- Home
- Entertainment
- రామ్ చరణ్ నుంచి రజినీకాంత్ వరకూ ప్రైవేట్ జెట్ లను కలిగి ఉన్న స్టార్ హీరోలు ఎవరో తెలుసా?
రామ్ చరణ్ నుంచి రజినీకాంత్ వరకూ ప్రైవేట్ జెట్ లను కలిగి ఉన్న స్టార్ హీరోలు ఎవరో తెలుసా?
సినిమాల ద్వారా వందల కోట్లు సంపాదిస్తున్నారు పాన్ ఇండియా హీరోలు. లగ్జరీ లైఫ్ ను గడుపుతున్న ఈ హీరోలు సొంత విమానాలు కూడా కలిగి ఉన్నారు. ఇంతకీ వారు ఎవరంటే?

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు కోట్లు కూడబెడుతున్నారు. సినిమాలతో పాటు బిజినెస్ లు కూడా చేసుకుంటూ చేతినిండా సంపాదిస్తున్నారు. అంతే కాదు లగ్జరీ లైఫ్ స్టైల్ ను మెయింటేన్ చేస్తున్నారు. కాస్ట్లీ కార్లు, పెద్ద పెద్ద బంగ్లాలు, కోట్లు విలువచేసే వాచ్ లు ఇలా నచ్చని లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. అంతే కాదు స్టార్ హీరోలు సొంతంగా ప్రైవేట్ జెట్ లు కూడా కలిగి ఉన్నారని మీకు తెలుసా. స్టార్ హీరోలలో ఎవరు సొంత విమానాలు ఉన్నాయో తెలుసా?
రామ్ చరణ్:
టాలీవుడ్ నుంచి వరల్డ్ ఫేమస్ అయ్యాడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. స్టార్ హీరో మాత్రమే కాదు రామ్ చరణ్ మంచి బిజినెస్ మెన్ కూడా . రకరకాల వ్యాపారాల్లో ఆయన పెట్టుబడులు పెట్టి ఉన్నారు. విమానయాన రంగంలో కూడా రామ్ చరణ్ పెట్టుబడులు పెట్టారు. రామ్ చరణ్ సొంత ప్రైవేట్ జెట్‌ను కలిగి ఉన్నారు. రామ్ చరణ్ కు 'ట్రూజెట్' (Trujet) అనే ప్రాంతీయ ఎయిర్‌లైన్ కంపెనీ ఉంది. ఈ కంపెనీ విమానాలతో పాటు, రామ్ చరణ్ వ్యక్తిగత ప్రయాణాల కోసం ఒక ప్రైవేట్ జెట్‌ను ఉపయోగిస్తారు. ఇక ఈ జెట్ ను రామ్ చరణ్ సినిమా షూటింగ్‌లు, ప్రమోషన్స్ తో పాటు సినిమా ఈవెంట్లు, ఫ్యామిలీ టూర్ల కోసం యూస్ చేస్తుంటారు.
అల్లు అర్జున్:
ఐకాన్ స్టార్' అల్లు అర్జున్ ను కూడా ఒక విలాసవంతమైన ప్రైవేట్ జెట్ ఉంది. ఆరు సీట్ల జెట్ ను అల్లు అర్జున్ తన సినిమా ఈవెంట్స్ కోసం, ఫ్యామిలీ ట్రిప్స్ కోసం యూస్ చేసుకుంటారు. ఈ జెట్స్ ను కమర్షియల్ గా కూడా ఉపయోగిస్తారని తెలుస్తోంది. అల్లు అర్జున్ తన పెళ్లి సమయంలో తన భార్య అల్లు స్నేహ రెడ్డికి ఈ జెట్‌ను గిఫ్ట గా ఇచ్చారని ఓ రూమర్ ప్రచారంలో ఉంది. ప్రస్తుతం బన్నీ అట్లీ సినిమా హడావిడిలో ఉన్నాడు.
జూనియర్ ఎన్టీఆర్:
RRR తో గ్లోబల్ స్టార్ గా మారాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఆతరువాత కూడా దేవర, వంటి భారీ బ్లాక్ బస్టర్ సినిమాలతో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్ కు కాస్ట్లీ కార్లు, వాచ్ లు అంటే చాలా ఇష్టం. వాటి కోసం కోట్లు ఖర్చుపెడుుంటాడు తారక్. ఇక ఎన్టీఆర్ కు ఒక ఖరీదైన ప్రైవేట్ జెట్ కూడా ఉంది. దీని విలువ సుమారు 8 కోట్లు ఉంటుందని అంచనా. వ్యక్తిగత పర్యటనలకు ఈ జెట్ ను ఎక్కువగా ఉపయోగిస్తారని సమాచారం.
మహేష్ బాబు:
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ప్రైవేట్ జెట్‌ను కలిగి ఉన్నారు. అయితే మహేష్ చాలా రేర్ గా ఈ జెట్ ను ఉపమోగిస్తుంటారు. టాలీవుడ్ హీరోలలో విదేశాలకు ఎక్కువగా టూర్లకు వెళ్లేది మహేష్ ఫ్యామిలీనే. కాని ఆయన ప్రతీ ఫ్యామిలీ వెకేషన్ కు ఈ జెట్ ను ఉపమోగించరు. అరుదుగా ఆయన తన పర్యటనలకు ఈ ప్రైవేట్ జెట్ ను ఉపయోగిస్తుంటారు. అప్పుడప్పుడు సినిమా షూటింగ్‌లు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్ ఈవెంట్స్ కోసం ఇతర రాష్ట్రాలకు లేదా నగరాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు కూడా ఆయన ఈ జెట్‌ను ఉపయోగిస్తారు
చిరంజీవి, నాగార్జున:
ఇక టాలీవుడ్ స్టార్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి, 'కింగ్' నాగార్జున కూడా ప్రైవేట్ జెట్‌లను కలిగి ఉన్నారు. అయితే అవసరాన్ని బట్టి వాటిని ఉపయోగిస్తుంటారు ఇద్దరు హీరోలు. అత్యవరసర పరిస్థితుల్లో మాత్రమే ఈ ఇద్దరు హీరోలు తమ జెట్ లను వాడుతుంటారు. ఇక ఇతర సమయాల్లో ఈ జెట్ లను కమర్షియల్ గా రెంట్ కు ఇస్తున్నట్టు సమాచారం.
రజనీకాంత్:
ఇక తమిళ సూపర్ స్టార్' రజనీకాంత్ కూడా ఒక ప్రైవేట్ జెట్‌ను కలిగి ఉన్నారు. ఆయన వయసు, ఆరోగ్య సమస్యల ను దృష్టిలో పెట్టుకుని, దూర ప్రయాణాలకు, ఇబ్బందిలేకుండా ఉండట కోసం ఈ జెట్ ను ఉపయోగిస్తారని సమాచారం. కోలీవుడ్ నుంచి నయనతార కూడా సొంతంగా ప్రైవేట్ జెట్ ను కలిగి ఉన్న హీరోయిన్ గా రికార్డ్ క్రియేట్ చేసింది.