- Home
- Entertainment
- Srihari: 9 భాషల్లోకి రీమేక్ అయిన తెలుగు మూవీ, బంగ్లాదేశ్ లో కూడా బ్లాక్ బస్టర్.. దటీజ్ రియల్ స్టార్ శ్రీహరి
Srihari: 9 భాషల్లోకి రీమేక్ అయిన తెలుగు మూవీ, బంగ్లాదేశ్ లో కూడా బ్లాక్ బస్టర్.. దటీజ్ రియల్ స్టార్ శ్రీహరి
9 భాషల్లో రీమేక్ అయిన తెలుగు మూవీ గురించి రియల్ స్టార్ శ్రీహరి గతంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మూవీ విజయం వెనుక శ్రీహరి పాత్ర ప్రధానంగా ఉంది. ఈ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

Srihari
బాహుబలి తర్వాత తెలుగు సినిమా ప్రపంచ స్థాయికి చేరింది. ఆ సినిమాతోనే పాన్ ఇండియా చిత్రాల ట్రెండ్ ప్రారంభం అయింది. అయితే బాహుబలి కంటే ముందే కొన్ని తెలుగు సినిమాలు ఇండియా మొత్తం సంచలనం సృష్టించాయి. నేరుగా కాకున్నా పరోక్షంగా అయినా తెలుగు సినిమాల ప్రభావం అప్పట్లో ఇండియా మొత్తం ఉండేది. అందుకు ఉదాహరణ నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రం.
నువ్వొస్తానంటే నేనొద్దంటానా మూవీ
ఎమ్మెస్ రాజు నిర్మాతగా, ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ భారీ చిత్రం ఏమీ కాదు. మీడియం రేంజ్ సినిమా అనే చెప్పాలి. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కింగ్ సైజ్ విక్టరీ కొట్టింది. సిద్దార్థ్, త్రిష కెమిస్ట్రీ, దేవిశ్రీప్రసాద్ సంగీతం అప్పట్లో అభిమానులకు పిచ్చెక్కించాయి. ఈ సినిమాకి మరో పిల్లర్ కూడా ఉన్నారు.. ఆయనే రియల్ స్టార్ శ్రీహరి.
శ్రీహరికి నంది అవార్డు
ఈ మూవీలో శ్రీహరి త్రిష అన్నయ్యగా నటించారు. కథ శ్రీహరి కేంద్రగానే ఉంటుంది. ఈ మూవీలో ప్రధాన సంఘర్షణ నడిచేది హీరోకి, శ్రీహరికి మధ్యనే. శ్రీహరి తన పాత్రలో జీవించేశారు. అందుకే ఈ చిత్రానికి గాను శ్రీహరి ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డు గెలుచుకున్నారు. బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించడమే కాదు.. దేశం మొత్తం సినీ పరిశ్రమల దృష్టిని ఈ మూవీ ఆకర్షించింది. బంగ్లాదేశ్ చిత్ర పరిశ్రమ దృష్టిని కూడా ఈ సినిమా ఆకర్షించింది అంటే నువ్వొస్తానంటే నేనొద్దంటానా సృష్టించిన ప్రభావం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
9 భాషల్లో రీమేక్, బంగ్లాదేశ్ లో భారీ హిట్
ఈ సినిమాని ఏకంగా 9 భాషల్లో రీమేక్ చేశారు. ఆ వివరాలు ఇక్కడ ఉన్నాయి.
1. నీనెల్లో నానల్లే - కన్నడ
2.ఉనక్కుమ్ ఎనక్కుమ్ - తమిళ్
3. ఐ లవ్యూ - బెంగాలీ
4. నింగోల్ తాజాబ - మణిపూరి
5. సునా ఛాదేయి మో రూప ఛాదేయి - ఒడియా
6. తేరా మేరాకి రిస్తా - పంజాబీ
7. నిశాశ్ అమర్ తుమీ - బంగ్లాదేశీ
8. ది ఫ్లాష్ బ్యాక్ - నేపాలీ
9. రామయ్య వస్తావయ్యా - హిందీ
ఇలా మొత్తం 9 భాషల్లో ఈ చిత్రానికి రీమేక్ చేశారు. దాదాపు అన్ని భాషల్లో ఈ సినిమా విజయం సాధించింది.
శ్రీహరి నట విశ్వరూపం
నువ్వొస్తానంటే నేనొద్దంటానా మూవీలో తన పాత్రకి నంది అవార్డు లభించిన సందర్భంలో రియల్ స్టార్ శ్రీహరి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నా దగ్గరకు వచ్చిన ప్రతి సినిమాని నేను ఒప్పుకోను. నా పాత్రకి బలం ఉండాలి. ఈ సినిమా నా దగ్గరకు వచ్చినప్పుడే నా పాత్రతో పాటు, ఈ చిత్రానికి కూడా నంది అవార్డులు వస్తాయని, ఘనవిజయం సాధిస్తుంది అని ఎమ్మెస్ రాజు గారికి చెప్పా. నేను చెప్పినట్లే జరిగింది అని శ్రీహరి అన్నారు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రం ఆ రేంజ్ లో సక్సెస్ కావడం వెనుక శ్రీహరి నటన ప్రధాన కారణం అంటూ అప్పట్లో అభిమానులు చెప్పుకున్నారు.

