MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Fauzi Release Date: పూనకాలు తెప్పించేలా ప్రభాస్‌ లుక్‌, ఫౌజీ రిలీజ్‌ డేట్‌.. ఏడాది గ్యాప్‌తో 3 సినిమాలు

Fauzi Release Date: పూనకాలు తెప్పించేలా ప్రభాస్‌ లుక్‌, ఫౌజీ రిలీజ్‌ డేట్‌.. ఏడాది గ్యాప్‌తో 3 సినిమాలు

ప్రభాస్‌ హీరోగా రూపొందుతున్న `ఫౌజీ` మూవీ రిలీజ్‌ డేట్‌ వచ్చింది. అభిమానులకు గుడ్‌ న్యూస్‌ చెబుతూ, చిత్ర బృందం అదిరిపోయే పోస్టర్‌ని విడుదల చేశారు. ఇది పూనకాలు తెప్పిస్తుంది.

2 Min read
Author : Aithagoni Raju
Published : Jul 16 2026, 01:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఫౌజీ నుంచి గుడ్‌ న్యూస్‌
Image Credit : Asianet News

ఫౌజీ నుంచి గుడ్‌ న్యూస్‌

ప్రభాస్‌ హీరోగా రూపొందుతున్న చిత్రాల్లో `ఫౌజీ` ఒకటి. భారీ పాన్‌ ఇండియా సినిమాగా దీన్ని రూపొందిస్తున్నారు దర్శకుడు హను రాఘవపూడి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటి వరకు పెద్దగా అప్‌ డేట్స్ లేవు. కేవలం ఫస్ట్ లుక్‌ పోస్టర్స్ మాత్రమే వచ్చాయి. షూటింగ్‌ వివరాలుగానీ, టీజర్‌గానీ రాలేదు. ఈ క్రమంలో సినిమా ఎప్పుడు విడుదలవుతుందనేది సస్పెన్స్ గా మారింది. ఈ క్రమంలో అదిరిపోయే వార్తని తీసుకొచ్చింది `ఫౌజీ` టీమ్‌. ఏకంగా రిలీజ్‌ డేట్‌ని ప్రకటించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
పూనకాలు తెప్పించేలా ఫౌజీ పోస్టర్‌
Image Credit : Asianet News

పూనకాలు తెప్పించేలా ఫౌజీ పోస్టర్‌

గురువారం సినిమా నుంచి కొత్త పోస్టర్‌ని విడుదల చేశారు. ఇందులో ప్రభాస్‌ యుద్ధభూమిలో ఒక రాయిపై కూర్చొని ఉన్నారు. వేల మంది సైనికులు ప్రాణాలు కోల్పోయి ఉన్నారు. ప్రభాస్‌ రక్తం మడుగులో ఉన్నారు. ఆయన రక్తంతో తడిపోయి ఉన్నారు. చేతిలో తుపాకీ ఉంది. నెలకు తల వేసి అన్నీ కోల్పోయిన దశలో ప్రభాస్‌ కనిపిస్తున్నారు. ఓ వైపు వర్షం పడుతుంది. ప్రభాస్‌ బాడీకి జంధ్యం ఉంది. దీనికితోడు ఆయన లుంగీ కట్టుకొని ఉండటం ఆశ్చర్యపరుస్తుంది. సినిమాలో ప్రభాస్‌ సైనికుడిగా కనిపిస్తారని అన్నారు. కానీ ఆయన లుక్‌ డిఫరెంట్‌గా ఉంది. ఇదే ఇప్పుడు సినిమాపై అంచనాలను పెంచేస్తుంది.

35
ఫౌజీ రిలీజ్‌ డేట్‌
Image Credit : instagram

ఫౌజీ రిలీజ్‌ డేట్‌

దీనికితోడు పోస్టర్‌లో చాలా నెంబర్‌ కోడ్‌ కనిపిస్తున్నాయి. అలాగే హిందీలో పలు విషయాలను వెల్లడించారు. ఇదే మరింతగా ఆసక్తిని పెంచుతుంది. ఈ భారీ పీరియాడికల్‌ యాక్షన్‌ చిత్రాన్ని డిసెంబర్‌ 3న విడుదల చేయబోతున్నట్టు టీమ్‌ వెల్లడించింది. లేటెస్ట్ పోస్టర్‌ మాత్రం అత్యంత పవర్‌ఫుల్‌గా ఉంది. భయానక యాక్షన్‌ సీన్లతో సినిమా నిండి ఉంటుందనే సంకేతాన్ని ఇస్తుంది. అయితే `సలార్‌`లో మాదిరిగా ఇందులోనూ ప్రభాస్‌ యుద్ధభూమిలోని కూర్చొని ఉండటం, తుపాకి పట్టుకొని ఉండటం విశేషం. దీన్ని సలార్‌తో పోల్చుతున్నారు.

45
పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామాగా ఫౌజీ
Image Credit : Asianet News

పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామాగా ఫౌజీ

పీరియడ్‌ యాక్షన్‌తోపాటు సినిమాలు మంచి లవ్‌ స్టోరీ కూడా ఉంటుందని, సైనికుడి ప్రేమ కథ హైలైట్‌గా నిలుస్తుందని సమాచారం. అది ఎలా అనేది డిసెంబర్‌లో తెలుస్తుంది. ఇందులో ప్రభాస్‌కి జోడీగా ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తోంది. అనుపమ్‌ ఖేర్‌, మిథున్‌ చక్రవర్తి, జయప్రద, భానుచందర్‌ వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మొత్తంగా లేటెస్ట్ పోస్టర్‌ `ఫౌజీ` మూవీపై అంచనాలను అమాంతం పెంచేసిందని చెప్పొచ్చు.

55
ఏడాది గ్యాప్‌తో ప్రభాస్‌ 3 సినిమాలు
Image Credit : Asianet News

ఏడాది గ్యాప్‌తో ప్రభాస్‌ 3 సినిమాలు

ఇక ఏడాది గ్యాప్‌తో ప్రభాస్‌ మూడు సినిమాలతో సందడి చేయబోతున్నారు. ఆయన `ఫౌజీ` డిసెంబర్ 3న విడుదల అవుతుండగా, సందీప్‌ రెడ్డి వంగా రూపొందించే `స్పిరిట్‌` మూవీ వచ్చే ఏడాది మార్చి 5న రిలీజ్‌ కానుంది. దీంతోపాటు నాగ్‌ అశ్విన్‌ రూపొందించే `కల్కి 2` మూవీ కూడా వచ్చే ఏడాది రానుందట. దాన్ని డిసెంబర్‌లో రిలీజ్‌కి ప్లాన్‌ చేస్తున్నారట. ఇదే నిజమైతే ఏడాది గ్యాప్‌తో ప్రభాస్‌ మూడు భారీ పాన్‌ ఇండియా చిత్రాలతో అలరించనున్నారని చెప్పొచ్చు. ఇది అభిమానులకు పెద్ద సెలబ్రేషన్‌ గా చెప్పొచ్చు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ప్రభాస్
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: ఝాన్సీ వల్ల బాటమ్ లోకి షాలిని, రోహిత్.. ఇరగదీసిన నరేష్, రామ్ ప్రసాద్
Recommended image2
Ranabaali Trailer: రణబాలి ట్రైలర్ రివ్యూ.. బ్రిటిష్‌పై వీర పోరాటం, విజయ్ దేవరకొండ ఊచకోత చూశారా
Recommended image3
Bollywood Controversies: సల్మాన్-షారుఖ్ నుంచి కంగనా-హృతిక్ వరకు.. స్టార్లను కుదిపేసిన 7 వివాదాలు
Related Stories
Recommended image1
Indra 2 Update: ఈసారి దేశం గర్వపడేలా మూవీ.. చిరంజీవికి క్షమాపణలు చెప్పిన స్టార్‌ రైటర్‌
Recommended image2
Bigg Boss Telugu 10: బిగ్‌ బాస్‌ తెలుగు 10 సెలబ్రిటీ కంటెస్టెంట్లు వీరేనా? అగ్నిపరీక్ష ప్రారంభమయ్యేది అప్పుడే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved