

లోకేష్‌ కనగరాజ్‌ హీరోగా చేసిన మూవీ `డీసీ`

మాస్‌ దర్శకుడిగా స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నాడు లోకేష్‌ కనగరాజ్‌. ఆయన హీరోగా మారి `డీసీ` చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. తమిళ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన శైలిని క్రియేట్ చేసుకున్న డైరెక్టర్ అరుణ్ మాథేశ్వరన్ దీనికి దర్శకుడు కావడం విశేషం. ఈ చిత్రంలో వామికా గబ్బి, సంజన లాంటి వాళ్లు ముఖ్య పాత్రల్లో నటించారు. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందించారు. అరుణ్ మాథేశ్వరన్ గత సినిమాల్లోని మేకింగ్ స్టైల్ ఇప్పటికే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
లోకేష్ - అరుణ్ మాథేశ్వరన్ `డీసీ`కి మంచి స్పందన
Image Credit : X

లోకేష్ - అరుణ్ మాథేశ్వరన్ `డీసీ`కి మంచి స్పందన

అలాగే, లోకేష్ కనగరాజ్ కూడా డైరెక్టర్‌గా ఎన్నో హిట్ సినిమాలు ఇచ్చారు. ఇలాంటి ఇద్దరు తోపులు కలవడంతో పాటు, లోకేష్ మొదటిసారి హీరోగా నటించడంతో 'DC' సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. సినిమా రిలీజ్ అయ్యాక, అరుణ్ మాథేశ్వరన్ మార్క్ రా మేకింగ్ ఇందులో ఉన్నప్పటికీ, కథాంశం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. తల్లిదండ్రుల సపోర్ట్ లేకుండా పెరిగే పిల్లల జీవితాలు, చదువు ప్రాముఖ్యత వంటి విషయాలను కథతో ముడిపెట్టి చెప్పిన తీరుకి ప్రశంసలు వస్తున్నాయి.

Related Articles

Related image1
Korean Kanakaraju 3 Days Collections: బాక్సాఫీసు వద్ద కొరియన్‌ కనకరాజు రచ్చ.. వరుణ్‌ తేజ్‌ మూవీ 3 రోజుల వసూళ్లు
Related image2
Mega Family: ఓజీ నుంచి కొరియన్ కనకరాజు వరకు, మెగా ఫ్యామిలీ జోరు చూశారా.. ఇక మిగిలింది ఒక్కడే
34
నటుడిగా ఇరగదీసిన లోకేష్‌
Image Credit : Asianet News

నటుడిగా ఇరగదీసిన లోకేష్‌

డైరెక్టర్‌గా అందరికీ తెలిసిన లోకేష్, హీరోగా ఎలా ఉంటాడో అనే డౌట్ సినిమాకు ముందు అందరిలోనూ ఉండేది. కానీ, సినిమా చూశాక ఆయన నటన అందరినీ ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా, అనుభవం ఉన్న నటులతో కలిసి నటించిన సీన్లలో కూడా లోకేష్ తన పాత్రను అద్భుతంగా పోషించాడని అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. దీంతో, భవిష్యత్తులో లోకేష్ నటనపై కూడా ఫోకస్ పెడతాడేమో అనే ఆసక్తి మొదలైంది. సినిమా మేకింగ్, యాక్టింగ్, మ్యూజిక్ ఇలా అన్నింటికీ పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.

44
డీసీ మూవీ మూడు రోజుల కలెక్షన్లు
Image Credit : Asianet News

డీసీ మూవీ మూడు రోజుల కలెక్షన్లు

ఇదిలా ఉంటే, 'DC' సినిమా కలెక్షన్ల వివరాలు కూడా బయటకు వచ్చాయి. ప్రముఖ ట్రేడ్ సంస్థ సాక్నిల్క్ (Sacnilk) ప్రకారం, ఈ సినిమా మూడో రోజు సుమారు రూ.9.55 కోట్లు వసూలు చేసిందని తెలుస్తోంది. మొదటి రెండు రోజుల్లో సుమారు రూ.11 కోట్లు రాబట్టినట్లు సమాచారం. దీంతో మూడు రోజులు కలిపి ఇండియాలో ఈ సినిమా మొత్తం రూ.20.95 కోట్ల నెట్‌ కలెక్షన్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. గ్రాస్‌ రూ.24.11కోట్లు వచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా దీనికి మూడు రోజుల్లో 31.86కోట్లు రావడం విశేషం. సినిమాకు పాజిటివ్ టాక్, అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుండటంతో, రాబోయే రోజుల్లో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉందని బాక్సాఫీస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
తమిళ సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss: 50, 100 కోట్లు కాదు.. సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే, సినిమాల కంటే ఇదే బావుందే
Recommended image2
Maa Ramudu Andarivadu: సీఎం పాత్రలో హీరో సుమన్.. ట్విస్టులు అదిరిపోతాయి, హిట్ గ్యారెంటీ అంటూ కామెంట్స్
Recommended image3
OG Universe: ఇదీ పవన్ కళ్యాణ్ కి అసలైన బర్త్ డే గిఫ్ట్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న ఓజీ యూనివర్స్ వీడియో
Related Stories
Recommended image1
Korean Kanakaraju 3 Days Collections: బాక్సాఫీసు వద్ద కొరియన్‌ కనకరాజు రచ్చ.. వరుణ్‌ తేజ్‌ మూవీ 3 రోజుల వసూళ్లు
Recommended image2
Mega Family: ఓజీ నుంచి కొరియన్ కనకరాజు వరకు, మెగా ఫ్యామిలీ జోరు చూశారా.. ఇక మిగిలింది ఒక్కడే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved