అన్ని అనుభవించాలన్నదే నా కోరిక.. స్టార్ హీరోయిన్ ఓపెన్ కామెంట్స్
Mrunal Thakur: స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు భాషతో సంబంధం లేదని.. అన్ని భాషల్లోనూ తాను నటిస్తానని.. అన్ని సంస్కృతులను తాను అనుభవించాల్సిందేనన్న ఆమె తెలిపారు. ఆ వివరాలు ఇలా..

‘సీతారామం’ సినిమాతో ఎంట్రీ..
తెలుగులో ‘సీతారామం’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మృణాల్ ఠాకూర్.. ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయిపొయింది. అందంతో పాటు తన నటనతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. తెలుగులో మృణాల్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు.
సీరియల్స్‌తో ఎంట్రీ..
పేరుకే బాలీవుడ్ బ్యూటీ.. సీరియల్స్‌తో ఎంట్రీ ఇచ్చి ఒక్క మూవీతోనే ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసింది. టాలీవుడ్, బాలీవుడ్, కోలివుడ్ అనే తేడా లేకుండా వరుసగా ఆఫర్లు అందుకుంటోంది. తన సహజ నటనతో ప్రేక్షకులను మంత్రంముగ్దులను చేస్తోంది.
సరిహద్దులు దాటి..
తనకు భాషలతో సంబంధం లేదని.. సరిహద్దులు దాటి నటించడమే ఇష్టమని మృణాల్ ఠాకూర్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఒకే ఇండస్ట్రీలో స్థిరపడకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పింది. ‘‘నేను ఒక భాషకు మాత్రమే పరిమితం కావాలని ఎప్పుడూ అనుకోలేదు. హద్దులు దాటితేనే అవకాశాలు వస్తాయి అని అనుకునేదాన్ని.
అన్ని అనుభవించాలి..
'ఒక నటిగా అన్ని రకాల సంస్కృతులను, భాషలను అనుభవించాలన్నది నా కోరిక. తెలుగు సినిమాల్లో నటించడం వల్ల నాకు ఎంతో గౌరవం దక్కింది. ప్రేక్షకులు నన్ను తమ ఇంటి ఆడబిడ్డలా ఆదరించారు. హిందీలో కూడా మంచి సినిమాలు చేస్తున్నా. భాష అనేది కేవలం భావవ్యక్తీకరణకు ఒక సాధనం మాత్రమే. మంచి కథ ఉంటే.. ప్రపంచంలో ఎక్కడికైనా ఏ భాషలోనైనా వెళ్లి నటిస్తా' అని మృణాల్ ఠాకూర్ చెప్పింది.
డెకాయిట్‌తో అలరిస్తోంది..
కాగా.. మృణాల్ ప్రస్తుతం హిందీలో రెండు సినిమాలు.. తెలుగులో ‘డెకాయిట్’ చేస్తుంది. ఈ ‘డెకాయిట్’ మూవీలో అడివి శేష్ హీరోగా నటిస్తుండగా.. షానీల్ డియో దర్శకత్వం వహిస్తున్నాడు.

