- Home
- Entertainment
- Karthika Deepam 2 Today Episode: సొంత తండ్రినే చంపేందుకు తెగించిన జ్యోత్స్న.. కార్తీక్ ఆమె ట్రాప్‌లో పడ్డడా?
Karthika Deepam 2 Today Episode: సొంత తండ్రినే చంపేందుకు తెగించిన జ్యోత్స్న.. కార్తీక్ ఆమె ట్రాప్‌లో పడ్డడా?
Karthika Deepam 2 Episode 15th January: జోత్స్న ఎవరో తెలిసిపోయింది. దాసు మొత్తం నిజం చెప్పాడు. కానీ ఏకంగా కన్న తండ్రినే చంపాలను చూస్తుంది జ్యో. కార్తీక్‌కి ఈ విషయం తెలియకుండా మ్యానేజ్ చేస్తుంది.

జ్యో ఎవరో నిజం చెప్పిన దాసు
Karthika Deepam 2 Episode 568: నేడు గురువారం(జనవరి 15) ఎపిసోడ్‌లో రాత్రివేళ శివ నారాయణ ఇంటికి వచ్చిన దాసు, అందరికి పెద్ద షాక్ ఇస్తాడు. జ్యోత్స్న(జోష్న) ఎవరు అనేది బయటపెడతాడు. పారిజాతం అడ్డుపడే ప్రయత్నం చేసినా, వినకుండా అసలు నిజం చెబుతాడు దాసు. జ్యో తన కూతురు అని చెప్పేస్తాడు. `నా మనవరాలు నీ కూతురు ఎలా అవుతుంది` అని శివ నారాయణ ప్రశ్నించగా, `బిడ్డలు మారిపోయారు సర్. నా కూతురు నీ కూతురు స్థానంలోకి వచ్చింది` అని దాసు సంచలన నిజాన్ని బయటపెడతాడు.
నీ ప్రాణదాత దీపే నీ కూతురు
షాక్‌లో నుంచి తేరుకున్న దశరథ్ `మరి నా కూతురు ఎవరు?` అని అడిగితే, `ఆమె ఈ ఇంటికి దూరంగా బ్రతుకుతోంది` అని దాసు చెబుతాడు. ఈ విషయం నీకు ఎలా తెలుసు అని సుమిత్ర అడగగా, తానే ప్రత్యక్ష సాక్షినని దాసు అంటాడు. బిడ్డలను మార్చి చంపాలని ప్రయత్నించానని, కానీ శివ నారాయణ కూతురి ఆయుష్షు గట్టిదని వెల్లడిస్తాడు. `మరి నా కూతురు ఎవరు?` అని సుమిత్ర అడిగితే, `నీ ప్రాణదాత దీపే నీ కూతురు. బస్టాండ్‌లో వదిలేసిన దీపను కుబేర్ తీసుకెళ్లి పెంచుకున్నాడు` అని దాసు చెబుతాడు.
ఈ దారుణం చేసింది మీ అమ్మ పారిజాతమే
ఈ మాటలతో శివ నారాయణకు కోపం తట్టుకోలేక దాసు కాలర్ పట్టుకుని, “బిడ్డలను మార్చింది ఎవరో నీకు తెలుసు కదా, చెప్పు!` అని నిలదీయగా, పారిజాతం భయంతో దండం పెట్టుకుంటుంది. చివరకు దాసు నిజం చెప్పేస్తాడు. `ఈ పని చేసింది మీ అమ్మ పారిజాతమే` అని వెల్లడించడంతో అందరు మరోసారి షాక్‌కి గురవుతారు. ఈ నిజం విన్న శివ నారాయణ ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. పారిజాతం క్షమించమని కాళ్లపై పడినా, `నువ్వు త్రాచుపాము వి` అంటూ శివ నారాయణ ఆమెను కాళ్లతోనే నెట్టేస్తాడు. `ఇలాంటి పామును బతికించకూడదు` అంటూ లోపలికి వెళ్లి గన్ తీసుకొస్తాడు.
దాసుపై జ్యో దాడి
అప్పుడు దాసు, `నేను నిజం చెప్పేస్తానని నా కూతురే నన్ను చంపాలని చూసింది` అని మరో షాకిస్తాడు. దీనికి పారిజాతం మరింత ఫైర్ అవుతుంది. `నీ కోసం నా జీవితం త్యాగం చేస్తే, నువ్వు నా కొడుకునే చంపాలని చూస్తావా?` అని ఆవేదనతో అంటుంది. శివ నారాయణ చేతిలోని గన్ లాక్కుని, `నన్ను చంపడంలో తప్పులేదు. కానీ నేను చేసిన తప్పును ప్రక్షాళన చేసుకునే అవకాశం ఇవ్వండి` అంటూ జ్యోత్స్నను షూట్ చేస్తుంది. కాకపోతే అదంతా ఒక ఊహ. జ్యో ఒక్కసారిగా రియాలిటీలోకి వస్తుంది. ఇది కల కాదని, `నాన్న నిజం చెబితే జరిగేది ఇదే` అని ఆమె అంటుంది. దాసు నిజం చెప్పేందుకు వెళ్లబోతుండగా, జ్యోత్స్న అతనిపై స్ప్రే కొడుతుంది. స్పృహ కోల్పోయిన దాసును రౌడీలను పిలిచి తీసుకెళ్లమంటుంది.
కార్తీక్‌ని తప్పుదోవ పట్టించిన జ్యో
ఇంతలో కార్తీక్ అక్కడికి రావడంతో, జ్యోత్స్న చాకచక్యంగా అతన్ని తప్పుదోవ పట్టిస్తుంది. పారిజాతం కూడా వచ్చి దాసు గురించి అడగగా, `మావయ్య కోసం వచ్చాను, కానీ ఇంట్లో లేడు` అని కార్తీక్ చెప్పి వెళ్తాడు. రౌడీలు దాసును తీసుకెళ్తుండగా, అతని మెడలోని తాయిత్తు కింద పడుతుంది. మరోవైపు దీప కార్తీక్ గురించి ఆలోచిస్తుంటే కాంచన వచ్చి మాట్లాడుతుంది. దాసు ఫోన్ చేసి వెళ్లిపోయాడని దీప చెబుతుంది. కార్తీక్ వచ్చి జరిగినదంతా చెప్పడంతో, జ్యోత్స్న ప్రవర్తనపై అతనికి అనుమానం మొదలవుతుంది.
కార్తీక్ కాల్‌తో జ్యో షాక్
ఇక మరో సీన్‌లో దాసును కట్టేసి కిడ్నాప్ చేసిన జ్యోత్స్న, `నీ కూతురు మహారాణిలా వెలుగుతుంటే నువ్వు చూస్తావు. కాశీకి నేనే నిజమైన అక్క అని చెబుతాను` అని అంటుంది. దీనికి దాసు నవ్వుతూ, `నీ పతనం మొదలైంది` అని హెచ్చరిస్తాడు. అదే సమయంలో దాసుకు కార్తీక్ కాల్ చేయడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. ఫోన్ ఆన్‌లోనే ఉంచి, ఊరంతా తిరుగుతున్నట్టు నాటకం వేయాలని స్కెచ్ వేస్తుంది. కానీ ఇంట్లో పడిన దాసు తాయిత్తుతో కార్తీక్ అతన్ని పట్టుకోబోతున్నాడన్న సంకేతంతో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది. మొత్తంగా గురువారం ఎపిసోడ్ చాలా రసవత్తరంగా సాగిందని చెప్పొచ్చు. ఇందులో అనేక ట్విస్ట్ లు టర్న్ లున్నాయి. ఇవి రేపటి ఎపిసోడ్‌పై క్యూరియాసిటీని క్రియేట్ చేశాయి.

