MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • Ram Charan Health Update: ప్రపంచంలోనే బెస్ట్ డాక్టర్స్ తో‌ రామ్‌ చరణ్‌కి ఆపరేషన్, హెల్త్ ఎలా ఉందంటే?

Ram Charan Health Update: ప్రపంచంలోనే బెస్ట్ డాక్టర్స్ తో‌ రామ్‌ చరణ్‌కి ఆపరేషన్, హెల్త్ ఎలా ఉందంటే?

రామ్‌ చరణ్‌ కి మణికట్టు ఆపరేషన్‌ విజయవంతంగా పూర్తయ్యింది. అయితే ప్రపంచంలోనే ప్రఖ్యాతి గాంచిన డాక్టర్లు రామ్‌ చరణ్‌కి సర్జరీ చేయడం విశేషం. మరి ఇప్పుడు చరణ్‌ హెల్త్ ఎలా ఉందంటే?

2 Min read
Author : Aithagoni Raju
Published : Jul 27 2026, 09:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
సక్సెస్‌ఫుల్‌గా రామ్‌ చరణ్‌ ఆపరేషన్‌
Image Credit : instagram

సక్సెస్‌ఫుల్‌గా రామ్‌ చరణ్‌ ఆపరేషన్‌

రామ్‌ చరణ్‌ ఆపరేషన్‌ కోసం ఇటీవల కోయంబత్తూర్‌ వెళ్లిన విషయం తెలిసిందే. ఆయన మణికట్టుకు గాయం కావడంతో సర్జరీ కోసం మెగా ఫ్యామిలీ మొత్తం తరలి వెళ్లారు. చిరంజీవి, సురేఖ, రామ్‌ చరణ్‌తోపాటు ఉపాసన కూడా ఆసుపత్రికి వెళ్లారు. దగ్గరుండి రామ్‌ చరణ్‌ బాగోగులు చూసుకున్నారు. ఈ క్రమంలో తాజాగా  ఆపరేషన్‌ చేశారు. సక్సెస్‌ ఫుల్‌గా కుడిచేతి మణికట్టుకి సర్జరీ చేశారు. రామ్‌ చరణ్‌ `పెద్ది` సినిమా నుంచి మణికట్టు పెయిన్‌తో బాధపడుతున్నారు. ఆ సినిమా ప్రమోషన్స్ లోనూ చేతికి కట్టుతో కనిపించిన విషయం తెలిసిందే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ప్రపంచంలోనే టాప్‌ మోస్ట్ డాక్టర్ తో ఆపరేషన్‌
Image Credit : facebook.com/TeamRamcharan

ప్రపంచంలోనే టాప్‌ మోస్ట్ డాక్టర్ తో ఆపరేషన్‌

ఈ శస్త్రచికిత్సకు గంగా హాస్పిటల్ చీఫ్, ప్రపంచ ప్రఖ్యాత ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ఎస్. రాజశేఖరన్ నాయకత్వం వహించారు. ఎన్నో దశాబ్దాల అనుభవం, జాతీయ–అంతర్జాతీయ స్థాయిలో అనేక పురస్కారాలు అందుకున్న ఆయన ఆర్థోపెడిక్ రంగంలో దిగ్గజంగా గుర్తింపు పొందారు. ఇదే డాక్టర్ రాజశేఖరన్ గతంలో చిరంజీవికి అత్యంత క్లిష్టమైన వెన్నెముక శస్త్రచికిత్సను కూడా విజయవంతంగా నిర్వహించారు.

Related Articles

Related image1
Chennai Love Story 3 Days Collections: దుమ్ములేపుతున్న చెన్నై లవ్‌ స్టోరీ.. కిరణ్‌ సినిమాకి 3 రోజుల్లో ఎంత వచ్చాయంటే
Related image2
Pooja Hegde: సీఎం విజయ్ కూడా డిజప్పాయింట్‌ చేశాడు‌.. పూజా హెగ్డేకి దెబ్బ మీద దెబ్బ.. వరుసగా ఏడు సినిమాలు
34
రామ్‌ చరణ్‌ కోసం అమెరికా నుంచి స్పెషల్‌ డాక్టర్‌
Image Credit : instagram

రామ్‌ చరణ్‌ కోసం అమెరికా నుంచి స్పెషల్‌ డాక్టర్‌

రామ్ చరణ్ మణికట్టు సమస్యకు అత్యుత్తమ చికిత్స అందించాలనే ఉద్దేశంతో, అమెరికాలోని మయామికి చెందిన ప్రముఖ హ్యాండ్ అండ్ రిస్ట్ సర్జన్ డాక్టర్ అలెహాండ్రో బాడియాను ( Dr. Alejandro Badia) , ప్రత్యేకంగా కోయంబత్తూరుకు ఆహ్వానించారు. చేతి, మణికట్టు శస్త్రచికిత్సలు, ముఖ్యంగా స్పోర్ట్స్ ఇంజరీల చికిత్సలో ఆయన ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన నిపుణులు. సాధారణంగా ఆయన అపాయింట్‌మెంట్ పొందడమే ఎంతో కష్టమైన విషయం. అలాంటి ఆయన ప్రత్యేకంగా రామ్ చరణ్ కోసం రావడం విశేషం. డాక్టర్ రాజశేఖరన్, డాక్టర్ అలెహాండ్రో బాడియా ( Dr. Alejandro Badia), డాక్టర్ ప్రవీణ్ భరద్వాజ అలాగే వారి నిపుణుల బృందం కలిసి ఈ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు.

44
రామ్‌ చరణ్‌కి తోడుగా మెగా ఫ్యామిలీ
Image Credit : others

రామ్‌ చరణ్‌కి తోడుగా మెగా ఫ్యామిలీ

ప్రస్తుతం రామ్ చరణ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, మరో నాలుగు రోజుల విశ్రాంతి అనంతరం హైదరాబాద్‌కు తిరిగి వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఈ సమయంలో చిరంజీవి–సురేఖ దంపతులు, ఉపాసన కోయంబత్తూరులోనే ఉండి రామ్ చరణ్‌కు తోడుగా ఉన్నారు. డాక్టర్ రాజశేఖరన్ కి చిరంజీవితో ఎంతోకాలంగా ఆత్మీయ స్నేహబంధం ఉంది. రామ్ చరణ్ త్వరగా పూర్తిగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
రామ్ చరణ్ కొణిదెల
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Booss 10 Contestants Remuneration: అత్యధిక పారితోషికం తీసుకునే కంటెస్టెంట్ ఎవరో తెలుసా? అతి తక్కువ వారికే
Recommended image2
Madhuri Rathod: ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం ఎందుకు చేసింది? షాకింగ్ నిజాలు
Recommended image3
Bigg Boss 20: బిగ్ బాస్ 20 గ్రాండ్ లాంచ్.. మేరీ కోమ్ నుంచి కనికా మాన్ వరకు.. హౌస్‌లోకి వెళ్లిన కంటెస్టెంట్లు వీరే
Related Stories
Recommended image1
Chennai Love Story 3 Days Collections: దుమ్ములేపుతున్న చెన్నై లవ్‌ స్టోరీ.. కిరణ్‌ సినిమాకి 3 రోజుల్లో ఎంత వచ్చాయంటే
Recommended image2
Pooja Hegde: సీఎం విజయ్ కూడా డిజప్పాయింట్‌ చేశాడు‌.. పూజా హెగ్డేకి దెబ్బ మీద దెబ్బ.. వరుసగా ఏడు సినిమాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved