MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రామ్ గోపాల్ వర్మ చిన్నప్పుడు ఏం అవ్వాలనుకున్నాడో తెలుసా? డైరెక్టర్ కాకపోయుంటే ఆర్జీవీ ఏమయ్యేవాడు?

రామ్ గోపాల్ వర్మ చిన్నప్పుడు ఏం అవ్వాలనుకున్నాడో తెలుసా? డైరెక్టర్ కాకపోయుంటే ఆర్జీవీ ఏమయ్యేవాడు?

రామ్ గోపాల్ వర్మ సంచలనాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. కానీ డైరెక్టర్ అవ్వకపోయి ఉంటే ఆర్జీవి ఏమయ్యేవాడో తెలుసా? చిన్నప్పుడు వర్మ ఏం అవ్వాలనుకున్నాడు? స్టార్ డైరెక్టర్ స్వయంగా వెల్లడించిన విషయం?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Mar 28 2026, 01:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సంచలనాల దర్శకుడు..
Image Credit : Asianet News

సంచలనాల దర్శకుడు..

ఫిల్మ్ ఇండస్ట్రీలో సంచలనాల దర్శకుడిగా పేరుతెచ్చుకున్నాడు రామ్ గోపాల్ వర్మ. ముక్కుసూటిగా మాట్లాడటం, నచ్చిన సబ్జెక్ట్ ను సినిమాగా తీయ్యడం, వివాదాలతో ఆటలాడటం, విమర్శలకు తనదైన స్టైల్లో సమాధానం చెప్పడం వర్మకు బాగా అలవాటు అయిన పని. ఈమధ్య కాస్త కామ్ అయ్యాడు కానీ.. గతంలో వర్మ చేసిన పనులు అన్నీ ఇన్నీ కావు. ఆయన మాట్లాడే సంచలనం, పోస్ట్ పెడితే వివాదం.. సినిమాలతో పొలిటికల్ హీట్ పుట్టించిన ఆర్జీవి.. ప్రస్తుతం సైలెంట్ గా తన పని తాను చేసుకుంటున్నాడు.

25
సోషల్ మీడియా సంచలనం కూడా
Image Credit : Asianet News

సోషల్ మీడియా సంచలనం కూడా

సినిమాలు మాత్రమే కాదు.. వర్మ సోషల్ మీడియా సంచలనం కూడా. ఆయన తన పేజ్ లో పెట్టే పోస్ట్ లు ఎన్నో కాంట్రవర్సీలకు కారణం అయ్యాయి. తనకు నచ్చిన విషయాలు.. తన మనసులోని భావాలను తరచూ సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఆయన తన చిన్ననాటి కలల గురించి, జీవితం ఎలా మారుతూ వచ్చిందో వివరిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు వర్మ.

Related Articles

Related image1
చిరంజీవి తరువాత అల్లు అర్జున్ ప్రాణంగా ప్రేమించే హీరో ఎవరో తెలుసా? ఎందుకంత ఇష్టం.. ?
Related image2
ప్రభాస్ తల్లిగా నటించను.. ఆ క్యారెక్టర్ అయితే ఓకే... క్లారిటీ ఇచ్చిన రాశి
35
ఆటో డ్రైవర్ అవ్వాలనుకున్న వర్మ..
Image Credit : our own

ఆటో డ్రైవర్ అవ్వాలనుకున్న వర్మ..

డైరెక్టర్ అవ్వకుండా ఉండి ఉంటే.. తాను ఏమవ్వాలనుకున్నది ఆర్జీవి వెల్లడించారు. తనకు సుమారు పదేళ్ల వయసు ఉన్నప్పుడు ఆటో అంటే చాలాక్రేజ్ ఉండేదట. ఆటో రిక్షా డ్రైవర్ కావాలనే కోరిక బలంగా ఉండేదని వర్మ గుర్తుచేసుకున్నారు. ఆటో యాక్సిలరేటర్ పెంచినప్పుడు వచ్చే సౌండ్ అంటే తనకు ఎంతో ఇష్టమట.. ఆ శబ్ధం తనను విపరీతంగా ఆకర్షించేదని ఆయన తెలిపారు. ఆ శబ్దం పట్ల ఉన్న ఆకర్షణ వల్లే తాను ఆటో ట్రైవర్ అవ్వాలని అనుకున్నట్టు వర్మ వెల్లడించారు.

45
ఇంజనీర్ అవ్వబోయి.. డైరెక్టర్ గా..
Image Credit : our own

ఇంజనీర్ అవ్వబోయి.. డైరెక్టర్ గా..

పదిహేనేళ్ల వయసులో తన కజిన్‌ను చూసి.. ఫారెస్ట్ లోకి వెళ్లాలని అనుకున్నాడు వర్మ.. అడవిలో జీవించాలని అనుకున్నాడు. మరికొన్నిరోజులకు ఆర్జీవి ఆలోచన మారిపోయింది.. కొన్నాళ్లు ఇంజనీర్ కావాలనిపించింది. అలా అలా తన ఆలోచనలు మారిపోయి చివరకు రామ్ గోపాల్ వర్మ డైరెక్టర్‌ అవ్వాలని ఫిక్స్ అయ్యారట. ఈ విషయాన్ని ఆర్జీవి వెల్లడించారు.

55
రామ్ గోపాల్ వర్మ పై ప్రభావం చూపించిన సినిమా..
Image Credit : Asianet News

రామ్ గోపాల్ వర్మ పై ప్రభావం చూపించిన సినిమా..

చదువుల విషయానికొస్తే, ఒకప్పుడు ఎనిడ్ బ్లైటన్ రచనలు విపరీతంగా చదివేవాడినని చెప్పారు. అయితే తరువాత జేమ్స్ హాడ్లీ చేజ్ పుస్తకాలు పరిచయమయ్యాక వాటి వైపు వెళ్లిపోయాను.. . ఆ సమయంలో జేమ్స్ హాడ్లీ చేజ్ కంటే గొప్ప రచయిత లేడనుకునేవాడినని వర్మ తెలిపారు. కానీ కొన్నేళ్లకు ఫ్రెడరిక్ ఫోర్సెత్ రచనలు చదివిన తర్వాత తన అభిప్రాయాలు మారిపోయాయని ఆయన చెప్పారు. 

జీవితంలో అనుభవాల గురించి వర్మ మాట్లాడుతూ.. “మనందరం కొత్త అనుభవాల ద్వారా మారుతూ ఉంటాం. అవి మన ప్రమాణాలను, బెంచ్‌మార్క్‌లను పెంచుతాయి” అని అన్నారు.తన కెరీర్ మొత్తం ఈ బెంచ్‌మార్క్‌లను ఆధారంగా చేసుకుని సినిమాలు తీశానని, ముఖ్యంగా ‘గాడ్ ఫాదర్’ తనపై అత్యధిక ప్రభావం చూపిందని రామ్ గోపాల్ వర్మ వెల్లడించారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
బాలీవుడ్
Latest Videos
Recommended Stories
Recommended image1
ప్రభాస్ తల్లిగా నటించను.. ఆ క్యారెక్టర్ అయితే ఓకే... క్లారిటీ ఇచ్చిన రాశి
Recommended image2
Niharika: పెదనాన్నకి పోటీగా సంక్రాంతి బరిలోకి నిహారిక, వరుణ్‌ తేజ్‌.. `బరి` మూవీ స్టోరీ, తెలుగులో ఫస్ట్ టైమ్‌
Recommended image3
చిరంజీవి తరువాత అల్లు అర్జున్ ప్రాణంగా ప్రేమించే హీరో ఎవరో తెలుసా? ఎందుకంత ఇష్టం.. ?
Related Stories
Recommended image1
చిరంజీవి తరువాత అల్లు అర్జున్ ప్రాణంగా ప్రేమించే హీరో ఎవరో తెలుసా? ఎందుకంత ఇష్టం.. ?
Recommended image2
ప్రభాస్ తల్లిగా నటించను.. ఆ క్యారెక్టర్ అయితే ఓకే... క్లారిటీ ఇచ్చిన రాశి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved