- Home
- Entertainment
- Rajamouli: 1000 కోట్ల సినిమా చేస్తున్న రాజమౌళి జేబులో ఒక్క రూపాయి కూడా ఉండదు ఎందుకు? రమ రాజమౌళి చెప్పిన రహస్యం..
Rajamouli: 1000 కోట్ల సినిమా చేస్తున్న రాజమౌళి జేబులో ఒక్క రూపాయి కూడా ఉండదు ఎందుకు? రమ రాజమౌళి చెప్పిన రహస్యం..
Rajamouli: ప్రపంచం మెచ్చిన దర్శకుడు.. వేల కోట్ల ప్రాజెక్ట్స్ డీల్ చేస్తున్న డైరెక్టర్.. అయినా సరే ఆయన జేబులో రూపాయి కూడా ఉండదు. ఖర్చుల సంగతే తెలియదు. అసలుపట్టించుకోడు. టాలీవుడ్ జక్కన్న గురించి ఆయన భార్య రమా రాజమౌళి చెప్పిన షాకింగ్ విషయాలు ఏంటి?

తెలుగు సినిమా తలెత్తుకునేలా చేసిన దర్శకుడు..
తెలుగు సినీమా పరిశ్రమ తలెత్తుకునేలా చేసిన దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి. మన టాలెంట్ ను ప్రపంచానికి పరిచయం చేసిన డైరెక్టర్ రాజమౌళి. ఇండియన్ సినిమా అంటే టాలీవుడ్ అనేలా జక్కన్న తెలుగు సినిమాను మార్చేశాడు. అంతే కాదు మనసినిమాలను తక్కవు చేసి చూసిన వాళ్ళకు సినిమాలతోనే బుద్ది చెప్పాడు రాజమౌళి. టాలీవుడ్ నుంచి ఆస్కార్ రేంజ్ కు ఎదిగిన రాజమౌళి.. వేల కోట్ల ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు.
భారీ బడ్జెట్ చిత్రాలు, అద్భుతమైన విజువల్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునే రాజమౌళి... వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎంతో నిరాడంబరంగా ఉంటారని చాలా మందికి తెలుసు. కానీ వేల కోట్ల ప్రాజెక్ట్స్ ను డీల్ చేస్తున్న జక్కన్న జేబులో ఒక్క రూపాయి కూడా ఉండదని మీకు తెలుసా ఈ వియాన్ని ఆయన సతీమణి రమా రాజమౌళి స్వయంంగా వెల్లడించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రమా రాజమౌళి తన భర్త అలవాట్ల గురించి చెప్పిన విషయాలు ఎంతో ఆసక్తిని కలిగిస్తున్నాయి.
జేబులో డబ్బులు లేని దర్శకుడు
రమా రాజమౌళి మాట్లాడుతూ, రాజమౌళి కారు ఎక్కించుకుని బయటకు వెళితే దేనికైనా బిల్లు ఇతరులే కట్టాల్సి వస్తుందని సరదాగా చెప్పారు. సాధారణంగా ఆయన జేబులో డబ్బులు ఉండవని, అందుకే డ్రైవర్ దగ్గరే కొంచెం డబ్బులు, అత్యవసర పరిస్థితుల కోసం ఒక కార్డు ఉంచుతానని ఆమె తెలిపారు.
రాజమౌళి తన దగ్గర డబ్బులు ఉంచుకోకపోవడమే కాకుండా, ఆ విషయంపై పెద్దగా పట్టించుకోరని, అసలు తన వద్ద ఏమున్నాయో ఆయనకు తెలియదని కూడా రమా రాజమౌళి పేర్కొన్నారు సాధారణంగా ఆయన అంతగా వేరే చోట్లకి బయటకు వెళ్లరని, అలాంటి అవసరమే రాదని, కానీ అత్యవసర సమయాల కోసమే డ్రైవర్ వద్ద డబ్బులు, కార్డు ఏర్పాటు చేస్తానని వివరించారు.
వందల కోట్ల రెమ్యునరేషన్ కానీ..
తెలుగు సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన దర్శకుడిగా రాజమౌళికి ఎంతో గుర్తింపు ఉంది. ఆయన రెమ్యునరేషన్ 100 కోట్లకు పైనే ఉంటుందని టాక్.. అయినప్పటికీ, రోజువారీ అవసరాల విషయంలో ఆయన చాలా సాధారణంగా వ్యవహరించడం విశేషం. డబ్బులు, కార్డులు వెంట పెట్టుకుని తిరగడం వంటివి అలవాటు లేకపోవడం, బయటి ప్రపంచపు హంగులు, ఆర్భాటాల కంటే తన పని మీద మాత్రమే జక్కన్న దృష్టి పెట్టేఅలవాటు అందరిని ఆశ్చర్చపరుస్తోంది. ప్రస్తుతం రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో వారణాసి సినిమా చేస్తున్నాడు. ఈమూవీ దాదాపు 1000 నుంచి 1500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నట్టు సమాచారం.







