- Home
- Entertainment
- Chiranjeevi Movie Remake: చిరంజీవి సూపర్ హిట్ మూవీ రీమేక్, ఆ కామెడీ హీరోకే సాధ్యం.. తేల్చేసిన రాంచరణ్, కానీ
Chiranjeevi Movie Remake: చిరంజీవి సూపర్ హిట్ మూవీ రీమేక్, ఆ కామెడీ హీరోకే సాధ్యం.. తేల్చేసిన రాంచరణ్, కానీ
మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఎన్నో హిట్ చిత్రాలు ఉన్నాయి. ఓ సినిమా మాత్రం చాలా మంది స్టార్స్ కి ఫేవరేట్. ఆ మూవీని ఓ కామెడీ హీరో మాత్రమే రీమేక్ చేయాలి అని రాంచరణ్ కోరారు. ఇంతకీ ఆ కామెడీ హీరో ఎవరో ఈ కథనంలో తెలుసుకుందాం.

Chiranjeevi
మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోని సూపర్ హిట్ పాటలని అప్పుడప్పుడూ రీమిక్స్ చేస్తూనే ఉంటారు. రాంచరణ్ కూడా కొన్ని సాంగ్స్ తన సినిమాల్లో రీమిక్స్ చేశారు. అదే విధంగా సాయిధరమ్ తేజ్ కూడా గువ్వా గోరింకతో లాంటి పాటలని రీమిక్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే చిరంజీవి సాంగ్స్ కాదు.. సినిమాలని ఎప్పుడు రీమేక్ చేస్తారు అనే ప్రశ్న అభిమానుల్లో తలెత్తుతోంది.
జంధ్యాల దర్శకత్వంలో..
కొన్ని సినిమాలకు రీమేక్స్, కొన్ని సినిమాలకు సీక్వెల్స్ చేస్తే బావుంటుంది అనేది అభిమానుల కోరిక. చిరంజీవి సినిమాల్లో రీమేక్ చేయాలని ప్రధానంగా వినిపించే సినిమా పేరు చంటబ్బాయ్. 1986లో జంధ్యాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. సుహాసిని హీరోయిన్. జగ్గయ్య, ముచ్చెర్ల అరుణ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఈ తరంలో నాని, అల్లు అర్జున్, రాంచరణ్ ఇలా చాలా మంది స్టార్స్ కి ఫేవరేట్ మూవీ.
నానికి ఇష్టమైన మూవీ
ఓ సందర్భంలో నాని చంటబ్బాయ్ సినిమాని రీమేక్ చేయాలని ఉందనే కోరిక బయటపెట్టారు. చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో చంటబ్బాయ్ రీమేక్ లో అల్లు అర్జున్ నటిస్తే చాలా బావుంటుంది అని తెలిపారు. కానీ చంటబ్బాయ్ మూవీ విషయంలో రాంచరణ్ కోరిక మరోలా ఉంది.
చంటబ్బాయ్ రీమేక్
ఈ సినిమాని ఒక కామెడీ హీరో రీమేక్ చేస్తే సూపర్ హిట్ అవుతుందని రాంచరణ్ తేల్చేశారు. ఆ కామెడీ హీరో ఎవరో కాదు అల్లరి నరేష్. చిరంజీవి పాటలని రీమిక్స్ చేసింది కేవలం మెగా ఫ్యామిలీ హీరోలు మాత్రమే కాదు.. అల్లరి నరేష్ కూడా రీమిక్స్ చేశారు. కొండవీటి రాజా చిత్రంలోని మంచమేసి దుప్పటేసి మల్లెపూలు చల్లని రారా అనే సాంగ్ ని అల్లరి నరేష్ సీమ శాస్త్రి మూవీలో రీమిక్స్ చేసారు.
స్వయంగా చెప్పిన రాంచరణ్
అంత కాదు యముడికి మొగుడు అనే టైటిల్ ని కూడా వాడుకున్నారు. అదే సినిమాలో అల్లుడా మజాకా చిత్రంలోని అత్తో అత్తమ్మ కూతురో సాంగ్ ని రీమిక్స్ చేశారు. యముడికి మొగుడు సినిమా ఈవెంట్ కి అతిథిగా చిరంజీవి హాజరు కావలసింది. చిరంజీవి ఆ టైంలో అవుట్ డోర్ షూటింగ్ లో ఉండడం వల్ల రాలేక పోయారు. దీనితో రాంచరణ్ హాజరయ్యారు. ఆ ఈవెంట్ లో రాంచరణ్.. చంటబ్బాయ్ రీమేక్ అల్లరి నరేష్ చేస్తే బావుంటుంది అని తెలిపారు.

