MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • హీరోయిన్ కాళ్లు మొక్కిన బాలకృష్ణ, షాక్ లో అభిమానులు, నెటిజన్లు ఏమంటున్నారంటే?

హీరోయిన్ కాళ్లు మొక్కిన బాలకృష్ణ, షాక్ లో అభిమానులు, నెటిజన్లు ఏమంటున్నారంటే?

నటసింహం బాలకృష్ణ ఎవరికైనా రెండు చేతులెత్తి నమస్కారం పెడతారు కానీ.. ఎవరి కాళ్లకు మొక్కిన సందర్భాలు లేవు. కాని ఫస్ట్ టైమ్ ఓ హీరోయిన్ కాళ్లకు బాలయ్య మొక్కడం.. ప్రస్తుతం సంచలంగామారింది. ఇంతకీ విషయం ఏంటి?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Mar 27 2026, 09:02 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
నటసింహం బాలయ్య చాలా స్ట్రిక్ట్..
Image Credit : facebook.com/OnlyForBalakrishnaFans

నటసింహం బాలయ్య చాలా స్ట్రిక్ట్..

సాధారణంగా తన తల్లిదండ్రులకు తప్ప బాలకృష్ణ ఇతరుల కాళ్లకు నమస్కారం చేసిన సందర్భాలు లేవు. ఎప్పుడు అలా కనిపించలేదు కూడా. రాఖీ సందర్భంగా అక్కల కాళ్లకు నమస్కారం చేసిన వీడియో మాత్రం గతంలో వైరల్ అయ్యింది. కానీ బాలయ్య బాబు చిన్నా పెద్ద ఎవరు ఎదురుగా వచ్చినా.. చాలా వినయంగా..చిరునవ్వు నవ్వుతూ.. రెండు చేతులెత్తి నమస్కారం చేస్తుంటారు. ఎప్పుడూ చాలా సీరియస్ గా కనిపించే బాలకృష్ణ.. పరిచయం ఉంటేనే చనువుగా వ్యవహరిస్తుంటారు. అటువంటిది.. నటసింహం ఓ హీరోయిన్ కాళ్లకు నమస్కారం చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
హేమా మాలిని కాళ్లకు బాలయ్య నమస్కారం..
Image Credit : Asianet News

హేమా మాలిని కాళ్లకు బాలయ్య నమస్కారం..

బాలయ్యతన కాళ్లకు నమస్కారం చేయడానికి వచ్చిన వారినీ కూడా తరచుగా మందలిస్తూ, “తల్లిదండ్రులకు తప్ప ఎవరి కాళ్లకు మొక్కకండి” అని చెప్పేవారని తెలిసిందే. అయితే తాజాగా, బాలీవుడ్ సీనియర్ నటి హేమ మాలిని కాళ్లకు బాలకృష్ణ నమస్కారం చేస్తున్న వీడియో బయటకు రావడంతో అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ వీడియోలో హేమ మాలిని ఆప్యాయంగా బాలకృష్ణను పలకరించడం, బాలకృష్ణ వినయంగా నిలబడి మాట్లాడటం కనిపిస్తోంది.

Related Articles

Related image1
మహేష్ బాబు తండ్రిగా హీరో రాజశేఖర్ మిస్ అయిన బ్లాక్ బస్టర్ మూవీ ఏదో తెలుసా?
Related image2
జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు బ్యాడ్ న్యూస్ చెప్పిన స్టార్ డైరెక్టర్, ఇక ఆ సినిమా సీక్వెల్ లేనట్టే..
35
బాలకృష్ణకు అరుదైన పురస్కారం..
Image Credit : Asianet News

బాలకృష్ణకు అరుదైన పురస్కారం..

దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం సాయంత్రం అత్యంత వైభవంగా ప్రారంభమైన ‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఢిల్లీ 2026’ వేడుకల్లో బాలకృష్ణకు జాతీయ స్థాయిలో ‘లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్’ పురస్కారాన్ని అందజేశారు. 50 ఏళ్లకు పైగా సినిమా కెరీర్ ను కంప్లీట్ చేసుకుని, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి నందమూరి బాలయ్య చేసిన కృషిని గుర్తిస్తూ జీవితకాల సాఫల్య పురస్కారంతో సత్కరించారు. ఢిల్లీలోని ప్రఖ్యాత ‘భారత్ మండపం లో ఈ వెంట్‌ ఘనంగా జరిగింది. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా చేతుల మీదుగా బాలయ్య ఈ పురస్కారం అందుకున్నారు.

45
నెటిజన్లు ఏమంటున్నారంటే?
Image Credit : Asianet News

నెటిజన్లు ఏమంటున్నారంటే?

కాగా ఈ వెంట్ లోనే బాలయ్య హేమా మాలిని కాళ్లకు నమస్కారం చేసినట్టు తెలుస్తోంది. ఈ వీడియో వైరల్ అవ్వడంతో సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. “మన కళ్లతో చూస్తున్నది నిజంగానే బాలయ్యనా?” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. హేమ మాలిని విషయానికి వస్తే, ఆమె సౌత్ నుంచి బాలీవుడ్‌ కు వెళ్లి.. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది. ధర్మేంద్రతో కలిసి అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించింది. అనంతరం ఆయనతో ప్రేమలో పడి వివాహం చేసుకుంది. వారి పిల్లలు కూడా ఇండస్ట్రీలోనే రాణిస్తున్నారు.

55
బాలకృష్ణ వరుస విజయాలు..
Image Credit : stockPhoto

బాలకృష్ణ వరుస విజయాలు..

వరుస విజయాలతో టాలీవుడ్ లో దూసుకుపోతున్నాడు బాలయ్య.. ఈమధ్య కాలంలో అఖండ సీక్వెల్ సినిమాతో పర్వాలేదనిపించాడు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈసినిమా.. అనుకున్నంత హిట్ అవ్వలేదు. ప్రస్తుతం సినిమాలకు స్మాల్ బ్రేక్ తీసుకున్న బాలకృష్ణ.. త్వరలో మలినేని గోపీచంద్ తో సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది. వీరిద్దరి కాంబోలో వచ్చిన వీర సింహరెడ్డి సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈసినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుందన్న టాక్ వినిపిస్తోంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
నందమూరి బాలకృష్ణ
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Duniya Vijay Divorce: భార్యకి విడాకులు ఇచ్చిన బాలయ్య విలన్‌, భరణం కింద 2 కోట్లు.. మరో కండీషన్‌ కూడా
Recommended image2
Vijay Deverakonda: రామ్ చరణ్ కాదు, శ్రీకృష్ణుడిగా విజయ్ దేవరకొండ.. రీమేక్ మూవీపై పెరుగుతున్న అంచనాలు
Recommended image3
Trisha Krishnan: పుకార్లకు చెక్ పెట్టిన త్రిష, లండన్ టూర్‌ వెనుక అసలు కథ ఇదే.. అభిమానులకు గుడ్‌న్యూస్‌
Related Stories
Recommended image1
మహేష్ బాబు తండ్రిగా హీరో రాజశేఖర్ మిస్ అయిన బ్లాక్ బస్టర్ మూవీ ఏదో తెలుసా?
Recommended image2
జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు బ్యాడ్ న్యూస్ చెప్పిన స్టార్ డైరెక్టర్, ఇక ఆ సినిమా సీక్వెల్ లేనట్టే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved