MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Ramayana trailer: 4 నిమిషాల ట్రైలర్ లో సినిమా మొత్తం.. రామాయణలో రావణుడి పాత్రనే హైలెట్ చేశారా?

Ramayana trailer: 4 నిమిషాల ట్రైలర్ లో సినిమా మొత్తం.. రామాయణలో రావణుడి పాత్రనే హైలెట్ చేశారా?

Ramayana trailer: దేశ వ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రామాయణ ట్రైలర్ రానే వచ్చింది. 4 నిమిషాల 10 సెకండ్ల ఈ ట్రైలర్ లో.. రావణుడి పాత్రను ఎంత పవర్ ఫుల్ గా చూపించారో తెలుసా? ట్రైలర్ లోనే సినిమా అంతా చూపించారుగా?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 30 2026, 07:52 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
బ్రహ్మ ముహూర్తంలో విడుదలైన ట్రైలర్‌
Image Credit : Asianet News

బ్రహ్మ ముహూర్తంలో విడుదలైన ట్రైలర్‌

నితేష్ తివారీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'రామాయణం' మొదటి ట్రైలర్ ఎట్టకేలకు విడుదలైంది. భారతీయులు ఎంతో పవిత్రంగా భావించే రామాయణ మహాకావ్యం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, కన్నడ రాకింగ్ స్టార్ యశ్ రావణాసురుడిగా , సాయి పల్లవి సీతగా నటిస్తున్నారు. 'నమిత్ మల్హోత్రా' నేతృత్వంలోని డిఎన్ఇజి (DNEG), ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ తో కలిసి యశ్ కూడా ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామిగా ఉన్నారు. జూలై 30న వేకువజామున 4:15 గంటలకు బ్రహ్మ ముహూర్తంలో ఈ ట్రైలర్‌ను విడుదల చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
రావణాసురుడి పాత్రతో మొదలుపెట్టి..
Image Credit : X

రావణాసురుడి పాత్రతో మొదలుపెట్టి..

ట్రైలర్ ఆరంభంలో ముందుగా రావణుడి పాత్రనే పరిచయం చేశారు. రావణాసురుడి పాత్రలో యశ్ "గర్జించే రాక్షస రాజు"గా ఎంట్రీ ఇస్తాడు. లంకానగరం, పుష్పక విమానం, రావణుడి లంకాధిపత్యం వంటి దృశ్యాలు విజువల్ వండర్‌గా అలరించాయి. ఆ తర్వాత శ్రీరాముడి పాత్రలో రణ్‌బీర్ కపూర్ గుర్రపు స్వారీ చేస్తూ, సీతాదేవితో గడిపే సన్నివేశాలు ఎంతో మనోహరంగా కనిపిస్తాయి. సీతాదేవిగా నటించిన సాయి పల్లవి తన ప్రశాంతమైన నటన, సహజమైన సౌందర్యంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ముఖ్యంగా ఆమె హిందీ భాషా ఉచ్చారణ ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటోంది.

34
బ్యాగ్ గ్రౌండ్ మ్యూజిక్ హైలెట్..
Image Credit : Youtube Screenshot@WorldOfRamayana

బ్యాగ్ గ్రౌండ్ మ్యూజిక్ హైలెట్..

శ్రీరామ సీతల కళ్యాణం, ఆ తర్వాత కైకేయి నిర్ణయం వల్ల శ్రీరాముడు, సీత, లక్ష్మణులు అరణ్యవాసానికి వెళ్లడం, దశరథ మహారాజు విలపించడం వంటి భావోద్వేగ సన్నివేశాలు ట్రైలర్‌లో ఆకట్టుకున్నాయి. లక్ష్మణుడిగా రవి దూబే, కైకేయిగా లారా దత్తా, దశరథుడిగా అరుణ్ గోవిల్ నటించారు. ప్రముఖ సంగీత దర్శకులు ఎ.ఆర్. రెహమాన్ , హన్స్ జిమ్మర్ కాంబినేషన్‌లో వచ్చిన నేపథ్య సంగీతం ఈ ట్రైలర్‌కు ప్రధాన బలంగా నిలిచింది.

44
రామాయణ రిలీజ్ ఎప్పుడంటే?
Image Credit : Youtube Screenshot@WorldOfRamayana

రామాయణ రిలీజ్ ఎప్పుడంటే?

అయితే 4 నిమిషాల ట్రైలర్ లో సినిమా అంతా చూపించేశారు మేకర్స్.. కాన్సెప్ట్ అందరికి తెలిసిందే.. కానీ విజ్యువల్స్ ఎఫెక్ట్స్ ఎలా ఉండబోతున్నాయో ఆడియన్స్ కు టేస్ట్ తెలిసేలా చేశారు. అంతే కాదు రావణాసురుడి పాత్రను చాలా పవర్ ఫుల్ గా చూపించడంతో పాటు.. ఎక్కువ స్పేస్ ఇచ్చినట్టు ట్రైలర్ లో తెలుస్తోంది. మరి సినిమాలో ఎలా ఉండబోతుందో చూడాలి. ఎంత హైలెట్ అయినా.. చివరికి రాముడి చేతిలో రావణుడు అంతం కాక తప్పదు. 

ఇక ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ ప్రమాణాలతో రూపుదిద్దుకున్న ఈ సినిమా పంపిణీ బాధ్యతలను సోనీ పిక్చర్స్ దక్కించుకుంది. ఇటీవల అమెరికాలోని ‘శాన్ డియాగో కామిక్-కాన్ 2026’ వేదికపై కూడా ఈ సినిమా ప్రత్యేక దృశ్యాలను ప్రదర్శించారు. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'రామాయణం: పార్ట్-1' ఈ ఏడాది దీపావళి కానుకగా నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్
సాయి పల్లవి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: అమన్ పప్పుగాడు కాదు, రామ్ ప్రసాద్ కన్నింగ్ కాదు, బిగ్ బాస్ హౌస్ లో నాగార్జున చెప్పిన చాణక్యుడు ఎవరంటే?
Recommended image2
Dhanush: కొడుకులే బాడీగార్డ్స్.. యాత్ర, లింగాలతో కలిసి పళని మురుగన్ గుడికి ధనుష్
Recommended image3
డైలాగ్ వింటేనే వణుకు పుడుతుంది... ఆడియన్స్ 100 మార్కులు వేసిన ఈ హారర్ సినిమా గుర్తుందా?
Related Stories
Recommended image1
krishna: నీతో సినిమా చేస్తే అడ్రస్‌ గల్లంతే, కృష్ణను భయపెట్టిన స్టార్‌ ప్రొడ్యూసర్‌.. సూపర్‌ స్టార్‌ దెబ్బకి రికార్డులు బ్రేక్‌
Recommended image2
Jana Nayagan: దళపతి విజయ్ సినిమా బోల్తా కొట్టడానికి 5 ప్రధాన కారణాలు.. జన నాయగన్ కలెక్షన్స్ ఎంత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved