MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • Chennai Love Story 3 Days Collections: దుమ్ములేపుతున్న చెన్నై లవ్‌ స్టోరీ.. కిరణ్‌ సినిమాకి 3 రోజుల్లో ఎంత వచ్చాయంటే

Chennai Love Story 3 Days Collections: దుమ్ములేపుతున్న చెన్నై లవ్‌ స్టోరీ.. కిరణ్‌ సినిమాకి 3 రోజుల్లో ఎంత వచ్చాయంటే

కిరణ్‌ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటించిన `చెన్నై లవ్‌ స్టోరీ` మూవీ బాక్సాఫీసు వద్ద రచ్చ చేస్తోంది. ఈ మూవీ మూడు రోజుల్లో అదిరిపోయే వసూళ్లని రాబట్టింది.

2 Min read
Author : Aithagoni Raju
Published : Jul 27 2026, 07:50 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న చెన్నై లవ్‌ స్టోరీ
Image Credit : Asianet News

సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న చెన్నై లవ్‌ స్టోరీ

కిరణ్‌ అబ్బవరం వరుసగా విజయాలు సాధిస్తూ దూసుకుపోతున్నాడు. ఆయన `క` సినిమాకి ముందు ఎంతగా స్ట్రగుల్‌ అయ్యాడో, ఇప్పుడు అదే స్థాయిలో వరుస సక్సెస్‌లు అందుకుంటూ తనేంటో నిరూపించుకుంటున్నాడు. ఇమేజ్‌లు, ఎలివేషన్లకి ప్రయారిటీ ఇవ్వకుండా కథని నమ్ముకొని సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో తన పాత్రకి ప్రయారిటీ అనేది కూడా పట్టించుకోవడం లేదు. ఇదే ఇప్పుడు ఆయన సక్సెస్‌కి కారణమని చెప్పొచ్చు. తాజాగా నటించిన `చెన్నై లవ్‌ స్టోరీ`లో ఆయన పాత్ర కంటే హీరోయిన్‌ పాత్రకే ప్రయారిటీ ఉంటుంది. ఓ రకంగా ఆమెనే హీరో అనేలా ఉంటుంది. ఒక హీరో.. హీరోయిన్‌ పాత్రకి ప్రయారిటీ ఇవ్వడమే ఈ మూవీ సక్సెస్‌కి కారణమని చెప్పొచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
చెన్నై లవ్‌ స్టోరీ స్టోరీ ఇదే
Image Credit : Asianet News

చెన్నై లవ్‌ స్టోరీ స్టోరీ ఇదే

`చెన్నై లవ్‌ స్టోరీ` మూవీలో కిరణ్‌ అబ్బవరంకి జోడీగా శ్రీ గౌరీ ప్రియ నటించింది. రవి నంబూరి దర్శకత్వం వహించారు. ఎస్‌కేఎన్, సాయి రాజేష్‌ నిర్మించారు. ధీరజ్‌ మొగిలినేని సహ నిర్మాత. దీనికి సాయిరాజేష్‌ కథ అందించడం విశేషం. పీఠలమీదే పెళ్లి ఆగిపోయిన అమ్మాయి.. డిప్రెషన్‌లోకి వెళ్తుంది. తాగుడికి బానిస అవుతుంది. ఈ క్రమంలో రిలీఫ్‌ కోసం చెన్నై వెళ్తుంది. అక్కడ ఫ్రెండ్స్ తో కలిసి ఉంటుంది. చెన్నైలో ఒక కుర్రాడు దర్శకుడిగా సినిమా ఛాన్స్ ల కోసం కథలు పట్టుకొని తిరుగుతుంటాడు. చెన్నై బీచ్‌లో ఓ రోజు వీరిద్దరు కలుసుకుంటారు. అమ్మాయి ఫ్రెండ్స్ ద్వారా వారి రూమ్‌కి వెళ్తాడు. అక్కడే ఉంటాడు. ఆ తర్వాత వీరిద్దరి మధ్య జరిగిన హేట్‌, లవ్‌, విషాదమే సినిమా.

Related Articles

Related image1
Chiranjeevi: బాస్ ఈజ్ బ్యాక్.. ఏపీ పొలిటికల్ స్క్రీన్ పై మెగాస్టార్.. చిరంజీవికి కూటమి సర్కార్ బిగ్ ఆఫర్ !
Related image2
Nani Paradise Aaya Sher Song: యూట్యూబ్ లో దుమ్మురేపుతోంది.. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది !
34
చెన్నై లవ్‌ స్టోరీ కలెక్షన్లు
Image Credit : Asianet News

చెన్నై లవ్‌ స్టోరీ కలెక్షన్లు

`చెన్నై లవ్‌ స్టోరీ` ఫీల్‌గుడ్ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీ. అమ్మాయి పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో సాగుతుంది. ఆద్యంతం ఎమోషనల్‌గా రన్‌ అవుతుంది. అదే సమయంలో గుండెని పిండేసే లవ్‌ ఉంది. మంచి ఫన్‌ కూడా ఉంది. ప్రీమియర్స్ తోనే ఆకట్టుకున్న ఈ చిత్రం విజయవంతంగా రన్‌ అవుతుంది. హిట్‌ టాక్‌తో దూసుకుపోతుంది.  ఈ మూవీ మూడు రోజులు పూర్తి చేసుకుంది. ఫస్ట్ వీకెండ్‌ అయిపోయింది. మరి ఇప్పటి వరకు ఎంత కలెక్ట్ చేసిందనేది చూస్తే, దీనికి మూడు రోజుల్లో రూ.24కోట్లు వచ్చాయి. మూడో రోజు రూ.6.25కోట్ల నెట్‌ కలెక్షన్లని, రూ.8.3కోట్ల గ్రాస్‌ని వసూలు చేసింది. ఇండియాలో ఇది రూ.19.21కోట్ల గ్రాస్‌, రూ.16.70కోట్ల నెట్‌ రాబట్టింది. ఓవర్సీస్‌లో మూడో రోజు కోటి రాగా, అక్కడ మొత్తంగా రూ.4.80కోట్లు కలెక్ట్ చేసింది. ఇదిలా ఉంటే ఈ మూవీ రెండు రోజుల్లోనే రూ.25కోట్లు రాబట్టినట్టు టీమ్‌ తెలిపింది. మూడు రోజులకు రూ.35 కోట్లకుపైగా రాబట్టినట్టు ప్రకటిస్తారని చెప్పొచ్చు.

44
చెన్నై లవ్‌ స్టోరీ బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్
Image Credit : Asianet News

చెన్నై లవ్‌ స్టోరీ బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్

`చెన్నై లవ్‌ స్టోరీ` మూడు రోజుల్లోనే దాదాపు 70శాతం వసూళ్లని రాబట్టింది. రెండో వారంలోనే ఈ మూవీ బ్రేక్‌ ఈవెన్‌ అవుతుందని చెప్పొచ్చు. సినిమాకి అయిన బడ్జెట్‌(ప్రమోషన్స్ తో కలిపి) రూ.32కోట్లు. థియేట్రికల్‌ బ్రేక్‌ ఈవెన్ టార్గెట్‌ రూ.16కోట్లు. అంటే రూ.32కోట్ల గ్రాస్‌ సాధిస్తే సినిమా హిట్‌. ఇంకా ఎనిమిది కోట్లు వస్తే, నిర్మాతలు సేఫ్‌ అని చెప్పొచ్చు. నాన్‌ థియేట్రికల్ రైట్స్(ఓటీటీ, శాటిలైట్‌, ఆడియో) రూపంలో ఈ మూవీకి మరో పది కోట్లు వచ్చాయి. సినిమా నలభై కోట్లు దాటితే బ్లాక్‌ బస్టర్‌ అని చెప్పొచ్చు. మరి ఎంత వరకు రాబడుతుందో చూడాలి.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Ranabaali Release Date: రణబాలి మూవీ కొత్త రిలీజ్‌ డేట్‌.. విజయ్‌ దేవరకొండ, రష్మికకి అసలైన పండగ
Recommended image2
Irumudi Controversy: వివాదంలో రవితేజ 'ఇరుముడి' సినిమా.. టీచర్ల నుంచి తీవ్ర అభ్యంతరం, ఎందుకంటే?
Recommended image3
Chiranjeevi: చిరంజీవి హీరో కావడానికి కారణమైన సూపర్‌ స్టార్‌ ఎవరో తెలుసా? ఆ ఒక్క మాటతో మెగాస్టార్‌ లైఫే మారిపోయింది
Related Stories
Recommended image1
Chiranjeevi: బాస్ ఈజ్ బ్యాక్.. ఏపీ పొలిటికల్ స్క్రీన్ పై మెగాస్టార్.. చిరంజీవికి కూటమి సర్కార్ బిగ్ ఆఫర్ !
Recommended image2
Nani Paradise Aaya Sher Song: యూట్యూబ్ లో దుమ్మురేపుతోంది.. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved