- Home
- Entertainment
- Janaki Kalaganaledu: జెస్సి ముందు దొంగ ప్రేమలు నటిస్తున్న అఖిల్.. రామచంద్రకు అబద్ధం చెప్పిన జానకి?
Janaki Kalaganaledu: జెస్సి ముందు దొంగ ప్రేమలు నటిస్తున్న అఖిల్.. రామచంద్రకు అబద్ధం చెప్పిన జానకి?
Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ మంచి కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబం పరువుతో కూడిన కాన్సెప్ట్ తో ఈ సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు నవంబర్ 20 వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం..

ఈ రోజు ఎపిసోడ్లో అఖిల్ చదువుకుంటూ ఉండగా జెస్సీ ఇల్లు శుభ్రం చేస్తూ ఉంటుంది. అప్పుడు జెస్సీ అనుకోకుండా కాలుజారి కింద పడిపోతూ ఉండగా ఇంతలో జానకి వచ్చి పట్టుకొని నీకు ఇలాంటి పనులన్నీ ఎందుకు చేసి నాకు చికితకు చెబితే మేము చేసుకుంటాము కదా చూడు ఎంత ప్రమాదం తప్పిందో ఇంకొకసారి ఇలాంటి పనులు చేయకు సరే ఈ టిఫిన్ తిను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జానకి. అప్పుడు అఖిల్ వదిన చెప్పినట్టుగా నీకు ఇవన్నీ ఎందుకు జెస్సి నేను చూసుకుంటాం కదా ఈసారి నీకు ఏదైనా కావాలంటే నాకు చెప్పు అంటూ దొంగ ప్రేమలు కురిపిస్తూ జెస్సి కి ప్రేమగా తినిపించినట్టు నటిస్తాడు.
ఆ తరువాత జ్ఞానాంబ రామచంద్ర ని పిలిచి వెంకటలక్ష్మి ఇంట్లో శుభకార్యం ఉందంట 50 కేజీల లడ్డు ఆర్డర్ ఇచ్చింది ఏం చెప్పమంటావు అని అనడంతో రామచంద్ర కుదరదు అని చెప్పమ్మా అనడంతో వెంటనే జానకి ఎక్కడికి వచ్చి ఎందుకు కుదరదు రామచంద్ర గారు అని అంటుంది. అప్పుడు జానకి అక్కడికి వచ్చి వాళ్ళు మనపై నమ్మకంతో ఆర్డర్ ఇచ్చినప్పుడు ఎందుకు వద్దని చెప్పాలి వాళ్ళు చెప్పినట్టుగా మనం ఆర్డర్ చేసి ఇద్దాం అత్తయ్య మీరు ఆర్డర్ కి ఓకే అని చెప్పండి అనడంతో రామచంద్ర అది కాదు జానకి గారు మీ చదువు గురించి ఆలోచించాలి కదా అనడంతో దేని టైం దానికి ఉంటుందని ఇంట్లో వాళ్ళు తలా ఒక చెయ్యి వేస్తే సరిపోతుంది రామచంద్ర గారు అని చెబుతుంది.
ఇప్పుడు మల్లికా నేను కూడా రెండు చేతులు వేస్తాను మామయ్య అనడంతో అప్పుడు గోవిందరాజులు తినడానికి కాదమ్మా పని చేయడానికి అంటూ వెటకారంగా మాట్లాడతాడు. అప్పుడు జానకి చికిత ఇంట్లో ఆకుకూరలు ఉన్నాయా లేదా మావయ్య గారికి ఈ రోజు నుంచి ఆకుకూరలు చేసి పెట్టాలి హెల్త్ బాగుండాలి అని చికితను లోపలికి పిలుచుకొని వెళ్తుంది జానకి. ఆ తర్వాత అందరూ అక్కడి నుంచి వెళ్లిపోవడంతో గోవిందరాజులు మల్లికను టార్గెట్ చేస్తూ అమ్మ మల్లిక కోడలు అంటే జానకీలా ఉండాలి నీలా చేసింది లోపలికి తోసేయడం కాదు అంటూ వెటకారంగా మాట్లాడుతాడు గోవిందరాజులు.
ఒకవైపు వంటగదిలో జానకి వంట చేస్తూ ఉండగా ఇంతలో రామచంద్ర ఏంటి జానకి గారు మీరు కాలేజీకి వెళ్లకుండా ఈ వంటలు చేసుకుంటూ ఉంటారా అనడంతో మీరు కొట్టుకు వెళ్ళండి రామచంద్ర గారు నేను ఆటో కి వెళ్తాను ఈరోజు కొంచెం క్లాసులు లేటుగా జరుగుతాయి అని రామచంద్ర కు అబద్ధాలు చెప్పి అక్కడి నుంచి పంపిస్తుంది జానకి. ఆ తర్వాత జెస్సీ తన నాన్నతో మాట్లాడుతూ ఉండగా అప్పుడు అతను అల్లుడుగారు ఎలా ఉన్నారు అమ్మ నేను అక్కడికి వస్తాను అని అనగా జెస్సి వద్దు నాన్న నేనే అత్తయ్య గారిని అడిగి నేను అఖిల్ ఇద్దరం ఒకసారి ఇంటికి వస్తాము అని అనడంతో సరే అని అంటాడు. అప్పుడు జెస్సీ ని జ్ఞానాంబ పిలవడంతో అక్కడికి పరుగు పరుగున వెళుతుంది.
అప్పుడు అఖిల్ మంచిగా నటించడం ఎంత కష్టం రా బాబు అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు మల్లిక జెస్సి ఇద్దరు ఒకరినొకరు గుద్దుకుంటారు. ఏంటి జెస్సి ఎక్కడికి వెళ్తున్నావ్ అని అనడంతో అత్తయ్య గారి పిలిచారు అక్క అని అనగా మల్లిక షాక్ అవుతుంది. ఆ తర్వాత ఇద్దరు అక్కడికి వెళ్తారు. అప్పుడు మల్లిక కామెడీగా అత్తయ్య గారు మేమిద్దరం ఆ బాటిల్స్ మూత తీయాలా అని అనడంతో వెంటనే జ్ఞానాంబ అది తెలివి పక్కన పెట్టి ముందు నేను చెప్పేది విను అని అంటుంది జ్ఞానాంబ. మీరిద్దరు కడుపుతో ఉన్నారు కదా మీరుకూ ఏది తిన్న వాంతులు అయినట్టు ఉంటుంది కదా అందుకే మీకోసం సుండిపొడి వెల్లుల్లి పొడి తెప్పించాను.
ప్రతిరోజు మీరు ఈ పొడిని అన్నంలో తినండి అని అనడంతో మల్లిక జెస్సి కి జాగ్రత్తలు చెబుతూ ఉండగా వెంటనే జ్ఞానాంబ నేను చెప్పేది నీ గురించి జెస్సి గురించి కాదు అని అనడంతో మల్లిక మౌనంగా ఉంటుంది. అప్పుడు గోవిందరాజులు అమ్మ మల్లిక మాకు తెలియదు దొంగచాటుగా ముక్కలు తెప్పించుకుని తినడం కాదు అప్పుడప్పుడు ఇవి కూడా తింటే ఆరోగ్యానికి మంచిది నువ్వు తిన్నవి కూడా అరుగుతాయి అని వెటకారంగా మాట్లాడతాడు. తర్వాత ఆ పనిమనిషిని పిలిచి వారిద్దరికీ ప్రతిరోజూ అప్పుడు ని తినిపించు అని చెబుతుంది జ్ఞానంబ. ఆ తర్వాత జానకి అక్కడికి వచ్చి అత్తయ్య గారు లడ్డూలు చేయడానికి అన్ని సిద్ధం చేశానో మీరు ఒకసారి వచ్చి చూడండి అని అనడంతో సారి పదా అని వెళుతుంది జ్ఞానాంబ.
గోవిందరాజులు మళ్లీ మల్లిక నీ పిలిచి ఆమెపై సెటైర్స్ వేస్తూ ఉంటాడు. అప్పుడు మల్లిక నాకు కొంచెం నీరసంగా ఉంది మామయ్య అని అనడంతో అవునా సరే మీ అత్తయ్య గారిని పిలిచి డాక్టర్ ని పిలిపిస్తాను అనడంతో ఎందుకులే మామయ్య ఇప్పుడే వచ్చేస్తాను అని మల్లిక తప్పించుకుని వెళ్ళిపోతుంది. మరొకవైపు కాలేజ్ దగ్గరికి వెళ్ళిన రామచంద్ర జానకి కోసం ఎదురు చూస్తూ ఉండగా ఇంతలో జానకి క్లాస్మెట్ వచ్చి ఈరోజు జానకి గారు కాలేజీకి రాలేదు అని చెప్పడంతో ఎందుకు రాలేదా అని ఆలోచిస్తూ ఇంటికి వెళ్ళాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్లిన రామచంద్ర జానకి కోసం ఇల్లు మొత్తం వెతుకుతూ ఉండగా ఇంతలో జ్ఞానాంబ ఏమైంది రామచంద్ర అని అడుగుతుంది.
అమ్మ జానకి గారు ఎక్కడమ్మా కనిపించడం లేదు అనడంతో వెంకటలక్ష్మి ఇంటికి వెళ్ళింది రామచంద్ర అని అనగా జానకి గారు చదువు మానేసి లడ్డూలు చుట్టడం ఏంటమ్మా అనడంతో ఈరోజు జానకి కాలేదు లేదని చెప్పింది రామచంద్ర నీకు తెలియదా అంతే ఆ తెలుసు అమ్మ అని అంటాడు రామచంద్ర. జానకి గారు ఎందుకు ఇలా చెప్పింది అని ఆలోచిస్తూ ఉంటారు రామచంద్ర. మరొకవైపు మల్లిక నాతో పసివాళ్ళు చూడకుండా వర్క్ పని చేయించారు అని ఏడుస్తూ కుళ్ళుకుంటూ బాధపడుతూ ఉంటుంది. అప్పుడు లీలావతి ఫోన్ చేసి ఏంటి మల్లికా ఈమధ్య ఫోన్ చేయడం లేదు కొంపతీసి దొంగ కడుపు గురించి బయటపడిందా అని అడుగుతుంది. ఆ తర్వాత మల్లికా ఈ పెద్దమ్మకు అసలు విషయం చెబితే ఈ వైపు కు కూడా రాదు నాకున్న ఏకైక సపోర్ట్ కూడా పోతుంది అని ఆమెకు అబద్ధం చెబుతుంది. ఇంతలో పనిమనిషి అక్కడికి వచ్చి మల్లికా మీద సెటైర్లు వేస్తుంది.