- Home
- Entertainment
- 900 కోట్ల కలెక్షన్లు, 4నెలల్లో 3 బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన లక్కీ హీరోయిన్ ఎవరు?
900 కోట్ల కలెక్షన్లు, 4నెలల్లో 3 బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన లక్కీ హీరోయిన్ ఎవరు?
మూడు సినిమాలు, నాలుగు నెలలు, 800 కోట్లకు పైగా కలెక్షన్స్. వరుస సక్సెస్ లతో.. హ్యాట్రిక్ హిట్ కొట్టిన లక్కీ హీరోయిన్ ఎవరో తెలుసా?
- FB
- TW
- Linkdin
Follow Us
)
లక్కీ హీరోయిన్
సినిమా హిట్ అయితే ఆ సక్సెస్ హీరో ఖాతాలోకే వెళ్తుంది. మరీ ముఖ్యంగా సినిమా బాక్సాఫీస్ కలెక్షన్లను హీరోలకే ఆపాదిస్తుంటారు. సినిమా హిట్ అయినా ప్లాప్ అయినా హీరోలపైనే ఎక్కువ ప్రభావం పడుతుంది. అయితే ఈమధ్య సినిమా ప్లాప్ అయితే కొన్ని సందర్భాల్లో ఆ నింద హీరోయిన్ల మీద వేస్తున్నారు. కాని సక్సెస్ అయితే మాత్ర ఆ క్రెడిట్ హీరోయిన్లకు ఇవ్వడంలేదు. కాని ఓ హీరోయిన్ మాత్రం వరుసగా మూడుసినిమాలతో బ్లాక్ బస్టర్ సక్సెస్ లు అందుకుని హ్యాట్రిక్ విన్నర్ గా నిలిచింది. హీరోలకు లక్కీ హీరోయిన్ గా మారింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా?
3 సినిమాలు 900 కోట్లు
ఈ హీరోయిన్ గత నాలుగు నెలల్లో మూడు బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను అందించింది. అది కూడా ఒకే భాషలో కాదు, మూడు వేర్వేరు భాషల్లో. ఈ మూడు సినిమాలు.. పండుగ కానుగకా రిలీజ్ అయ్యాయి. అందులో ఒకటి వినాయక చవితికి, మరొకటి దీపావళికి, మూడో ది సంక్రాంతికి విడుదలై బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించాయి. ఆహీరోయిన్ ఎవరో కాదు మీనాక్షి చౌదరి. ముగ్గరు స్టార్ హీరోలతో సినిమాలు చేసిన ఈ బ్యూటీ బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టింది.
మీనాక్షి చౌదరి హిట్ సినిమాలు
గత నాలుగు నెలల్లో మూడు బ్లాక్ బస్టర్ హిట్స్ ను అందుకుంది మీనాక్షి చౌదరి . ఆమె సాధించన ఫస్ట్ బ్లాక్ బస్టర్ గోట్'. విజయ్ హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈసినిమా తమిళనాట సూపర్ హిట్ అయ్యింది. బాక్సాఫీస్ దగ్గర భారీగా వసూళ్లు కూడా సాధించింది. ఈ సినిమా దాదాపు 500 కోట్లకు పైగా వసూలు చేసింది. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించిన ఈసినిమా గత ఏడాది వినాయక చవితి కానుకగా రిలీజ్ అయ్యింది.
లక్కీ భాస్కర్ లో మీనాక్షి చౌదరి
తర్వాత మీనాక్షి హిట్ లిస్ట్‌లో చేరిన సినిమా 'లక్కీ భాస్కర్'. గత ఏడాది దిపావళి కానుకగా విడుదలైన ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో మలయాళ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ లీడ్ రోల్ చేయగా.. దుల్కర్ సరసన నటించింది మీనాక్షి చౌదరి. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి.. బాక్సాఫీస్ దగ్గర 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
సంక్రాంతికి వస్తున్నాం తో మరో హిట్
ఇక ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. మీనాక్షి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది . టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మీనాక్షి చౌదరి నటించిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. ఈ సినిమాలో వెంకటేష్ సరసన ప్రియురాలిగా నటించింది మీనాక్షి. దిల్ రాజు నిర్మించిన ఈసినిమా బాక్సాఫీస్ దగ్గర 300 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇలా నాలుగు నెలల్లో 3 బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలతో 900 కోట్లకు పైగా వసూలు చేసి లక్కీ హీరోయిన్ గా మారింది మీనాక్షి చౌదరి.
మీనాక్షి చౌదరి ప్లాప్ సినిమాలు
మూడు సినిమాల హిట్ కొట్టి లక్కీ హీరోయిన్ గా మారిన మీనాక్షి చౌదరి ఖాతాలు ప్లాప్ సినిమాలు కూడా ఉన్నాయి. తమిళంతో పాటు తెలుగులో కూడా ప్లాప్ లు ఫేస్ చేసింది మీనాక్షి. మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా నటించిన మట్కా సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది. ఈసినిమా డిజాస్టర్ అయ్యింది. ఇక విశ్వక్ సేన్ జంటతా మెకానిక్ రాకీ సినిమాలో కూడా మీరోయిన్ గా నటించింది మీనాక్షి. ఈసినిమా కూడా డిజాస్టర్ అయ్యింది.