- Home
- Entertainment
- Bigg Boss 10 Elimination: బిగ్ బాస్ తెలుగు 10 ఏడో వారం ఎలిమినేషన్.. రెండో వారంలోనే ఆమె ఔట్
Bigg Boss 10 Elimination: బిగ్ బాస్ తెలుగు 10 ఏడో వారం ఎలిమినేషన్.. రెండో వారంలోనే ఆమె ఔట్
బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ ఏడో వారం ఆసక్తికరంగా సాగుతుంది. ఈ క్రమంలో ఈ వారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారనే సమాచారం లీక్ అయ్యింది. లేడీ కంటెస్టెంట్ హౌజ్‌ని వీడబోతున్నారట.

బిగ్ బాస్ తెలుగు 10 ఏడో వారం ఎలిమినేషన్
బిగ్ బాస్ తెలుగు 10 ఏడో వారం ఎలిమినేషన్‌కి సంబంధించిన షాకింగ్ విషయం బయటకు వచ్చింది. ఈ వారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారనేది తేలిపోయింది. ఏడో వారంలో రోహిత్, త్రిగుణ్, రామకృష్ణ, అమన్, స్వేతా నాయుడు, వర్షిణి, టెంపర్ వంశీ, సుధీర్, ఝాన్సీ, శివ, దక్షి, నీతూ మాస్టర్ నామినేషన్‌లో ఉన్నారు. వీరిలో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది. ఓటింగ్ ప్రకారం రోహిత్, త్రిగుణ్, అమన్, రామకృష్ణ టాప్‌లో ఉన్నారు. వీరితోపాటు సింగర్ ఝాన్సీ, టెంపర్ వంశీ, వర్షిణి, సుధీర్ లకు కూడా మంచి ఓటింగ్ పడుతోంది.
డేంజర్‌లో ఉన్నది వీళ్లే
ఇక డేంజర్‌లో ఉన్నది స్వేతా నాయుడు, నీతూ నటరాజ్, దక్షి, శివకుమార్. వీరిలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ అవుతారని అర్థమయ్యింది. అయితే ఓటింగ్ ప్రకారం నీతూ నటరాజ్, దక్షిలు లీస్ట్ లో ఉన్నారు. కానీ నీతూ మాస్టర్ సేవ్ అయ్యింది. ఆమె టాస్క్ ల్లో విజయం సాధించి ఈ వారం ఎలిమినేషన్ నుంచి, వచ్చే వారం నామినేషన్ నుంచి సేవ్ అయ్యింది. దీంతో మిగిలిన వారు ఈ వారం ఎలిమినేట్ కావాల్సి వస్తది. అయితే ఇందులో శుక్రవారం ఓటింగ్ ని చూస్తే అందరికంటే తక్కువ ఓటింగ్ దక్షికి వచ్చిందట. దీంతో ఆమె ఈ వారం ఎలిమినేట్ కాబోతుందని సమాచారం.
దక్షి ఎలిమినేట్?
ఓటింగ్ రిజల్ట్ ని బట్టి దక్షి ఏడో వారం హౌజ్‌ని వీడబోతుందని తెలుస్తోంది. అంతేకాదు బిగ్ బాస్ లవర్స్ కూడా ఈ విషయాన్ని కన్ఫమ్ చేస్తున్నారు. ఏడో వారం దక్షి ఎలిమినేట్ కన్ఫమ్ అంటున్నారు. దీనికి సంబంధించిన పోస్ట్ లు వైరల్ అవుతున్నాయి. వైల్డ్ కార్డ్ ద్వారా ఐదో వారం బిగ్ బాగ్ హౌజ్‌లోకి వచ్చిన దక్షి రెండు వారాల్లోనే ఎలిమినేట్ కాబోతుండటం షాకిస్తోంది. గత సీజన్‌లో కూడా వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చినవాళ్లంతా వెంటవెంటనే వెళ్లిపోయారు. చూడబోతుంటే ఇప్పుడు కూడా అదే జరుగుతుందనిపిస్తుంది.
కంటెంట్ ఇవ్వలేకపోయిన దక్షి
దక్షి క్రేజీ కంటెస్టెంట్‌గా, గ్లామర్ డాల్‌గా హౌజ్‌లోకి అడుగుపెట్టింది. కానీ హౌజ్‌లో మాత్రం తన మార్క్ ని చూపించడంలో విఫలమవుతుంది. కంటెంట్ ఇవ్వలేకపోతుంది. ఆమెకి సంబంధించిన కంటెంట్ బయటకు రాలేదు, కొత్తగా, క్రేజీగా ఆమె ఏం చేయలేకపోయింది. దీంతో ఆడియెన్స్ నుంచి రిజెక్షన్ ఎదురవుతుందని తాజా ఓటింగ్‌ని బట్టి తెలుస్తోంది. అయితే ఆమె ఎలిమినేషన్‌కి సంబంధించి మరింత క్లారిటీ రావాల్సి ఉంది. నాగార్జున హోస్ట్ గా చేస్తున్న `బిగ్ బాస్ తెలుగు 10` ఇప్పుడు ఏడో వారం ముగింపుకి చేరుకుంది. ప్రస్తుతం హౌజ్‌లో 17 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. అయితే ఈ వారం సింగిల్ ఎలిమినేషనా, డబుల్ ఎలిమినేషనా అనేది తెలియాల్సి ఉంది.

