MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Chiranjeevi: ఇంద్ర 2 అప్‌ డేట్‌.. చిరంజీవికి క్షమాపణలు చెప్పిన స్టార్‌ రైటర్‌.. అసలేం జరిగిందంటే?

Chiranjeevi: ఇంద్ర 2 అప్‌ డేట్‌.. చిరంజీవికి క్షమాపణలు చెప్పిన స్టార్‌ రైటర్‌.. అసలేం జరిగిందంటే?

చిరంజీవి కెరీర్‌లో బ్లాక్‌ బస్టర్‌గా నిలిచిన `ఇంద్ర` మూవీకి చిన్నికృష్ణ కథ అందించారు. అయితే ఆ తర్వాత వీరి కాంబినేషన్‌లో మూవీ రాలేదు. ఈ క్రమంలో `ఇంద్ర 2` ప్రస్తావన వచ్చింది. దీనిపై ఆయన ఏం చెప్పాడంటే?

2 Min read
Author : Aithagoni Raju
Published : Jul 15 2026, 11:03 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
చిరంజీవి కెరీర్‌ లో బిగ్గెస్ట్ హిట్‌ ఇంద్ర
Image Credit : Asianet News

చిరంజీవి కెరీర్‌ లో బిగ్గెస్ట్ హిట్‌ ఇంద్ర

చిరంజీవి కెరీర్‌లో అతిపెద్ద హిట్‌ చిత్రాల్లో `ఇంద్ర` ఒకటి. ఇది కమర్షియల్‌ గా చిరంజీవిని మరో స్థాయికి తీసుకెళ్లింది. ఫ్యాక్షన్‌ సినిమాలంటే బాలయ్య కేరాఫ్‌ అనే ట్రెండ్‌ నడుస్తోన్న సమయంలో చిరంజీవి ఫ్యాక్షన్‌ మూవీ `ఇంద్ర` చేసి ఆ ట్రెండ్‌ని బ్రేక్‌ చేశారు. ఇది కమర్షియల్‌గా బాలయ్య సినిమాలను దాటి వసూళ్లని రాబట్టింది. ఇలాంటి బ్లాక్‌ బస్టర్‌ మూవీకి బి గోపాల్‌ దర్శకుడు కాగా, ఈ కథ అందించింది మాత్రం చిన్నికృష్ణ. ఆయన  `నరసింహనాయుడు`, `గంగోత్రి`, `బద్రినాథ్‌`, `సీమ సింహం` వంటి చిత్రాలకు కథలు అందించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
చిరంజీవితో మూవీపై చిన్నికృష్ణ కామెంట్‌
Image Credit : Asianet News

చిరంజీవితో మూవీపై చిన్నికృష్ణ కామెంట్‌

అప్పట్లో చిన్నికృష్ణ స్టార్‌ రైటర్‌గా రాణించారు. అంతేకాదు అత్యంత విజయవంతమైన రైటర్‌గానూ రాణించారు. కానీ ఈ మధ్య గ్యాప్‌ వచ్చింది. రీసెంట్‌గా ఆయన ఓ యూట్యూబ్‌ ఛానెల్‌తో ముచ్చటించారు. ఇందులో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. దాసరి నారాయణరావు కొడుకు సినిమా విషయంలో జరిగిన మిస్టేక్‌ వెల్లడించారు. దీంతోపాటు కొన్ని సినిమాలను తాను చేయకపోవడానికి కారణాలు తెలిపారు. ఈ క్రమంలో మెగాస్టార్‌తో సినిమా గురించి ఓపెన్‌ అయ్యారు. ఆయన చిరంజీవి `ఇంద్ర` మూవీకి కథ అందించిన నేపథ్యంలో `ఇంద్ర 2` ఎప్పుడు అనే ప్రశ్న తలెత్తింది. దీనికి ఆయన స్పందించారు.

Related Articles

Related image1
Bhagyashri Borse: చిన్నప్పుడు తండ్రి పడ్డ కష్టాలు పంచుకుంటూ భాగ్యశ్రీ బోర్సే ఎమోషనల్.. అప్పుడే డిసైడ్‌
Related image2
NTR: జూ ఎన్టీఆర్‌ తల్లిని పిలిపించి ఎన్టీఆర్‌ చెప్పిన మాట ఏంటో తెలుసా?.. తాతపై కోపంతో రగిలిపోయిన తారక్‌
35
చిరంజీవిపై చిన్నికృష్ణ విమర్శలు
Image Credit : Asianet News

చిరంజీవిపై చిన్నికృష్ణ విమర్శలు

`ఇంద్ర 2` సినిమా అప్‌ డేట్‌ విషయంలో ఆయన క్లారిటీ ఇవ్వలేదు. కానీ చిరంజీవికి సారీ చెప్పారు. చిన్నికృష్ణకి చిరంజీవి అంటే అభిమానం. చిన్నకృష్ణ అంటే కూడా చిరంజీవికి ప్రత్యేక అభిమానం. చిన్నికృష్ణ తన కొడుక్కి చిరంజీవి పేరు పెట్టాడు. అలాగే తన చెల్లికి కొడుకు పుడుతున్నప్పుడు, చిరంజీవి   పుట్టిన రోజునే సిజేరియన్‌ ఆపరేషన్‌ జరగాలని ఆ రోజే చేయించుకున్నారు. ఇంత చేసిన తమని కనీసం ఇంటికి పిలిపించి అన్నం పెట్టలేదు అంటూ అప్పట్లో చిన్నికృష్ణ విమర్శలు చేశారు. ఆ తర్వాత కొన్నాళ్లకి సారీ చెప్పారు. చిరంజీవికి పద్మ విభూషణ్‌ పురస్కారం అందుకున్న సమయంలో వీరిద్దరు కలిశారు. ఆ సమయంలో చిరంజీవి చిన్నికృష్ణని ఎంతో ఆప్యాయంగా పలకరించారు. బాగోగులు అడిగి తెలుసుకున్నారు.

45
చిరంజీవికి చిన్నికృష్ణ క్షమాపణలు
Image Credit : youtube/@TeluguRajyam

చిరంజీవికి చిన్నికృష్ణ క్షమాపణలు

తాజాగా మరోసారి చిన్నికృష్ణ స్పందించారు. `ఇంద్ర 2` ప్రస్తావన రాగా. చిరంజీవికి క్షమాపణలు చెప్పారు. తాను ఆ రోజు అలా మాట్లాడకుండా ఉండాల్సిందని, మనం ప్రేమిస్తాం, మనల్ని ప్రేమించాలని రూల్‌ లేదు. మనల్ని కూడా ప్రేమించాలనే అజ్ఞానంలో అలా మాట్లాడాను, కానీ అలా ఉండకూడదని ఇప్పుడు అనిపిస్తుంది. నాలాంటి వాళ్లు ఎంతో మంది ఆయన్ని ప్రేమిస్తారు. అందరిని పిలిచి రెస్పెక్ట్ చేయాలనేది సాధ్యపడదు. అందుకే ఇంటికెళ్లి క్షమాపణలు కూడా చెప్పాను. మళ్లీ ఇప్పుడు చెబుతున్నా, అన్నయ్యా అలా మాట్లాడకుండా ఉండాల్సింది. ఏదో అజ్ఞానంలో మాట్లాడాను, నన్ను క్షమించు` అని వెల్లడించారు చిన్నికృష్ణ. చిరంజీవితో దేశం గర్వించే కథను రాస్తానని వెల్లడించారు. మరి అది ఎప్పుడు సాధ్యమనేది చూడాలి.

55
బాబీ సినిమాతో చిరంజీవి బిజీ
Image Credit : Asianet News

బాబీ సినిమాతో చిరంజీవి బిజీ

చిరంజీవి ఈ ఏడాది సంక్రాంతికి `మన శంకర వర ప్రసాద్‌ గారు` మూవీతో బ్లాక్‌ బస్టర్‌ అందుకున్నారు. ఇప్పుడు బాబీతో ఓ సినిమా చేస్తున్నారు. ఇది చిత్రీకరణ దశలో ఉంది. ఇంకోవైపు `విశ్వంభర` మూవీ షూటింగ్‌ పూర్తి చేసుకుంది. వీఎఫ్‌ఎక్స్ కారణంగా ఆగిపోయింది. ఈ మూవీ ఎప్పుడు రిలీజ్‌ అవుతుందనేది క్లారిటీ లేదు. మరోవైపు శ్రీకాంత్‌ ఓడెల దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు మెగాస్టార్‌.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Kumbhakarna: కుంభకర్ణుడు అంత గొప్పవాడా, అయినా శ్రీరాముడు భయంకర యుద్ధం చేసి అతడిని ఎందుకు చంపాడో తెలుసా ?
Recommended image2
Illu Illalu Pillalu Today Episode: ప్రేమకు అదిరిపోయే షాక్.. అరెస్టు చేస్తానన్న ఎస్ఐ, వల్లి ఆనందం
Recommended image3
Rashmika Mandanna : శ్రీవల్లి టు గీతాంజలి.. రష్మిక మందన్న కెరీర్‌లోని ఐకానిక్ లుక్స్ ఇవే!
Related Stories
Recommended image1
Bhagyashri Borse: చిన్నప్పుడు తండ్రి పడ్డ కష్టాలు పంచుకుంటూ భాగ్యశ్రీ బోర్సే ఎమోషనల్.. అప్పుడే డిసైడ్‌
Recommended image2
NTR: జూ ఎన్టీఆర్‌ తల్లిని పిలిపించి ఎన్టీఆర్‌ చెప్పిన మాట ఏంటో తెలుసా?.. తాతపై కోపంతో రగిలిపోయిన తారక్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved