MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Anil Ravipudi Remuneration : చిరంజీవి వల్ల రెమ్యునరేషన్ భారీగా పెంచిన అనిల్ రావిపూడి ? నెక్ట్స్ మూవీకి ఎంత?

Anil Ravipudi Remuneration : చిరంజీవి వల్ల రెమ్యునరేషన్ భారీగా పెంచిన అనిల్ రావిపూడి ? నెక్ట్స్ మూవీకి ఎంత?

టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి రేంజ్ మారిపోయింది. స్టార్ హీరోలతో వరుస సినిమాలు, వరుస సక్సెస్ లతో సరికొత్తరికార్డును క్రియేట్ చేశాడు అనిల్. అంతే కాదు భారీగా రెమ్యునరేషన్ కూడా పెంచాడట యంగ్ డైరెక్టర్. ఇంతకీ సినిమాకు ఎంత తీసుకుంటున్నాడంటే? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jan 15 2026, 07:17 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అనిల్ రావిపూడి రేంజ్ వేరు
Image Credit : Asianet News

అనిల్ రావిపూడి రేంజ్ వేరు

టాలీవుడ్ లో ప్రస్తుతం అనిల్ రావిపూడి రేంజ్ వేరు. పట్టిందల్ల బంగారం అయినట్టుగా.. చేసిన ప్రతీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతోంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవితో చేసిన మన శంకర వరప్రసాద్ గారు ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తోంది. చిరంజీవిని ఎవరూ చూపించని విధంగా అనిల్ చూపించాడు. 70 ఏళ్ల వయసులో వింటేజ్ లుక్ లో మెగాస్టార్ మెరిసిపోయాడు. ఆయనలో ఉన్న ఎనర్జీని చాలా కాలం తరువాత బయటకు తీశాడు అనిల్. దాంతో సినిమా సూపర హిట్ అయ్యింది.. అనిల్ రేంజ్ మరో రేంజ్ కు వెళ్లిపోయింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సక్సెస్ రేటులో రాజమౌళి స్థాయి..
Image Credit : youtube/@Shinescreenscinema

సక్సెస్ రేటులో రాజమౌళి స్థాయి..

అసలే వరుససక్సెస్ లు..ఆపైన స్టార్ హీరోలతో వరుస అవకాశాాలు..  అనిల్ ట్యాలెంట్ ఆయన్ను  స్టార్ డైరెక్టర్ గా మార్చాయి. రాజమౌళి తరువాత సక్సెస్ రేటు పూర్తి స్థాయిలో ఉన్న దర్శకుడు అనిల్ రావిపూడి మాత్రమే. కామెడీతో కడుపుబ్బా నవ్విస్తూనే.. సెంటిమెంట్ తో ఏడిపించగలగడం అనిల్ కు బాగా వచ్చిన విద్య. ఆయన సినిమాలో హీరోయిజం డిఫరెంట్ గా ఉంటుంది. ఎంత సీరియస్ క్యారెక్టర్ అయినా కామెడీ చేయించగలడు.. కామెడీ హీరోతో సీరియస్ పాత్రలు కూడా చేయించగలడు, ఈ మధ్యలో హీరో ఇమేజ్ ఏమాత్రం తగ్గకుండా జాగ్రత్త పడతాడు అనిల్ రావిపూడి.

35
అనిల్ రావిపూడి కోసం స్టార్ హీరోల ఎదురుచూపులు..
Image Credit : Instagram/ shinescreenscinema

అనిల్ రావిపూడి కోసం స్టార్ హీరోల ఎదురుచూపులు..

అనిల్ రావిపూడి దగ్గర ఉన్న పెద్ద ట్యాలెంట్ ఏంటంటే.. ఆయన స్టార్ హీరో అయినా.. కొత్త హీరో అయినా.. ఎవరైనా సరే సక్సెస్ ఇవ్వగలడు.  తన కథతో అద్భుతమైన విజయం అందేలా చేయగలడు. అందుకే గ్యారెంటీ హిట్ డైరెక్టర్ గా అనిల్ కు పేరు పడింది. ఇక సినిమా సినిమాకు సక్సెస్ కొడుతూ వెళ్తున్న అనిల్.. రెమ్యునరేషన్ కూడా భారీ స్థాయిలో పెంచుకుంటూ వెళ్తున్నట్టు తెలుస్తోంది. అన్ని జానర్స్ ఆడియన్స్ కు నచ్చేలా సినిమాలు చేయడంలో అనిల్ రావిపూడి రూటే సెపరేటు. స్టార్ దర్శకుడిగా టాలీవుడ్ లో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి కోసం స్టార్ ప్రొడ్యూసర్లు క్యూ కడుతున్నారు. స్టార్ హీరోలు కూడా అనిల్ తో సినిమా అంటే.. కళ్లు మూసుకుని ఒకే చేసే పనిస్థితి

45
అనిల్ రావిపూడి రెమ్యునరేషన్
Image Credit : facebook.com/AnilRavipudiOfficial

అనిల్ రావిపూడి రెమ్యునరేషన్

మన శంకర వరప్రసాద్ గారు సినిమాకు అనిల్ రావిపూడి 20 నుంచి 25 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఛార్జ్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. సంక్రాంతికి వస్తున్నాం ముందు వరకు అనిల్ రావిపూడి 15 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకునే వారు. కానీ సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఏకంగా 300 కోట్ల గ్రాస్ రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దీనితో అనిల్ తన పారితోషికం పెంచినట్లు తెలుస్తోంది. అయితే మన శంకర వరప్రసాద్ గారు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో... తాజాగా అనిల్ రేంజ్ మరో స్థాయికి వెళ్లింది. ఈసారి ఆయన చేయబోయే సినిమాకు 40 కోట్లకు పైనే రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నాడట అనిల్.

55
అనిల్ రావిపూడి నెక్ట్ సినిమా ఎవరితో?
Image Credit : Anil Ravipudi, Nagarjuna

అనిల్ రావిపూడి నెక్ట్ సినిమా ఎవరితో?

గతేడాది సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టిన అనిల్.. ఈ ఏడాది చిరంజీవి సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమా ఏంటి ? ఏ హీరోతో చేయబోతున్నారు ? అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. అనిల్ రావిపూడి సీనియర్ హీరోలందరినీ చుట్టేస్తున్నారు. వెంకటేష్,బాలయ్య, చిరంజీవి అయిపోయాడు ఇక మిగిలింది నాగార్జున మాత్రమే. అనిల్ రావిపూడి నెక్స్ట్ మూవీ నాగార్జునతో చేయబోతున్నట్టు తెలుస్తోంది. అది కూడా హలో బ్రదర్ సినిమాకు సీక్వెల్ ను ప్లాన్ చేసినట్టు సమాచారం.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
నయనతార
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Allu Sneha: సోషల్ మీడియాలో దూసుకుపోతున్న అల్లు అర్జున్ భార్య.. ఫ్యామిలీని చూసుకుంటూనే బిజినెస్ లో సంపాదన
Recommended image2
Bhagyashri Borse: నాలుగు సినిమాలు ఫట్, ఐదో సినిమాతో షేక్ చేసిన భాగ్యశ్రీ.. చందమామలా వెలిగిపోతోందిగా
Recommended image3
Bollywood New Actors: రణ్‌బీర్ కపూర్ లాగా ఈ ఐదుగురు కుర్ర హీరోలు బాలీవుడ్‌ను ఏలబోతున్నారా?
Related Stories
Recommended image1
బొమ్మరిల్లు సీక్వెల్ లో.. తండ్రీ కొడుకులుగా నటించబోయేది ఎవరో తెలుసా? క్లారిటీ ఇచ్చిన నిర్మాత దిల్ రాజు
Recommended image2
ఎన్టీఆర్ , ఎస్వీఆర్ మధ్య చిచ్చుపెట్టిన డైలాగ్ ఏదో తెలుసా? 3 ఏళ్లు ఇద్దరి మధ్య మాటలు ఎందుకు లేవు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved