బిగ్ షాక్.. అల్లు అర్జున్ అరెస్ట్ .. అదుపులోకి తీసుకున్న చిక్కడపల్లి పోలీసులు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి, పుష్ప 2 చిత్ర యూనిట్ కి ఇది బిగ్ షాక్ అనే చెప్పాలి. పుష్ప 2 మూవీ రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద విషాదకర సంఘటన చోటు చేసుకుంది. థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ మరణించారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి, పుష్ప 2 చిత్ర యూనిట్ కి ఇది బిగ్ షాక్ అనే చెప్పాలి. పుష్ప 2 మూవీ రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద విషాదకర సంఘటన చోటు చేసుకుంది. థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ మరణించారు. ఈ సంఘటనకి సంబంధించి విచారణ కోసం పోలీసులు అల్లు అర్జున్ ని అదుపులోకి తీసుకున్నారు.
బన్నీని అరెస్ట్ చేసినట్లు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఒక్కసారిగా బన్నీ అభిమానుల్లో గందరగోళం పెరిగింది. తొక్కిసలాట, మహిళ మృతి సంఘటనలో పోలీసులు థియేటర్ యాజమాన్యంపై, అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే థియేటర్ ఓనర్స్ ని అరెస్ట్ చేశారు. తాజాగా అల్లు అర్జున్ ని కూడా అరెస్ట్ చేయడంతో కేసు సంచలన మలుపు తిరిగింది.
అసలు థియేటర్ వద్ద ఏం జరిగింది ?
డిసెంబర్ 4 బుధవారం సాయంత్రం నుంచి పుష్ప 2 చిత్ర ప్రీమియర్ షోలు ప్రారంభం అయ్యాయి. అభిమానుల హంగామా ఎక్కువగా ఉండే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య థియేటర్ లో కూడా ప్రీమియర్స్ ప్రదర్శించారు. రాత్రి 9 గంటల 40 నిమిషాలకు సంధ్య థియేటర్ లో పుష్ప 2 ప్రీమియర్ ప్రారంభించారు. పోలీసులు చెబుతున్నదాని ప్రకారం.. సంధ్య థియేటర్ వద్దకి చిత్ర యూనిట్, అల్లు అర్జున్ వస్తారని ముందస్తు సమాచారం ఇవ్వలేదట.
అప్పటికే థియేటర్ మొత్తం కిక్కిరిసిపోయింది. థియేటర్ బయట కూడా భారీ ఎత్తున జనాలు పోగయ్యారు. సరిగ్గా 9. 40కి అల్లు అర్జున్ థియేటర్ వద్దకు ప్రేక్షకులని కలుసుకునేందుకు వచ్చారు. బన్నీ రాగానే ఒక్కసారిగా తోపులాట జరిగింది. అల్లు అర్జున్ భద్రతా సిబ్బంది ప్రేక్షకులని కంట్రోల్ చేసే క్రమంలో కొంతమంది ప్రేక్షకులు కిందపడిపోయారు. వారిలో దిల్ సుఖ్ నగర్ కి చెందిన రేవతి, ఆమె ఆమె కుమారుడు శ్రీతేజ కింద పడిపోయారు. తొక్కిసలాటలో వారికి ఊపిరి ఆడలేదు.
ఆమె కుమారుడు శ్రీతేజకి సిపిఆర్ చేసి ఆసుపత్రికి తరలించారు. కానీ రేవతి మాత్రం అప్పటికే మృతి చెందింది అని వైద్యులు తెలిపారు. ఈ సంఘటన నేపథ్యంలో అల్లు అర్జున్ పై, థియేటర్ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ ని విచారించేందుకు పోలీసులు అతడిని తాజాగా అదుపులోకి తీసుకున్నారు. విచారణ ఎలా జరగబోతోంది ? పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనే విషయంలో ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరణించిన రేవతి కుటుంబానికి అల్లు అర్జున్ పాతిక లక్షల సహాయం ప్రకటించిన సంగతి తెలిసిందే.
అల్లు అర్జున్ అరెస్ట్ అయిన విషయాన్ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసే సమయంలో కుటుంబ సభ్యులు అల్లు అరవింద్,స్నేహ రెడ్డి అభ్యంతరం తెలిపారట. అల్లు అర్జున్ అరెస్ట్ అవుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంత పెద్ద వివాదానికి కారణం అయిన పుష్ప 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద 1000 కోట్ల వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది.
సంధ్య థియేటర్ కేసులో అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసిన పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. BNS 118(1), BNS 105, రెడ్ విత్ 3/5 BNS సెక్షన్ల కింద కేసు, 105 సెక్షన్ నాన్‍బెయిలబుల్ కేసు నమోదైనట్లు తెలుస్తోంది. బన్నీపై అభియోగాలు నిజమైతే 5 నుంచి 10 ఏళ్ళ శిక్షపడే అవకాశం అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. BNS118(1) కింద ఏడాది నుంచి 10 ఏళ్ళ శిక్షపడే అవకాశం అవకాశం ఉన్నట్లు సమాచారం.