MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • Pooja Hegde: సీఎం విజయ్ కూడా డిజప్పాయింట్‌ చేశాడు‌.. పూజా హెగ్డేకి దెబ్బ మీద దెబ్బ.. వరుసగా ఏడు సినిమాలు

Pooja Hegde: సీఎం విజయ్ కూడా డిజప్పాయింట్‌ చేశాడు‌.. పూజా హెగ్డేకి దెబ్బ మీద దెబ్బ.. వరుసగా ఏడు సినిమాలు

పూజా హెగ్డే ఇటీవల `జన నాయగన్‌` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చింది. ఈ సినిమా పరాజయం దిశగా వెళ్తుంది. ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకుంది పూజా. కానీ డిజప్పాయింట్‌ తప్పడం లేదు.

2 Min read
Author : Aithagoni Raju
Published : Jul 27 2026, 07:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
జన నాయగన్‌తో డిజప్పాయింట్‌ అయిన పూజా హెగ్డే
Image Credit : Asianet News

జన నాయగన్‌తో డిజప్పాయింట్‌ అయిన పూజా హెగ్డే

బుట్టబొమ్మ పూజా హెగ్డేకి కాలం అస్సలు కలిసి రావడం లేదు. ఆమెకి సక్సెస్‌ దరిదాపుల్లో కూడా రావడం లేదు. దాదాపు నాలుగేళ్లుగా ఇదే పరిస్థితి. ఇప్పటికీ కోలుకోవడం లేదు. అయితే దళపతి విజయ్‌పై చాలా నమ్మకం పెట్టుకుంది. ఆయనతో కలిసి నటించిన `జన నాయగన్‌` మూవీ తనని గట్టెక్కిస్తుందని ఆశలు పెట్టుకుంది. ఎలాగైనా హిట్‌ కొట్టొచ్చు, మళ్లీ బౌన్స్ బ్యాక్‌ కావచ్చు అని భావించింది. కానీ అది జరగలేదు. `జన నాయగన్‌` మూవీ బాక్సాఫీసు వద్ద తేడా కొడుతుంది. నాలుగు రోజుల్లో వసూళ్లు బాగానే వచ్చాయి. కానీ విజయ్‌ రేంజ్‌ కలెక్షన్లు అని చెప్పలేం. ఈ మూవీ హిట్‌ కావాలంటే ఇంకో మూడు వందల కోట్లు రావాలి. అది కష్టమనే చెప్పాలి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
పూజా కెరీర్‌లో మరో ఫ్లాప్‌
Image Credit : Asianet News

పూజా కెరీర్‌లో మరో ఫ్లాప్‌

ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. కాకపోతే ఆమె పాత్రకి పెద్దగా స్కోప్‌ లేదు. ఏదో ఇరికించినట్టుగానే ఉంది. పాటల కోసం మాత్రమే ఆమెని తీసుకున్నట్టుగా ఉంది. ఒక స్టార్‌ హీరోయిన్‌ కి సెట్‌ అయ్యే పాత్ర అయితే కాదు, విజయ్ పై ఉన్న అభిమానంతో, నమ్మకంతో ఆమె ఈ మూవీ చేసిందని చెప్పొచ్చు. కానీ తీరా ఫలితం తేడా కొట్టింది. ఈ సినిమా విజయ్‌ అభిమానులను ఆకట్టుకున్నా, కమర్షియల్‌ గా మాత్రం డిజప్పాయింట్‌ చేయబోతుంది. ఈ సినిమా విషయంలో పూజా చాలా హోప్స్ పెట్టుకుంది. కానీ తీరా తేడా కొట్టింది. మరో ఫ్లాప్‌ తన ఖాతాలో వేసుకుంది.

Related Articles

Related image1
Rajinikanth Biopic: వెండితెరపైకి తలైవా జీవితం.. రజనీకాంత్‌గా కనిపించేది ఎవరు? షాకింగ్‌ ట్విస్ట్
Related image2
Chennai Love Story 3 Days Collections: దుమ్ములేపుతున్న చెన్నై లవ్‌ స్టోరీ.. కిరణ్‌ సినిమాకి 3 రోజుల్లో ఎంత వచ్చాయంటే
34
పూజా హెగ్డేకి వరుసగా 7వ ఫ్లాప్‌
Image Credit : Instagram

పూజా హెగ్డేకి వరుసగా 7వ ఫ్లాప్‌

పూజా హెగ్డేకి వరుసగా ఏడో ఫ్లాప్‌. ఆమెకి `ఆచార్య` నుంచి స్టార్ట్ అయ్యింది. ఇంకా చెప్పాలంటే `రాధేశ్యామ్‌` నుంచి స్టార్ట్ అయ్యిందని చెప్పొచ్చు. కాకపోతే మధ్యలో `బీస్ట్` మూవీ బాగానే ఆడింది. ఈ సినిమా టాక్‌తో సంబంధం లేకుండా కలెక్షన్లని వసూలు చేసింది. దీంతో పూజా నటించిన చిత్రాలు `ఆచార్య`తో  వరుసగా పరాజయాలు చెందుతూ వచ్చాయి. `ఆ ఆచార్య` తర్వాత `సర్కస్‌`, `కిసి కా భాయ్‌ కిసి కా జాన్‌`, `దేవా`, `రెట్రో`, `హై జవాని తో ఇష్క్ హోనా హై` చిత్రాలు పరాజయం చెందాయి. ఇప్పుడు `జన నాయగన్‌` కూడా అదే బాటలో ఉంది.

44
పూజా హెగ్డేకి దెబ్బ మీద దెబ్బ
Image Credit : stockPhoto

పూజా హెగ్డేకి దెబ్బ మీద దెబ్బ

దీంతో పూజా హెగ్డే కెరీర్‌కిది పెద్ద దెబ్బగా చెప్పొచ్చు. ఇండస్ట్రీలో సక్సెస్‌ ప్రభావం చాలా ఉంటుంది. పరాజయం వస్తే ఎవరూ పట్టించుకోరు. అయినా పూజా హెగ్డే తన స్టార్‌ పవర్‌తో ఆఫర్లు దక్కించుకుంది. ఇప్పటికీ అదే స్థాయిలో రాణిస్తోంది. ఆమె చేతిలో కూడా ఇప్పుడు రెండు సినిమాలున్నాయి. `కాంచనా 4`లో నటిస్తోంది. అలాగే `శ్రీశ్రీ` అనే సినిమాలో నటిస్తుంది. ఈ రెండు సినిమాలు అయినా పూజాకి సక్సెస్‌ ఇస్తాయేమో చూడాలి. అయితే సినిమా సక్సెస్‌, ఫెయిల్యూర్‌ విషయంలో హీరోయిన్ల పాత్ర ఏమీ ఉండదు. కథ, దర్శకుడు తీసేదాన్ని బట్టే ఉంటుంది. కానీ నెగటివ‌‌ ప్రభావం మాత్రం హీరో, దర్శకుడితోపాటు హీరోయిన్‌పై కూడా పడటం గమనార్హం.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
టీవీకే విజయ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Mannat Renovation: మరింత పెద్దదిగా మారుతున్న షారుఖ్ 'మన్నత్'.. ఈ 3 విషయాలు తెలుసా?
Recommended image2
Rajinikanth: నేను తాగడం మానేయడానికి ఆయనే కారణం.. రజినీ చెప్పిన షాకింగ్ ఇన్సిడెంట్
Recommended image3
Actor Prince: న్యూజిలాండ్ లో ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం..ప్రియురాలి మెడలో మూడు ముళ్ళు, ఆమె బ్యాగ్రౌండ్ ఇదే
Related Stories
Recommended image1
Rajinikanth Biopic: వెండితెరపైకి తలైవా జీవితం.. రజనీకాంత్‌గా కనిపించేది ఎవరు? షాకింగ్‌ ట్విస్ట్
Recommended image2
Chennai Love Story 3 Days Collections: దుమ్ములేపుతున్న చెన్నై లవ్‌ స్టోరీ.. కిరణ్‌ సినిమాకి 3 రోజుల్లో ఎంత వచ్చాయంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved