Rambha: కెనడాలో 2000 కోట్ల ఆస్తులు వదులుకుని ఇండియాకి రంభ.. రీఎంట్రీపై హింట్
Rambha: సౌత్, బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన నటి రంభ 2010లో పెళ్లి చేసుకుని విదేశాల్లో స్థిరపడ్డారు. అప్పటి నుంచి ఆమె సినిమాలకు దూరంగా ఉన్నారు. కానీ ఇప్పుడు రీ ఎంట్రీకి ప్లాన్ చేస్తున్నారట.

గ్లామర్‌తో ఆడియెన్స్ ని షేక్ చేసిన రంభ
ఒకప్పటి నటి రంభ పేరు వింటే చాలు, కుర్రాళ్ల గుండెల్లో హై వోల్టేజ్ కరెంట్ పాసయ్యేది. అంతటి అందమైన నటి ఆ రోజుల్లో అరుదు అనేంతలా తన అందంతో తెరపై మెరిసింది రంభ. తెలుగు, తమిళం, కన్నడతోపాటు హిందీలో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన నటి రంభ 2010లో పెళ్లి చేసుకుని విదేశాల్లో స్థిరపడ్డారు. అప్పటి నుంచి ఆమె సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఆమె మళ్లీ కమ్ బ్యాక్ కాబోతుందట. అదిరిపోయే న్యూస్ చెప్పబోతుందట.
టాప్ స్టార్స్ అందరితోనూ కలిసి నటించిన రంభ
నటి రంభ తన కాలంలో అంటే 90వ దశకం నుంచి 2010 వరకు దాదాపు అందరు స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఎక్కువగా గ్లామరస్ పాత్రల్లో కనిపించినా, నటనకు ఆస్కారమున్న బలమైన పాత్రల్లోనూ మెప్పించారు. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, జగపతి బాబు, సూపర్ స్టార్ రజనీకాంత్, విజయ్, సూర్య, కమల్ హాసన్ లాంటి ఎందరో స్టార్స్‌తో రంభ నటించారు. కన్నడలో శివరాజ్‌కుమార్, రవిచంద్రన్‌తో కూడా నటించి అక్కడి ప్రేక్షకులకు దగ్గరయ్యారు.
2000 కోట్లకు అధిపతి రంభ
రంభ 2010లో ఇంద్రకుమార్ పద్మనాథన్‌ని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత కెనడాలో సెటిల్ అయ్యారు. ఇప్పుడు అక్కడే ఉంటున్నారు. మ్యారేజ్ తర్వాత సినిమాలకు దూరమయ్యింది రంభ. అక్కడ భారీగానే ఆస్తులు సంపాదించారట. రంభ ఆస్తి ఏకంగా 2000 కోట్లు అనేది ఇప్పుడు పెద్ద వార్త. ఇటీవల ఓ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కలైపులి థాను మాట్లాడుతూ.. 'రంభ 2000 కోట్ల ఆస్తికి యజమానురాలు' అన్నారు. ఆమె భర్త 5 కంపెనీలు నడుపుతున్నారని, అందులో ఒకదానికి రంభ పేరు పెట్టారని, కొన్ని కంపెనీలు చెన్నైలో కూడా ఉన్నాయని సీక్రెట్ బయటపెట్టారు.
సినిమాల్లోకి రీఎంట్రీకి రంభ ప్లాన్
90వ దశకంలో ఓ వెలుగు వెలిగిన ఈ నటి, 2010లో కెనడాలో స్థిరపడిన ఇంద్రకుమార్ పద్మనాథన్‌ను పెళ్లి చేసుకున్నారు. వారికి ముగ్గురు పిల్లలు. పిల్లలు ఇప్పుడు పెద్దవాళ్లయ్యారు. అందుకే రంభ మళ్లీ నటించాలని అనుకుంటున్నారు. ఇది గాసిప్ కాదు, స్వయంగా రంభనే ఈ విషయం చెప్పారు. ఫిల్మ్ ఫెస్టివల్‌కు వచ్చిన రంభ, 'నా పిల్లలు ఇప్పుడు పెద్దవాళ్లయ్యారు. నా బాధ్యతలు చాలా వరకు తీరిపోయాయి. ఇప్పుడు నేను మళ్లీ సినిమాల్లో నటించగలను' అని అన్నారు.
రంభ టాలెంట్‌ని ఇండస్ట్రీ మరోసారి ఉపయోగించుకుంటుందా?
తనకు సరైన అవకాశం వస్తే మళ్లీ నటిస్తానని చెప్పారు. ఇప్పుడు బంతి సినీ పరిశ్రమ కోర్టులోకి వచ్చింది. రంభకు సరైన అవకాశం ఇస్తే, ఆమె తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నారు. మొత్తానికి, 2010 తర్వాత, దాదాపు 16 ఏళ్ల తర్వాత రంభ అభిమానులు ఆమెను మళ్లీ తెరపై చూడొచ్చు. రంభకు సరిపోయే పాత్రను దర్శకులు సృష్టిస్తే, ఆమెకు నచ్చితే, ఫ్యాన్స్ మళ్లీ రంభను స్క్రీన్‌పై చూడొచ్చు. మరి అది ఎప్పుడు జరుగుతుందో చూడాలి.

