- Home
- Entertainment
- Janaki kalaganaledu: మల్లిక వల్ల బాధ పడుతున్న జ్ఞానాంబ.. జానకిని ఐపీఎస్ కు సిద్ధం చేస్తున్న రామ!
Janaki kalaganaledu: మల్లిక వల్ల బాధ పడుతున్న జ్ఞానాంబ.. జానకిని ఐపీఎస్ కు సిద్ధం చేస్తున్న రామ!
Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ తెలుగు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఐపీఎస్ కలను నిజం చేసుకునేందుకు అత్తవారింట్లో జానకి పడే కష్టాలే ఈ సీరియల్ కాన్సెప్ట్. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు సెప్టెంబర్ 29వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో తెలుసుకుందాం...

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే..జ్ఞానాంబ ఇంట్లో కూర్చుని బాధపడుతూ ఉంటుంది. జెస్సి, అఖిల్ ల విషయం వళ్లనేనా అని గోవిందరాజు అడగగా, అది కూడా నా బాధకు ఒక కారణమేనండి. దైవంగా పూజించే ముత్తయిదులు వచ్చి పూజ అయిపోయిన తర్వాత వాయనం తీసుకొని అందర్నీ ఆశీర్వదిస్తారు అనుకుంటే ఇలా జరిగింది దానికి కారణం కొత్తగా వచ్చిన అమ్మాయి అని అందరూ చెప్పి వెళ్ళిపోయారు.అటువైపు అఖిల్ చదువుకొని బాగుపడతాడు అనుకుంటే చదువు మాట పక్కన పెట్టండి.
తన వయసుకు చేయాల్సిన పనులు చేస్తున్నాడా? ఇంట్లో అందరూ కలిసి ఉన్నామని మాటకే కాని ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు.మల్లిక, విష్ణు లు వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు. ఇంటికి వాళ్లకి ఏం సంబంధం లేనట్టు ఉంటున్నారు.రామా ఒక్కడే కుటుంబం గురించి ఆలోచించుకుంటూ భారాన్ని తన భుజం మీద వేసుకుంటున్నాడు. మరోవైపు జానకి ఇంట్లో సమస్యలతో చదువు మీద దృష్టి పెట్టట్లేదు అని బాధపడుతూ ఉంటుంది.
తర్వాత ఇదంతా విన్న మల్లిక బైట బాధపడుతున్నట్టు నటించి గదిలోకి వెళ్ళాక తలుపు వేసుకొని ఆనందం తో మనం పట్టుచీర కొనుక్కోకపోయినా పర్లేదు కాని మన తోటి కోడలు చిరిగిన బట్టలు వేసుకుంటే ఆనందం ఎంత బాగుంటుందో నాకు ఇప్పుడు తెలుస్తుంది, పోలేరమ్మ బాధపడడం చూసి నాకు ఉత్సాహం ఆగట్లేదు అని డాన్స్ వేస్తూ ఉంటుంది.ఇంతలో విష్ణు వచ్చి ఏం చేస్తున్నావ్ మల్లికా నువ్వు గర్భవతివి.ఇలాగ గంతులు వేయకూడదు అని అనగా మల్లికా అమాయకకు మొఖం పెట్టి, మీరు అసలు ఇలా గంతులు వేస్తేనే అలా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటాము.
ఇప్పుడు నేను గంతులు వేయకుండా బద్దకంగా ఉంటే నాకి కాళ్ళు నొప్పి పుడతాయి.నా కాళ్ళకి నొప్పిపుడితే మా బాబు కూడా బాధ పడతాడు.ఇప్పుడు ఎవరైనా పట్టే వాళ్ళు ఉంటే అప్పుడే నా బాబు ఏడకుండా ఉంటాడు అని అనగా విష్ణు మల్లిక కాళ్ళు పడతాడు.అప్పుడు మల్లికా మనసులో ఈయన మరి ఇంత వెర్రిబాగులోడిలా ఉన్నాడు పోనీలే నా మంచికే అని అనుకుంటుంది. ఆ తర్వాత సీన్లో జానకి, అత్తయ్య గారు అలా మాట్లాడారు అని బాధపడుతూ తన గదిలో ఉంటుంది.
ఇంతలో రామ అక్కడికి వచ్చి ఏం ఆలోచిస్తున్నారు జానకి గారు అని అడుగుతాడు. రామ గారికి విషయం చెప్తే బాధపడతారు అని జానకి అనుకోని, ఏం లేదు రామ గారు అని అంటుంది. అప్పుడు రామ,మీరు ఇంట్లో పనులు మీద దృష్టి పెట్టి చదువుని అశ్రద్ధ చేస్తున్నారు.ఇందాక మీ ప్రిన్సిపల్ గారు నాతో వచ్చి మాట్లాడారు మీరు ఇంక ఈరోజు నుంచి చదువు మీద దృష్టి పెట్టండి. అఖిల్ విషయం తేలిపోయింది కదా ఇంకేమైనా కుటుంబ సమస్యలు వస్తే నేను చూసుకుంటాను. రేపటి నుంచి మీరు ఉదయాన్నే వెళ్లి వ్యాయామం చేయాలి.
దగ్గరలో వచ్చే పరీక్షలకు బాగా చదువుకోవాలి తర్వాత మీకేదో ట్రైనింగ్ ఉంటుందట కదా దానికి కూడా సిద్ధం అవ్వాలి అని అంటాడు. అవును ట్రైనింగ్ కూడా ఉంటుంది అని జానకి అనగా, మీరు ట్రైనింగ్ కి వెళ్తే నాకు దూరంగా ఉండాలి కదా, నేను మీకు దూరంగా ఉండలేను కదా అని రామా అనగా, మరి ఏం చేద్దాము అని జానకి అడుగుతుంది. అప్పుడు రామా, ఇప్పుడు మీరు నాకు శక్తిని ఇవ్వండి అప్పుడు నేను శక్తిని మీరు ట్రైనింగ్ కి వెళ్ళినప్పుడికి దాచుకుంటాను అని అనగా జానకి రామకి ముద్దు పెడుతుంది. ఆ తర్వాత సీన్లో జానకి,రామా ఇద్దరు ఉదయాన్నే జాగింగ్ కి వెళతారు.
జానకి కొంచెం నడిచేసరికి అలిసిపోతుంది. అప్పుడు రామా మీరు వెళ్ళండి జానకి గారు నేను వస్తాను అని చెప్పి మనసులో జానకి గారిని ఉత్సాహపరచాలి అప్పుడే దేనికైనా సిద్ధపడతారు అని అనుకొని పక్కనే ఉన్న ఒక అతని ఫోన్ లాక్కొని ముసుగు వేసుకొని దొంగలా పారిపోతాడు రామా. జానకి తను దొంగ అనుకొని వెంట పరిగెడుతుంది. చాలా దూరం పరిగెట్టిన తర్వాత మూసుకుని తీస్తాడు రామ. మీరా రామ గారు ఏం చేస్తున్నారు అని జానకి అనగా,మిమ్మల్ని ఉత్సాహపరచాలని ఇలా చేశాను.
ఇప్పుడు చూడండి మీరు ఎలా పరిగెడుతున్నారో అని అనగా, ఆయన నిజంగా ఫోన్ పోయిందనుకొని కంగారు పడుతున్నట్టున్నారు వెళ్లి ఇచ్చేద్దాము అని జానకి అంటుంది.ఇంతలో కాళ్ళు బెనికినట్టు ఉన్నది అని జానకి అనగా, రామా జానకిని ఎత్తుకుంటాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.తరువాయి భాగం లో ఏం జరుగుతుందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!