MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • కుస్తీ వీరుడిగా రామ్ చరణ్, ఊర మాస్ లుక్ లో మెగా పవర్ స్టార్ రచ్చ రచ్చ..

కుస్తీ వీరుడిగా రామ్ చరణ్, ఊర మాస్ లుక్ లో మెగా పవర్ స్టార్ రచ్చ రచ్చ..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు తో పాటు శ్రీరామనవమి సందర్భంగా మెగా అభిమానులకు భారీ ట్రీట్ ఇచ్చారు ‘పెద్ది టీమ్. ఇప్పటి వరకు ఎన్నడూ చూడని అద్భుతమైన మాస్ లుక్ లో రామ్ చరణ్ మెరిసిపోయాడు. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Mar 27 2026, 10:43 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా..
Image Credit : Asianet News

రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా..

రామ్ చరణ్ బర్త్ డేతో పాటు శ్రీరామ నవమి సందర్భంగా పెద్ది మూవీ టీమ్ మెగా అభిమానులకు ప్రత్యేక కానుక అందించింది. దర్శకుడు బుచ్చిబాబు సన తెరకెక్కిస్తున్న ఈ భారీ రూరల్ స్పోర్ట్స్ డ్రామా మూవీ నుంచి మార్చి 27న సరికొత్త టీజర్ విడుదలై సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఇప్పటికే విడుదలైన మొదటి టీజర్‌లో రామ్ చరణ్ క్రికెట్ ప్లేయర్‌గా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అయితే తాజాగా విడుదలైన టీజర్‌లో మాత్రం ఆయన పూర్తిగా భిన్నమైన మాస్ అవతార్‌లో దర్శనమిచ్చాడు. కుస్తీ పోటీల్లో పాల్గొనే శక్తివంతమైన యోధుడిగా చరణ్ టోన్డ్ బాడీతో ఆకట్టుకున్నాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
రామ్ చరణ్ మైండ్ బ్లోయింగ్ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్
Image Credit : Asianet News

రామ్ చరణ్ మైండ్ బ్లోయింగ్ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్

హల్క్ మాదిరిగా భారీ బాడీతో రామ్ చరణ్ కనిపించిన తీరు అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. భారీ దేహదారుఢ్యం తో పాటు షార్ప్ అండ్ రఫ్ లుక్ కలిసి చరణ్ చాలా పవర్‌ఫుల్‌గా కనిపించాడు. ఈ టీజర్ తో సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశారు టీమ్. చరణ్ ను ఈ రేంజ్ లో ఇంత వరకూ ఎవరు చూపించలేదు. 

పెద్ది టీజర్ ద్వారా.. సినిమా కథా నేపథ్యం గురించి ఆడియన్స్ లో కొంత క్లారిటీ కూడా వచ్చింది. ఉత్తరాంధ్ర గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథలో స్థానిక క్రీడలు, ముఖ్యంగా కుస్తీ పోటీలు కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ ఫిజిక్ , బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

33
రిలీజ్ కు రెడీ అవుతున్న పెద్ది..
Image Credit : Instagram/peddimovie

రిలీజ్ కు రెడీ అవుతున్న పెద్ది..

పెద్ది సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. గ్రామీణ నేపథ్యంలో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌లో ఆమె పాత్ర కూడా ఆసక్తికరంగా ఉండబోతుందని సమాచారం. ఆమె పాత్ర సినిమా కథలో కీలకంగా నిలుస్తుందని టాక్. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం, ‘పెద్ది’ సినిమా భారీ స్థాయిలో నిర్మితమవుతోంది. 

కథ, టేకింగ్, మ్యూజిక్, యాక్షన్ వంటి అన్ని విభాగాల్లో ఈ చిత్రం కొత్త ప్రమాణాలు సృష్టించే అవకాశముందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. ఇప్పటికే టీజర్‌తోనే భారీ బజ్ క్రియేట్ చేసిన ‘పెద్ది’, విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాల్సి ఉంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
రామ్ చరణ్ కొణిదెల
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Dhanush Wishes PM Modi: ధనుష్ ఒక్క ట్వీట్‌తో రేగిన పొలిటికల్ రచ్చ..విజయ్ అభిమానుల ట్రోలింగ్
Recommended image2
Kaaka: 'కాకా' భార్యగా సీనియర్ హీరోయిన్.. 25 ఏళ్లకు తీరబోతున్న ఆమె చిరకాల కోరిక ?
Recommended image3
Anasuya: అనసూయ ఏం చేసినా వైరల్ అయిపోద్ది.. షార్ట్ హెయిర్ తో గ్లామరస్ లుక్ చూశారా
Related Stories
Recommended image1
హీరోయిన్ కాళ్లు మొక్కిన బాలకృష్ణ, షాక్ లో అభిమానులు, నెటిజన్లు ఏమంటున్నారంటే?
Recommended image2
జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు బ్యాడ్ న్యూస్ చెప్పిన స్టార్ డైరెక్టర్, ఇక ఆ సినిమా సీక్వెల్ లేనట్టే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved