- Home
- Entertainment
- Illu Illalu Pillalu: గేటు బయటే శ్రీవల్లి తల్లిదండ్రులకు అవమానం..ప్రేమ హార్ట్ బ్రేక్ చేసిన ధీరజ్
Illu Illalu Pillalu: గేటు బయటే శ్రీవల్లి తల్లిదండ్రులకు అవమానం..ప్రేమ హార్ట్ బ్రేక్ చేసిన ధీరజ్
నగల విషయంలో ధీరజ్ చేసిన రచ్చతో ప్రేమ హార్ట్ బ్రేక్ అవుతుంది. గేటు బయటే శ్రీవల్లి తల్లిదండ్రులకు అవమానం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని హైలైట్స్ ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ గురువారం ఎపిసోడ్ లో ఉన్నాయి.

మీ వాళ్ళ వల్లే నాన్నకి అవమానం
బుధవారం ముగిసిన చోటే ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ గురువారం ఎపిసోడ్ ప్రారంభం అవుతుంది. ఆ నగలు ప్రేమ ధరించడానికి ధీరజ్ అస్సలు ఒప్పుకోడు. ఆ నగల వల్లే తమ ఫ్యామిలీ మొత్తం పోలీస్ స్టేషన్ వద్ద పడిగాపులు కాయాల్సి వచ్చింది అని అంటారు. ఈ నగల వాళ్ళ మీ వాళ్ళు మా నాన్ని అవమానించారు. నిన్ను ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నట్లు అనరాని మాటలు అన్నారు.
ప్రేమ హార్ట్ బ్రేక్ చేసిన ధీరజ్
ఈ నగలు చూస్తుంటే తట్టుకోలేకపోతున్నాను. నువ్వు వాటిని తీసేయ్ అని ప్రేమకి చెబుతాడు. ఆ నగలు మా అమ్మ ఇచ్చింది. నేను మహారాణిలా కనిపించాలి అనేది అమ్మ కోరిక. ఎంగేజ్మెంట్ లో నగలు లేకుండా ఉంటే బోసిపోయినట్లు ఉంటుంది. ఏ భర్త అయినా భార్య నగలు పెట్టుకుంటే సంతోషిస్తాడు. నువ్వేంటి ఇలా అని అడుగుతుంది. నీకు నగలు కావాలంటే కష్టపడి సంపాదించి కొనిస్తాను. ఈ నగలు మాత్రం వేసుకోవడానికి వీల్లేదు అని చెబుతాడు. దీనితో ప్రేమ బాధపడుతూ నగలు తీసేస్తుంది.
టెన్షన్ లో కూడా భర్తతో శ్రీవల్లి రొమాన్స్
ఇంతలో ఎంగేజ్మెంట్ విషయంలో శ్రీవల్లి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఆమె భర్త వస్తారు. ఏంటి ఇంకా రెడీ కాలేదు అని అడుగుతాడు. మనసులో ఉన్న టెన్షన్ బయటపెట్టకుండా భర్తతో ప్రేమగా మాట్లాడుతుంది. చీర సెలెక్ట్ చేసుకోలేకున్నాను అని అంటుంది. చివరికి తన భర్త సెలెక్ట్ చేసిన చీరని కట్టుకుని మురిసిపోతుంది.
అమూల్య డల్ గా ఉండడంతో కామాక్షికి డౌట్
ఇంతలో కామాక్షి.. తన చెల్లి అమూల్యని ఎంగేజ్ మెంట్ కి ముస్తాబు చేస్తూ ఉంటుంది. అమూల్య డల్ గా కనిపించడంతో ఏమైనా లవ్ స్టోరీలు ఉన్నాయా అని అడిగేస్తుంది. ఆ మాటలు విన్న వేదవతి(ఆమని) కామాక్షి పై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. పెళ్లి ఉన్నప్పుడు ఆడపిల్లలు భయపడడం సహజం. నువ్వు ఏదేదో మాట్లాడకు అని చెబుతుంది. అమూల్యకి ఎర్ర నీళ్లు తీసి వాటిని బయట పడేయమని తిరుపతికి చెబుతుంది. అప్పుడే గేటు దగ్గర భాగ్యం, ఆమె భర్త ఎంట్రీ ఇస్తుంటారు. వారిని చూడకుండా తిరుపతి ఎర్రనీళ్ళు పోస్తాడు. అవి భాగ్యం భర్తపై పడతాయి. అక్కడ కొన్ని ఫన్నీ సంభాషణలు జరుగుతాయి. ఆ తర్వాత సాగర్, నర్మద మధ్య రొమాంటిక్ సీన్స్ తో ఎపిసోడ్ ముగుస్తుంది.

