వెంకటేష్ డాన్స్ పై రామానాయుడు కంప్లెయింట్.. `కలిసుందాం రా` సెట్‌లో జరిగిన ఘటనతో తండ్రి సంచలన నిర్ణయం
విక్టరీ వెంకటేష్ డాన్స్ పై తండ్రి రామానాయుడు కంప్లెయింట్ చేశారు. దీంతో వెంకీ సినిమా షూటింగ్‌లో జరిగిన ఘటనతో ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు.
విక్టరీ వెంకటేష్..అత్యధిక సక్సెస్ రేట్ ఉన్న హీరోగా పేరుతెచ్చుకున్నారు. వెంకటేష్‌తో సినిమా అంటే అప్పట్లో మినిమమ్ గ్యారంటీ అనే టాక్ ఉండేది. ఇంటిళ్లిపాది చూసే సినిమాలే ఆయన ఎక్కువగా చేశారు. ఫ్యామిలీ ఆడియెన్స్ కి బాగా దగ్గరయ్యారు. తన యాక్షన్‌తోపాటు అద్భుతమైన కామెడీ ఆయనకు బిగ్గెస్ట్ అసెట్. రీల్ లైఫ్‌లోనే కాదు, రియల్ లైఫ్ లో కూడా అంతే సరదాగా ఉండే హీరో వెంకటేష్ మాత్రమే. స్టార్ హీరోగా రాణిస్తున్నా, డౌన్ టూ ఎర్త్ ఉండటం ఆయనకే సాధ్యం.
వెంకటేష్ సక్సెస్‌లో ఆయన తండ్రి రామానాయుడు పాత్ర చాలా ఉంది. స్క్రిప్ట్ సెలక్షన్‌లోనూ, సినిమా సెట్‌లోనూ, సినిమా బాగా రావడంలోనూ ఆయన పాత్ర చాలా కీలకంగా ఉందని చెప్పొచ్చు. సినిమా ఔట్‌పుట్ నచ్చకపోతే మళ్లీ రీ షూట్ చేసిన సంఘటనలు చాలా ఉన్నాయి. అందుకే వెంకీ నటించిన చాలా సినిమాలు బాక్సాఫీసు వద్ద మంచి ఆదరణ పొందాయి. హిట్లు అయ్యాయి. కొన్ని నిరాశ చెందినా, మరీ డిజాస్టర్ అని చెప్పుకునే సినిమాలు లేవనే చెప్పాలి. తండ్రి మరణించిన తర్వాత వెంకీ స్క్రిప్ట్ సెలక్షన్ తేడా కొడుతుంది. అన్న సురేష్ బాబు ఉన్నా, ఫ్లాప్‌లు తప్పడం లేదు.
ఈ క్రమంలో వెంకటేష్, రామానాయుడు మధ్య జరిగిన ఓ ఆసక్తికర సంఘటన తెరపైకి వచ్చింది. `కలిసుందాం రా` సెట్‌లో జరిగిన ఘటనతో రామానాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై సినిమా సెట్‌కి వెళ్లడమే మానేశాడట. మరి ఇంతకి ఏం జరిగిందంటే. `కలిసుందాం రా` సినిమాకి సంబంధించి ఓ సాంగ్ షూటింగ్ జరుగుతుందట. వెంకీ ఓ డాన్స్ మూమెంట్ సరిగా రావడం లేదు. అది షూటింగ్‌లోనే ఉన్న తండ్రి రామానాయుడుకి అర్థమవుతుంది.
దీంతో సరి చేసే ప్రయత్నం చేశాడు. అయినా వెంకీ చేయలేకపోతున్నాడు. ఇలా అని చేసి చూపించాడట. అయినా వెంకీ సరిగా చేయడం లేదు. ఇది గమనించిన కెమెరామెన్ రామానాయుడుని సెట్ నుంచి పంపించాడట. మీరు బయటకు వెళ్లిపోండి, మీరు ఉండటం వల్ల బాబు(వెంకీ) ఇబ్బంది పడుతున్నాడని చెప్పాడట.
దీంతో వాస్తవం గమనించిన రామానాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. వెంకటేష్ సినిమాల షూటింగ్‌లకు వెళ్లడమే మానేశాడట. ఆ రోజు నుంచి ఇంకా ఎప్పుడూ వెంకటేష్ సినిమా సెట్‌లోకి వెళ్లలేదని తెలిపారు రామానాయుడు.
ఓ పాత ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం అది వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే నేడు(డిసెంబర్ 13) వెంకటేష్ పుట్టిన రోజు. 64వ బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన ఆసక్తికర విషయాలు వైరల్ అవుతున్నాయి. 2000లో వచ్చిన `కలిసుందాం రా` సినిమా పెద్ద విజయం సాధించింది. దీనికి ఉదయ్ శంకర్ దర్శకత్వం వహించారు. సిమ్రాన్ హీరోయిన్‌గా నటించింది.
ప్రస్తుతం వెంకటేష్ `సంక్రాంతికి వస్తున్నాం` అనే సినిమాలో హీరోగా నటిస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. ఐశ్వర్యా రాజేష్, మీనాక్షి చౌదరీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ రూపొందుతుంది. ఇది సంక్రాంతికి విడుదల కాబోతుంది. గత సంక్రాంతికి `సైంధవ్` సినిమాతో వచ్చి నిరాశ చెందారు వెంకీ. ఈ సంక్రాంతికి అయినా హిట్ కొడతాడా అనేది చూడాలి.
read more: బిగ్ షాక్.. అల్లు అర్జున్ అరెస్ట్ ?.. అదుపులోకి తీసుకున్న చిక్కడపల్లి పోలీసులు
also read: వారం రోజుల వ్యవధిలో బాలయ్య రికార్డు బద్దలు, నాగార్జున స్టామినా అది.. చిరంజీవికి చెమటలు పట్టించేలా..