- Home
- Entertainment
- Janaki Kalaganaledu: జానకి చదువు గురించి నిజం తెలుసుకున్న రామచంద్ర.. ఆలోచనలో పడ్డ జ్ఞానంబ!
Janaki Kalaganaledu: జానకి చదువు గురించి నిజం తెలుసుకున్న రామచంద్ర.. ఆలోచనలో పడ్డ జ్ఞానంబ!
Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమయ్యే జానకి కలగనలేదు (Janaki Kalaganaledu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. రామచంద్ర డబ్బును లాకర్లో పెడుతుండగా డబ్బు కింద పడిపోతుంది. ఈ లోపు జ్ఞానాంబ (Jnanaamba) అక్కడకు వచ్చి ఈ డబ్బును నేను లోపల పెడతాను అని అంటుంది.

ఇదే క్రమంలో జ్ఞానాంబ (Jnanaamba) అబ్బాయి సర్టిఫికెట్స్ చూసాడా అని ఆలోచిస్తుంది. మరోవైపు మల్లిక వాళ్ళ నానమ్మ దగ్గరకు వచ్చి ఇంట్లో నాకు గుర్తింపు లేదని ఫన్నీగా ఏడుస్తుంది. దాంతో వాళ్ళ నానమ్మ మల్లికకు ఒక సలహా ఇస్తుంది. మరోవైపు జానకి రామచంద్ర (Ramachandra) లు బైక్ పైన వెళుతూ ఉండగా ఒక అమ్మాయి బుక్స్ చించుకుంటూ ఏడుస్తుంది.
ఇక దాంతో జానకి (Janaki) , రామచంద్రలు అమ్మాయి దగ్గరికి వెళ్లి నీ బాధ ఏమిటమ్మా అని అడుగుతారు. ఇక అమ్మాయి నేను కాలేజ్ టాపర్ ని బాగా చదువుతాను. కానీ నన్ను ఒక ఎంపీ కొడుకు హారాస్ చేస్తున్నాడు అని ఏడుస్తుంది. దాంతో రామచంద్ర (Rama chandra) తనకు పరిచయమైన ఎస్ పి కి కాల్ చేసి ప్రాబ్లం సాల్వ్ చేస్తాడు.
ఇక ఆ అమ్మాయి వారిద్దరికీ థాంక్స్ చెప్పి వెళ్లిపోతుంది. తర్వాత రామచంద్ర (Rama chandra) ' మీ చేతిలో అధికారం ఉంటే ఈ సమస్యను మీరు క్షణాల్లో పరిష్కరించేవారు' అని జానకితో అంటాడు. ఇక రామచంద్ర , జానకి (Janaki) ను ఒక చోటికి తీసుకు వెళ్లి నువ్వు ఐపీఎస్ చేయకూడదు అని నిర్ణయం తీసుకోవడానికి కారణం మా అమ్మ కదా అని అడుగుతాడు.
ఇక జానకి (Janaki) అలాంటిదేం లేదు. పైగా నన్ను చదువుకోమని అత్తయ్య గారు చెప్పారు కదా అని అంటుంది. దాంతో రామచంద్ర (Ramachandra) అందుకే నీ సర్టిఫికెట్స్ లాకర్లో దాచి పెట్టిందా అని అసలు నిజాన్ని బయట పడతాడు. దాంతో జానకి ఎంతో ఎమోషనల్ అవుతుంది.
ఆ తరువాత రామచంద్ర (Ramachandra) ,జానకి కు వాళ్ళ నాన్న ఇచ్చిన పెన్ ను బయటికి తీసి ' మీ నాన్నగారు ఇచ్చిన ఈ పెన్ ను మీ నాన్నగారి పక్కన సమాధి చేసేయ్' నీ కలని అందరూ కన్న కలని సమాధి చేసేయ్ అని జానకి (Janaki) తో చెబుతాడు. ఇక ఈ క్రమంలో రేపటి భాగం లో ఏం జరుగుతుందో చూడాలి.