MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ప్రభాస్ తల్లిగా నటించను.. ఆ క్యారెక్టర్ అయితే ఓకే... క్లారిటీ ఇచ్చిన రాశి

ప్రభాస్ తల్లిగా నటించను.. ఆ క్యారెక్టర్ అయితే ఓకే... క్లారిటీ ఇచ్చిన రాశి

ప్రభాస్ తల్లి పాత్రలో నటించడానికి నో చెప్పడంపై క్లారిటీ ఇచ్చింది.. మాజీ హీరోయిన్ రాశి. ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ రోల్స్ మాత్రమే చేస్తూ వస్తున్న ఈ తార.. ఏంటుందంటే?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Mar 28 2026, 11:57 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఫ్యామిలీ ఆడియన్స్ లో ఫాలోయింగ్ ఎక్కువ..
Image Credit : raasi instagram

ఫ్యామిలీ ఆడియన్స్ లో ఫాలోయింగ్ ఎక్కువ..

90 దశకంలో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సాధించింది రాశి. తెలుగులో దాదాపు అందరు హీరోల సరసన నటించి మెప్పించింది రాశి. ముఖ్యమంగా శ్రీకాంత్ జోడీగా ఎక్కువ సినిమాల్లో సందడి చేసింది. ఫ్యామిలీ ఓ రియెంటెడ్ సినిమాలతో.. తెలుగువారి మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న రాశి.. హీరోయిన్ గా ఫెయిడ్ అవుట్ అయిన తరువాత తెరపై కనిపించడం తగ్గించింది. రాశి తోటి హీరోయిన్లు అంతా యంగ్ హీరోలకు తల్లి పాత్రలు చేస్తున్నారు. కానీ రాశి మాత్రం ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ రోల్స్ మాత్రమే చేస్తూ.. అప్పుడప్పుడు తెరపై కనిపిస్తోంది.

25
ప్రభాస్ తో నటించనన్న రాశి..?
Image Credit : Asianet News

ప్రభాస్ తో నటించనన్న రాశి..?

ఇక ఈమధ్య కాలంలో ప్రభాస్ సినిమాలో అవకాశం వస్తే.. రాశి నటించనని చెప్పిదంటూ.. సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ విషయంలో తాను చేసిన కామెంట్స్ గురించి సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలపై రీసెంట్ గా రాశి స్పందించింది. ప్రభాస్‌కు తల్లి పాత్రలో తప్ప మరే ఇతర పాత్రలోనైనా నటించడానికి తాను సిద్ధంగా ఉన్నానని , తాను సోదరి పాత్ర చేయనని ఎక్కడా చెప్పలేదని ఆమె స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ‘అనుమాన పక్షి’ సినిమా ఈవెంట్‌లో ఈ విషయంపై ఆమె క్లారిటీ ఇచ్చింది.

Related Articles

Related image1
చిరంజీవి తరువాత అల్లు అర్జున్ ప్రాణంగా ప్రేమించే హీరో ఎవరో తెలుసా? ఎందుకంత ఇష్టం.. ?
Related image2
మహేష్ బాబు తండ్రిగా హీరో రాజశేఖర్ మిస్ అయిన బ్లాక్ బస్టర్ మూవీ ఏదో తెలుసా?
35
ప్రభాస్ అంటే ఇష్టం కానీ..?
Image Credit : Asianet News

ప్రభాస్ అంటే ఇష్టం కానీ..?

రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించి మాట్లాడుతూ, ఆయనంటే తనకు ఇష్టమని, కానీ ప్రభాస్ తల్లిగా మాత్రం నటించనని రాశి కామెంట్స్ చేసింది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. కొందరు ఆమె కామెంట్స్ ను తప్పుగా అర్థం చేసుకోవడంతో.. రాశీపై ట్రోలింగ్ స్టార్ట్ అయ్యింది. దాంతో అసలు విషయంపై రాశి వివరణ ఇవ్వాల్సి వచ్చింది.

45
నా మాటలను తప్పుగా అర్ధం చేసుకున్నారు..
Image Credit : youtube/@hittv

నా మాటలను తప్పుగా అర్ధం చేసుకున్నారు..

రాశి మాట్లాడుతూ, “నేను చెప్పిన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారు. ప్రభాస్‌తో పని చేసే అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను. తల్లి పాత్ర తప్ప మరే పాత్రైనా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. సోదరి పాత్ర చేయనని నేను ఎక్కడా చెప్పలేదు” అని స్పష్టం చేశారు.అదేవిధంగా, గతంలో ప్రభాస్ సినిమాలకు డబ్బింగ్ చెప్పినా, ఆయన్ను వ్యక్తిగతంగా కలిసే అవకాశం రాలేదని కూడా ఆమె తెలిపారు. ప్రభాస్ నటన తనకు నచ్చుతుందని పేర్కొన్నారు.

55
అనుమాన పక్షి సినిమాలో రాశి పాత్ర..
Image Credit : Asianet News

అనుమాన పక్షి సినిమాలో రాశి పాత్ర..

మంచి పాత్రలు దొరికితేనే నటిస్తుంది రాశి.. అలాంటి పాత్ర ప్రస్తుతం ‘అనుమాన పక్షి’ సినిమాలో రాశీకి వచ్చింది. వస్తే, ‘డీజే టిల్లు’ ఫేమ్ విమల్ కృష్ణ దర్శకత్వంలో రాగ్ మయూర్ హీరోగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమాలో తన పాత్ర గురించి వినగానే బాగా నచ్చిందట. దాంతో ఎలాంటి సందేహం లేకుండా వెంటనే ఆ పాత్ర చేయడానికి అంగీకరించినట్లు రాశి వెల్లడించారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
ప్రభాస్
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
Latest Videos
Recommended Stories
Recommended image1
Niharika: పెదనాన్నకి పోటీగా సంక్రాంతి బరిలోకి నిహారిక, వరుణ్‌ తేజ్‌.. `బరి` మూవీ స్టోరీ, తెలుగులో ఫస్ట్ టైమ్‌
Recommended image2
చిరంజీవి తరువాత అల్లు అర్జున్ ప్రాణంగా ప్రేమించే హీరో ఎవరో తెలుసా? ఎందుకంత ఇష్టం.. ?
Recommended image3
Brahmamudi Serial Today Episode: ఐశ్వర్య చెంప చెల్లుమనిపించిన రేఖ, రాజు..అపర్ణ కంట పడకుండా అడ్డుపడ్డ భూషణ్
Related Stories
Recommended image1
చిరంజీవి తరువాత అల్లు అర్జున్ ప్రాణంగా ప్రేమించే హీరో ఎవరో తెలుసా? ఎందుకంత ఇష్టం.. ?
Recommended image2
మహేష్ బాబు తండ్రిగా హీరో రాజశేఖర్ మిస్ అయిన బ్లాక్ బస్టర్ మూవీ ఏదో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved