గేమ్ ఛేంజర్ సాంగ్ లో రామ్ చరణ్ జాకెట్, కాస్ట్ ఎంతో తెలిస్తే.. కళ్ళుతిరగాల్సిందే..?
గేమ్ ఛేంజర్ తో రిలీజ్ కు రెడీగా ఉన్నాడు రామ్ చరణ్. సంక్రాంతికి రాబోతున్న ఈసినిమా నుంచి ఏదో ఒక అప్ డేట్ రిలీజ్ అవుతూనే ఉంది.
గేమ్ ఛేంజర్ తో సంక్రాంతి బరిలో నిలిచాడు రామ్ చరణ్. ఈసారి సాలిడ్ గా కొట్టాలని ప్రయత్నిస్తున్నాడు. శంకర్ డైరెక్ట్ చేసిన ఈమూవీ ప్రమోషన్స్ ను భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు మేకర్స్. అంతే కాదు ఈసినిమా ప్రమోషన్లు స్టార్ట్ అయ్యాయి కాబట్టి.. ఇక వరుసగా సినిమా నుంచి ఏదో ఒక అప్ డేట్ వస్తూనే ఉంది. తాజా ఈసినిమా నుంచి డోప్ సాంగ్ రిలీజ్ అవ్వబోతోంది. ఈనెల 21న సాంగ్ రిలీజ్ ఉంది. ఈ సాంగ్ ప్రమోమోకు అద్భుతమైన రెస్పాన్స్ కూడా వస్తోంది.
Game Changer
అయితే ఈ సినిమాపై అంచనాలు పెంచే విధంగా ఏదో ఒక వార్త ఈసినిమా గురించి వైరల్ అవుతూనే ఉంది. ఇక ఈ పాటకు సబంధించిన ఒక విషయం ప్రస్తతం నెట్టింట హల్ చల్ చేస్తోంది. అదేంటంటే.. రామ్ చరణ్ వేసుకున్న కాస్ట్యూమ్స్. ఈ పాటలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో పాటు కియారా అద్వాని వేసుకున్న కాస్ట్యూమ్స్ ఆడియన్స్ దృష్టిని బాగా ఆకర్శించాయి.
మరీ ముక్యంగా రామ్ చరణ్ ఈ సాంగ్ లో వేసుకున్న జాకెట్ వైపు అభిమానుల కళ్లు వెళ్లాయి. అయితే ఇక్కడ వింత ఏంటంటే.. ఆ జాకెట్ పై రకరకాల ప్రైజ్ టాగ్స్ ఉన్నాయి. ఈ పాటలో శంకర్ మార్క్ స్టైల్ కనిపించింది. పాట కోసం గట్టిగానే ఖర్చు చేశాడు స్టార్ డైరెక్టర్ అయితే ఇదంతా పక్కన పెడితే.. రామ్ చరణ్ వేసుకున్న ఆ డిఫరెంట్ జాకెట్ కాస్ట్ ఎంత ఉండి ఉంటుంది అని అంతా గూగుల్ లో సెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు.
ఇక ఆ జాకెట్ ధర చాలా ఎక్కవు అని తెలియడంతో అంతా షాక్ అవుతున్నారు. ఆ ప్రైజ్ తో ఓ చిన్న ఫ్యామిలీ ఓ ఇల్లు కూడా కట్టుకోవచ్చంట. ఇంతకీ ఆ స్పెషల్ జాకెట్ రేట్ ఎంతో తెలుసా.. అక్షరాలా ఆరు లక్షల రూపాయిలు . సామాన్యులు ఇలాంటి వాటిని కొనుగోలు చేయడం అసాధ్యం. కేవలం రామ్ చరణ్ రేంజ్ హీరోలు మాత్రమే ఇలాంటివి వేసుకోగలరు. ఇక మరోవిషయం ఏంటంటే.. ఈ సినిమాలో పాటలకోసం రామ్ చరణ్ వాడిన కాస్ట్యూమ్స్ కోట్లలో ఉండే అవకాశం లేకపోలేదు.
#Shankar, #GameChanger, #RamCharan, #KiaraAdvani
ఇక గేమ్ ఛేంజర్ సినిమా కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు మెగా ఫ్యాన్స్. ఎప్పుడెప్పుడు స్క్రీన్ పై రామ్ చరణ్ కనిపిస్తాడా అని ఆశగా చూస్తున్నారు. ఇక ఈమూవీ ప్రీరిలీజ్ ను కూడా భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే అది అమరావతిలో జరుగుతుందా లేక హైదరాబాద్ లో జరుగుతుందా అనేది మాత్రం క్లారిటీ లేదు.
#Shankar, #GameChanger, #RamCharan, #KiaraAdvani
ఇక గేమం ఛేంజర్ ప్రీరిలీజ్ బిజినెస్ కూడా భారీ ఎత్తున జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇటు ఇండియాలో, అటు ఓవర్ సిస్ లో కూడా గేమ్ ఛేంజర్ బిజినెస్ భారీగా జరుగుతుందట. అంతే కాదు ఈసినిమా కలెక్షన్లు వె్యి కోట్లు దాటే అవకాశం కూడా ఉంది. చూడాలి రామ్ చరణ్ కు శంకర్ కు గేమ్ ఛేంజర్ ఎటువంటి అగ్ని పరీక్ష పెడుతుందో.