MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Upasana: కొడుకు మరణంతో తల్లడిల్లిన తల్లి, ఉపాసన జీవితాన్ని మార్చిన ఘటన.. ఇంత జరిగిందా?

Upasana: కొడుకు మరణంతో తల్లడిల్లిన తల్లి, ఉపాసన జీవితాన్ని మార్చిన ఘటన.. ఇంత జరిగిందా?

మెగా కోడలు ఉపాసన ఇప్పుడు అపోలో ఆసుపత్రికి హెడ్‌గా ఉన్నారు. అయితే ఆమె మొదట ఈ రంగంలోకి రావాలనుకోలేదు. కానీ ఓ తల్లి బాధని ప్రత్యక్షంగా చూసిన ఆమె మనసు మార్చుకున్నారు. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Mar 13 2026, 08:03 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఫ్యామిలీని, కెరీర్‌ని బ్యాలెన్స్ చేస్తోన్న ఉపాసన
Image Credit : Getty

ఫ్యామిలీని, కెరీర్‌ని బ్యాలెన్స్ చేస్తోన్న ఉపాసన

ఉపాసన.. మెగా కోడలిగా, రామ్‌ చరణ్‌కి భార్యగా, అపోలో ఫార్మసీ హెడ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇటీవలే ఆమె రెండోసారి తల్లి అయ్యారు. మొదట కూతురు క్లీంకారకి జన్మనివ్వగా, ఇటీవల కవలలకు జన్మనిచ్చారు. కొడుకు, కూతురు జన్మించారు. ప్రస్తుతం మాతృత్వాన్ని ఆస్వాధిస్తున్నారు ఉపాసన. తమ ఫ్యామిలీలోకి వారసుడు రావడంతో చిరంజీవి ఆనందానికి అవదుల్లేవని చెప్పొచ్చు. ఓ వైపు తల్లిగా, భార్యగా, కోడలిగా అన్ని బాధ్యతలు నిర్వర్తిస్తూనే మరోవైపు వ్యాపార రంగంలోనూ దూసుకుపోతున్నారు ఉపాసన. ఫ్యామిలీ లైఫ్‌ని, కెరీర్‌ని బ్యాలెన్స్ చేసుకుంటున్నారు.

25
ఫ్యాషన్‌ డిజైనింగ్‌ సైడ్‌ వెళ్లాలనుకున్న ఉపాసన
Image Credit : Youtube/Curly Tales

ఫ్యాషన్‌ డిజైనింగ్‌ సైడ్‌ వెళ్లాలనుకున్న ఉపాసన

ఉపాసన అపోలో హాస్పిటల్స్ బాధ్యతలను తన వారసత్వంగా పొందింది. తన తాత ప్రతాప్‌ సీ రెడ్డి దీన్ని స్థాపించారు. దాన్ని తమ వారసులు కొనసాగిస్తున్నారు. అయితే ప్రారంభంలో ఈ రంగంలోకి రావడం ఉపాసనకి ఇష్టం లేదట. తాను ఫ్యాషన్‌ డిజైనింగ్‌ సైడ్‌ వెళ్లాలనుకున్నారట. కానీ తాతయ్యకి ఈ విషయం చెబితే ఆయన ` ఈ రంగంలో తక్కువ మందికే సేవ చేయగలవు, ఎక్కువ మందికి సేవ చేసే రంగం గురించి ఆలోచించు` అని చెప్పారట. `ఓ రోజు అపోలో ఆసుపత్రికి వెళ్లినప్పుడు ఓ పేద మహిళ, భవన నిర్మాణ కార్మికురాలు.. తన కొడుకు ప్రాణాలను బతకించమని ప్రాదేయపడుతుంది. ఆ పిల్లాడు ఏడుస్తున్నాడు. ఏంటని అడిగితే ఆమె తన బాధ చెప్పుకుంది. డాక్టర్లని అడితే చాలా ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నాడని, చాలా ఖర్చుఅవుతుందని చెప్పారు.

Related Articles

Related image1
Raghavendra Raoకి మాటిచ్చి ఆ కోరిక తీర్చకుండానే వెళ్లిపోయిన స్టార్‌ హీరోయిన్‌ ఎవరో తెలుసా?
Related image2
Laya Mistake: లయ చేసిన బిగ్‌ మిస్టేక్‌ ఇదే, ఒక్క సినిమాతో కెరీర్‌ తలక్రిందులు.. అది తలచుకుని ఆవేదన
35
ఉపాసన ఆలోచనని మార్చిన ఘటన
Image Credit : instagram/@upasanakaminenikonidela

ఉపాసన ఆలోచనని మార్చిన ఘటన

ఆ ఖర్చు నేను భరిస్తాను. వెంటనే ట్రీట్‌మెంట్‌ చేయమని చెప్పాను. ట్రీట్‌మెంట్‌ చేసినా ఆ పిల్లాడిని బతికించలేకపోయాం. దీంతో ఆ తల్లి తల్లడిల్లిపోయింది. కన్నీరుమున్నీరయ్యింది. ఆమె బాధ వర్ణణాతీతం. ఎందుకంటే అప్పటికే పుట్టిన ముగ్గురూ ఏదో ఒకసమస్యతో చనిపోయారు. నాలుగో సంతానం కూడా అలానే కావడంతో   ఆమె దుఃఖానికి అవదుల్లేవు. ఆ ఘటనతో చలించిపోయాను. ఆమెకి నావంతు సహాయం అందించాను. ఆ తర్వాత కొన్నాళ్లకి ఆమె మళ్లీ గర్భం దాల్చింది. ఈ సారి ఏ సమస్య లేదు. పాపాయి బతికింది. ఆ సమయంలో ఆ తల్లి ఆనందాన్ని చూసి నాకు ఎంతో సంతోషమేసింది. సేవ చేయడంలో ఉన్న కిక్కు ఏంటో అప్పుడు తెలిసింది.

45
ఉపాసన చేస్తోన్న సేవలు
Image Credit : instagram/@upasanakaminenikonidela

ఉపాసన చేస్తోన్న సేవలు

ఈ ఘటనతో నా మనసు మారిపోయింది. తాతయ్య చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. దీంతో ఫ్యాషన్‌ డిజైనింగ్‌ అనే ఆసక్తిని పక్కన పెట్టి అపోలో ఆసుపత్రులను డెవలప్‌ చేయడానికి, దీన్ని విస్తరించడానికి నా వంతుకృషి చేస్తున్నాను. అనేక కార్యక్రమాలను విస్తరించాను. చిన్నారలకు ఎదురయ్యే గుండె సమస్యల్ని తగ్గించేందుకు `సేవ్‌ ఏచైల్డ్ హార్ట్` పేరుతో కార్యక్రమాలు ప్రారంభించాం. క్యాన్సర్‌తో బాధడే పేదలకు `క్యూర్‌` పేరుతో ఉచిత సేవలందిస్తున్నాం` అని తెలిపారు ఉపాసన. చరణ్‌తో పెళ్లైన ఏడాది తర్వాత వసుంధరకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాలను పంచుకున్నారు. 

55
`పెద్ది` సినిమాతో ఆరబోతున్న రామ్‌ చరణ్‌
Image Credit : Getty

`పెద్ది` సినిమాతో ఆరబోతున్న రామ్‌ చరణ్‌

రామ్‌ చరణ్‌, ఉపాసన ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2012లో వీరి వివాహం జరిగింది. రామ్‌ చరణ్‌ ప్రస్తుతం సినిమాలో బిజీగా ఉన్నారు. గ్లోబల్‌ స్టార్‌గా రాణిస్తున్నారు. ప్రస్తుతం ఆయన `పెద్ది` చిత్రంలో నటిస్తున్నారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా చేసింది. చిత్రీకరణ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రం ఏప్రిల్‌ 30న విడుదల కానుంది. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
రామ్ చరణ్ కొణిదెల
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
Latest Videos
Recommended Stories
Recommended image1
Bhoot Bangla: అక్షయ్ కుమార్, టబు లకు షాకింగ్ రెమ్యునరేషన్.. ఈ మూవీ కోసం ఒక్కొక్కరు ఎంత తీసుకున్నారో తెలుసా
Recommended image2
Dhurandhar : ధురంధర్ మూవీలో మిస్టేక్.. దొరికిపోయిన చిత్ర యూనిట్, నెటిజన్ల ఫన్నీ కామెంట్స్ వైరల్
Recommended image3
Rashmika Mandanna: ఇంతలా దిగజారాలా ? వేధింపులకు హద్దుల్లేకుండా పోయింది..ఆడియో లీక్ వివాదంపై రష్మిక ఫైర్
Related Stories
Recommended image1
Raghavendra Raoకి మాటిచ్చి ఆ కోరిక తీర్చకుండానే వెళ్లిపోయిన స్టార్‌ హీరోయిన్‌ ఎవరో తెలుసా?
Recommended image2
Laya Mistake: లయ చేసిన బిగ్‌ మిస్టేక్‌ ఇదే, ఒక్క సినిమాతో కెరీర్‌ తలక్రిందులు.. అది తలచుకుని ఆవేదన
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved