- Home
- Entertainment
- Poonam Kaur: ఆ స్టార్ హీరోని తన భార్యాపిల్లల వద్దకు వెళ్లకుండా చేశాడు.. డైరెక్టర్ దారుణాలు బయటపెట్టిన పూనమ్ కౌర్
Poonam Kaur: ఆ స్టార్ హీరోని తన భార్యాపిల్లల వద్దకు వెళ్లకుండా చేశాడు.. డైరెక్టర్ దారుణాలు బయటపెట్టిన పూనమ్ కౌర్
పూనమ్ కౌర్ చాలా రోజుల తర్వాత బయటకు వచ్చింది. మొదటిసారి ఆమె తాను ఫేస్ చేసిన సంఘటనలను, తాను ఎదుర్కొన్న ఇబ్బందులను పంచుకుంది. ఈ క్రమంలో ఓ నటుడు, దర్శకుడిపై సంచలన ఆరోపణలు చేసింది.

టాలీవుడ్‌లో దుమారం రేపుతున్న పూనమ్ కౌర్ కామెంట్స్
నటి పూనమ్ కౌర్ మొదటిసారి బయటకు వచ్చింది. ఎప్పుడూ ట్విట్టర్‌లో ట్వీట్‌లతో దుమారం రేపే ఆమె ఇటీవల ఎట్టకేలకు బయటకు వచ్చింది. ఆమె కామెంట్స్ ఇండస్ట్రీలో దుమారం రేపుతున్నాయి. ఓ యూట్యూబ్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పూనమ్ కౌర్ పలు షాకింగ్ ఆరోపణలు చేసింది. తనని కొందరు బెదిరించినట్టు తెలిపింది. ఒక నటుడికి వ్యతిరేకంగా మాట్లాడాలని కడప నుంచి వచ్చిన కొందరు బెదిరించారని, అలా మాట్లాడకపోతే తన న్యూడ్ వీడియోలు మార్కెట్‌లో విడుదల చేస్తామని బెరదించినట్టు ఓపెన్‌గా చెప్పింది.
పోసాని వల్లే తన జీవితం నాశనం
మరోవైపు నటుడు పోసాని గురించి కూడా సంచలన వ్యాఖ్యలు చేసింది. తన పెళ్లి జీవితాన్ని నాశనం చేశాడని ఆరోపించింది. అదే ఇంటర్వ్యూలో ఓ స్టార్ డైరెక్టర్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆయన చేసిన ఆగడాలను వెల్లడించింది. ఓ స్టార్ హీరో ఫ్యామిలీ లైఫ్‌ని నాశనం చేసింది ఆయనే అని వెల్లడించింది. గురువు గురువు అంటుంటారు, ఫ్రెండ్ జీవితాన్నే ఆగం చేశాడంటూ వ్యాఖ్యానించింది. ఇలాంటి దారుణాలు చేసే వ్యక్తిని గురువుగా భావిస్తారా? అని వెల్లడించింది.
హీరో తన భార్యాపిల్లల వద్దకు వెళ్లకుండా ఆ దర్శకుడే అడ్డుకున్నాడు
ఇంతకి పూనమ్ కౌర్ ఏం చెప్పిందంటే, ఆ యాక్టర్ తన భార్యాపిల్లల వద్దకు వెళ్లాలనుకున్నప్పుడు ఆ డైరెక్టర్ వెళ్లనివ్వకుండా అడ్డుకున్నాడు. అందరు భార్యల విషయంలో ఇదే చేశాడు. అందరు నన్ను అబ్యూస్ చేశారు, ఆయన్ని అబ్యూస్ చేశారు. ఆ పెళ్లిళ్లు, ఈ పెళ్లిళ్లు అంటూ నానా రకాలుగా తిట్టారు. కానీ ఇంత జరుగుతున్నా, ఆ యాక్టర్ తన పిల్లల వద్దకు వెళ్లకపోవడానికి కారణం నేను అని ఆ దర్శకుడు ఎప్పుడూ ఒప్పుకోలేదు. ఫ్రెండ్స్ లైఫ్ ని, నా లైఫ్‌ని నాశనం చేసిన వ్యక్తిని గురువుగా భావిస్తారా? ఒక గురువు స్నేహితుడి జీవితాన్ని అలా చేస్తారా? అలాంటి వ్యక్తిని గురువు అంటారా? గురువుగా ఆయన అర్హుడా. ఇదంతా కేవలం డబ్బు కోసమే చేశారు` అని సంచలన ఆరోపణలు చేసింది పూనమ్ కౌర్. సిగ్నేచర్ స్టూడియోకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను పంచుకుంది.
పూనమ్ కౌర్ కామెంట్స్ చేసిన దర్శకుడు, నటుడు ఎవరు?
ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో, ఇండస్ట్రీలో దుమారం రేపుతున్నాయి. కొందరు ఆమె వ్యాఖ్యలను తప్పుపడుతుంటే, మరికొందరు ఆమె నిజమే చెప్పిందంటున్నారు. ఆమె వీడియో క్లిప్‌లను వైరల్ చేస్తున్నారు. మరి పూనమ్ కౌర్ చెప్పిన ఆ గురువు ఎవరు? అనేది ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో ఆ నటుడు ఎవరనేది కూడా ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. ఇండస్ట్రీలో పూనమ్ కౌర్ ఎక్కువగా ఒక దర్శకుడు, ఒక హీరో గురించి అనేక ఆరోపణలు చేస్తూ వచ్చింది. ఇప్పుడు కూడా వారిని ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేసిందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కాకపోతే పూనమ్ కౌర్ మాత్రం వారి పేర్లని ప్రస్తావించలేదు. కానీ ఆమె ఉపయోగించిన `గురువు, నటుడు` అనే పదాలతోనే వాళ్లు ఎవరనేది జనాలకు అర్థమైపోతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

