- Home
- Entertainment
- Janaki kalaganaledu: జానకి కోసం మల్లికకు వార్నింగ్ ఇచ్చిన రామ.. అఖిల్ వల్ల బాధపడుతున్న జ్ఞానాంబ!
Janaki kalaganaledu: జానకి కోసం మల్లికకు వార్నింగ్ ఇచ్చిన రామ.. అఖిల్ వల్ల బాధపడుతున్న జ్ఞానాంబ!
Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ తెలుగు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఐపీఎస్ కలను నిజం చేసుకునేందుకు అత్తవారింట్లో జానకి పడే కష్టాలే ఈ సీరియల్ కాన్సెప్ట్. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు అక్టోబర్ 13వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో తెలుసుకుందాం..

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే...జరిగిన విషయం అంత గుర్తు తెచ్చుకుంటూ జానకి చాలా బాధపడుతూ ఉంటుంది. తన గదిలోకి వచ్చి, చిన్నవాడైనా అఖిల్ అంత మాట అన్నాడు అంటే ఇంటి పెద్ద కోడలుగా నా మీద నింద పడినట్టే కదా అని బాధపడుతూ పుస్తకాలు తెరిచి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో రామా అక్కడికి వచ్చి ఏం జానకి గారు పడుకున్నారు అని అడగగా తలనొప్పిగా ఉన్నది రామ గారు అని జానకి చెప్పి మనసులో, ఈ విషయం రామగారికి చెప్తే అఖిల్ గురించి బాధపడతారు అని అనుకుంటుంది.
అప్పుడు రామా, నేను వెళ్లి టీ తెస్తాను ఆగండి రాత్రులు పడుకోకుండా చదువుతున్నారు కదా అందుకే నీరసంగా ఉన్నట్టున్నది అని అంటాడు.అదే సమయంలో చికిత ఇంట్లో పనులు చేస్తూ, అఖిల్ బాబు అలాగనేసరికి జానకమ్మ గారు చాలా బాధపడినట్టు ఉన్నారు అయినా ఇదంతా మల్లికమ్మ వల్ల వచ్చింది. తన్ని ఎలాగైనా ఆపకపోతే ఇంక ఎనెన్ని చేస్తుందో ఈ విషయాన్ని పరిష్కరించగలిగే వాళ్ళు కేవలం పెదబాబు గారే అని అనుకుంటుంది. అదే సమయంలో రామా టీ కలపడం కానీ అటువైపు వెళ్తాడు దాన్ని చూసిన చికిత రామాను ఆపి జరిగిన విషయం అంతా చెప్తుంది.
దానికి రామా అఖిల్ అంత పని చేశాడా చిన్నపిల్లాడని ఊరుకున్నాను వెళ్లి వాడి పని చెప్తాను అని అక్కడికి వెళ్ళేలోగా చికిత ఆపి, అయినాయి దీని అందరికి మూలం మల్లికమ్మ గారే, ముందు తనని ఆపండి అని చెప్తుంది. అప్పుడు రామా మల్లిక దగ్గరికి వెళ్తాడు. మల్లికా నేను చాలా రోజుల నుంచి నీ ప్రవర్తనని గమనిస్తున్నాను కానీ ఇంతవరకు వచ్చిందంటే నేను సహించలేను అని అనగా, మీరు దేని గురించి మాట్లాడుతున్నారు బావగారు మీరు నన్ను అనుమానిస్తున్నారా అంటే నేను తప్పు చేసిన దానిలా కనిపిస్తున్నానా? అసలు అక్కడ నా పొరపాటు ఏమున్నది బావగారు.
జానకి మీకు లేనిపోనివన్నీ ఎక్కించి నా దగ్గరికి ఉసిగొలిపిందా అని కావాలని గట్టిగా అరుస్తూ బయటకు వెళ్లి జానకి! అని అరుస్తూ ఉంటుంది. నేను నెమ్మదిగా మాట్లాడుతుంటే నువ్వు కావాలని గొడవ పెట్టాలని చూస్తున్నావా అని రామా అంటారు.విషయం ఏంటో తేలిపోవాలి బావగారు ఈరోజు అని మల్లిక అంటుంది. అదే సమయంలో జానకి అక్కడికి వస్తుంది. ఏమైంది మల్లిక అని జానకి అడగగా, ఏం తెలియనట్టు ఎంత బాగా అడుగుతున్నావు జానకి అని మల్లిక అంటుంది. నువ్వు మనసులో ఏదో పెట్టుకొని బయట ఇలా ప్రవర్తించొద్దు మల్లిక. అత్తగారు వింటే బాధపడతారు అని జానకి అంటుంది.
అదే సమయంలో ఇంట్లో వాళ్ళందరూ కంగారుగా ఏమైంది అని వస్తారు. అప్పుడు జానకి, మల్లికకు జ్యూస్ కావాలట అత్తయ్య గారు అందుకే పిలుస్తుంది అని అనగా, జ్ఞానాంబ మల్లికను తిట్టి జ్యూస్ కావాలంటే ఇంట్లో చాలామంది ఉన్నారు కదా వెళ్లి అడుగు జానకి చదువు ఎందుకు పాడు చేస్తావు అని అంటారు. దానికి మల్లికా మాట్లాడబోతూ ఉండగా గోవిందరాజు కూడా మల్లిక నోరుని ఆపేసి అమ్మ లోపలికి వెళ్ళు అని అంటాడు. అప్పుడు అందరూ వెళ్ళిపోతారు. అప్పుడు జానకి, రామ వాళ్ళ గదిలో మాట్లాడుకుంటూ జానకి రామతో, నన్ను అడగకుండా మల్లిక దగ్గరికి ఎందుకు వెళ్లారు రామా గారు అని అంటుంది.
అయినా ఇంత జరిగినా నాకెందుకు విషయం చెప్పలేదు జానకి గారు అని అనగా,ఆడవాళ్ళ మధ్య ఎప్పుడు ఇలాంటివి అవుతూనే ఉంటాయి ఉమ్మడి కుటుంబం కదా సర్దుకుంటూ వెళ్లాలి.అలాగని మగవాళ్ళని మధ్యలోకి లాగితే అది చాలా పెద్ద గొడవకు దారితీస్తుంది. అయినా మీరు ఏమి కంగారు పడొద్దు అని రామా కి భరోసా ఇస్తుంది జానకి. తర్వాత మల్లిక తన గదిలోకి వెళ్లి నేను పెంట పెడదాం అనుకుంటే ఏంటి ఇక్కడ ఏది జరగలేదు ఇంతకీ మా ఆయన ఏరి ఎప్పుడో ఫోన్ చేశాను ఇప్పటికి వచ్చి రాలేదు అనుకుంటుంది.
అదే సమయంలో విష్ణు అక్కడికి వచ్చి ఏమైంది అని అడగగా, జరిగిన విషయం అంత చెప్పి మీ అన్నయ్య నన్ను నిందిస్తున్నారు మీరు వెళ్లి అడగండి అని అనగా అన్నయ్య అలాంటి వాడు కాదే నాకు తెలుసు అని విష్ణు అంటాడు. అంటే ఇప్పుడు మీ అన్నయ్యని వెనకేసుకుని వచ్చి నన్ను తప్పు పడుతున్నారు అయితే నేను మిమ్మల్ని వదిలేసి మా ఇంటికి వెళ్లి పోటాను. నేను నా బిడ్డ మాత్రమే ఉంటాము అని మల్లిక నటించడం మొదలు పెడుతుంది. సరేలే వెళ్లి అడుగుతాను అని విష్ణు బయటకి వెళ్లి చూసేసరికి అక్కడ జ్ఞానాంబ ఉంటుంది. అప్పుడు విష్ణు భయపడి తిరిగి గదిలోకి వచ్చేస్తాడు.
ఏమైంది అని మల్లిక అడగగా అక్కడ అమ్మ ఉండే మనం తర్వాత చూసుకుందామని విష్ణు అంటాడు. అప్పుడు మల్లిక మనసులో ఇలా కాదు ఇంకొంచెం డోస్ పెంచాలి అని అనుకుంటుంది. మరోవైపు జ్ఞానాంబ, అఖిల్ విషయంలో జరిగినది అంటా గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది.అదే సమయంలో గోవిందరాజు అక్కడికి వస్తాడు. మనం అబ్బాయిని ఎంతో బాగా పెంచాము కానీ ఇలా తయారవుతాడు అని నేను అనుకోలేదు అని జ్ఞానాంబ గోవిందరాజు మాట్లాడుకుంటూ ఉండగా జానకి, రామా అక్కడికి వస్తారు. అప్పుడు రామా, జ్ఞానాంబతో అమ్మ, అఖిల్ మంచివాడే అమ్మ మన పెంపకంలో పెరిగారు కదా కానీ మీరు మాట్లాడకపోయేసరికి ఆ బాధను తట్టుకోలేకపోతున్నాడు అంతే అని అంటాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.తరువాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!