- Home
- Entertainment
- Dhurandhar vs Avatar 3: అవతార్ 3కి చుక్కలు చూపించిన ధురంధర్.. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లు
Dhurandhar vs Avatar 3: అవతార్ 3కి చుక్కలు చూపించిన ధురంధర్.. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లు
Dhurandhar vs Avatar: రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన `ధురంధర్` సినిమా ఆదివారం భారీ వసూళ్లు సాధించి అవతార్: ఫైర్ అండ్ యాష్ సినిమాను వెనక్కి నెట్టింది. దాని గురించి చూద్దాం.
ధురంధర్ వర్సెస్ అవతార్ 3
రణ్‌వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్'. జియో, B62 స్టూడియోస్ నిర్మించిన ఈ సినిమా బడ్జెట్ రూ.280 కోట్లు. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా బాలీవుడ్ రికార్డులను తిరగ రాస్తోంది. ఈ క్రమంలో ఇప్పుడు `అవతార్ 3`కి చుక్కలు చూపిస్తోంది.
`ధురంధర్` 17వ రోజు కలెక్షన్లు
విడుదలైన 17వ రోజు ఆదివారం, ధురంధర్ ఇండియాలో రూ.38.5 కోట్లు వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.852.75 కోట్లు, ఇండియాలో రూ.566.75 కోట్లు సాధించి, 'యానిమల్' రికార్డును బద్దలు కొట్టింది. సరి కొత్త సంచలనం దిశగా వెళ్తోంది.
అవతార్ 3 ఆదివారం వసూళ్లు
ఆదివారం అవతార్ 3 ఇండియాలో రూ.25 కోట్లు వసూలు చేయగా, ధురంధర్ రూ.38.5 కోట్లు సాధించి దాన్ని అధిగమించింది. ఈ ఏడాది `కాంతారా చాప్టర్ 1` రికార్డును కూడా `ధురంధర్` బద్దలు కొడుతుందని అంచనా.
ఈ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా ధురంధర్
'ఉరి: ది సర్జికల్ స్ట్రైక్' ఫేమ్ ఆదిత్య ధర్ 'ధురంధర్'కు దర్శకత్వం వహించారు. జియో స్టూడియోస్ సమర్పణలో B62 స్టూడియోస్ నిర్మించింది. ఇందులో అక్షయ్ ఖన్నా, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్ వంటి వారు ప్రధాన పాత్రలు పోషించారు. డిసెంబర్ 5న ఈ మూవీ విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రం ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ `ఛావా`, `కాంతార చాప్టర్ 1` వంటి చిత్రాల రికార్డులను బ్రేక్ చేసింది. వెయ్యి కోట్ల దిశగా దూసుకుపోతుంది `ధురంధర్`.
