MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • వారం రోజుల వ్యవధిలో బాలయ్య రికార్డు బద్దలు, నాగార్జున స్టామినా అది.. చిరంజీవికి చెమటలు పట్టించేలా..

వారం రోజుల వ్యవధిలో బాలయ్య రికార్డు బద్దలు, నాగార్జున స్టామినా అది.. చిరంజీవికి చెమటలు పట్టించేలా..

1994లో నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డారు. వారం రోజుల వ్యవధిలో బాలయ్య, నాగార్జున నటించిన చిత్రాలు విడుదలయ్యాయి. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Dec 12 2024, 08:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

కృష్ణ, ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు హవా ముగిసిన తర్వాత చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డారు. వీరి మధ్య పోటీ 90 వ దశకంలో  పీక్ స్టేజికి చేరింది. ఈ నలుగురు హీరోలు 90వ దశకంలో పోటా పోటీగా సినిమాల్లో నటిస్తూ సూపర్ హిట్స్ అందుకున్నారు. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

1994లో నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డారు. వారం రోజుల వ్యవధిలో బాలయ్య, నాగార్జున నటించిన చిత్రాలు విడుదలయ్యాయి. ఆ రెండు చిత్రాలు ఈ ఇద్దరి హీరోల కెరీర్ లో చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రాలే. బాలయ్య నటించిన భైరవ ద్వీపం చిత్రం ఏప్రిల్ 14న 1994లో విడుదలయింది. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. 

34

భైరవద్వీపం చిత్రం సంచలన విజయం సాధించింది. దాదాపు 8 కోట్ల వరకు వసూళ్లు సాధించింది. జానపద చిత్రంగా తెరకెక్కిన భైరవ ద్వీపం మూవీ అప్పట్లో ప్రేక్షకులని అబ్బురపరిచింది. 1994 ఏడాదికి ఇదే బిగ్గెస్ట్ హిట్ అని అనుకున్నారు. కానీ వారం రోజుల వ్యవధిలో విడుదలైన నాగార్జున హలో బ్రదర్ చిత్రం భైరవ ద్వీపం రికార్డులు చెరిపివేస్తూ దాదాపు 9 కోట్ల వరకు వసూళ్లు సాధించింది. అప్పటి వరకు అత్యధికంగా ఉన్న ఘరానామొగుడు రికార్డుకి హలో బ్రదర్ దాదాపుగా చేరువగా వెళ్ళింది. 

44

చిరంజీవి రికార్డుకి చెమటలు పట్టించినంత పని అయింది. ఇండస్ట్రీకి హిట్ కి కొద్ది దూరంలో నిలిచిపోయింది హలో బ్రదర్. ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో రొమాంటిక్ కామెడీ చిత్రంగా తెరకెక్కిన హలో బ్రదర్ మాస్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
అక్కినేని నాగార్జున
నందమూరి బాలకృష్ణ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Vijay Ajith Race: లండన్‌లో అరుదైన సీన్.. అజిత్ రేస్‌కు జెండా ఊపనున్న విజయ్..
Recommended image2
Bigg Boss 10: ఈ బిగ్ బాస్ హౌస్ లో ఎవరి వయసు ఎంత? ఏజ్ లో చిన్న ఎవరు?
Recommended image3
Vishwanath & Sons: రూ.250 కోట్ల సినిమా ఓటీటీలోకి..చాలా ఏళ్ళ తర్వాత సూర్య నుంచి వచ్చిన కంప్లీట్ ఫ్యామిలీ మూవీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved