రామ్ చరణ్ రిజెక్ట్ చేస్తే.. మహేష్ బాబు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమా.. ? తెలిస్తే షాక్ అవుతారు..
రామ్ చరణ్ చేయాల్సిన సినిమా.. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా చేసి.. బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ కొట్టాడని మీకు తెలుసా..? ఇంతకీ మెగా పవర్ స్టార్ మిస్ అయిన సూపర్ హిట్ సినిమా ఏది..?
ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకరు చేయాల్సిన సినిమా మరొకరు చేసి హిట్ కొట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ కథ సూట్ అవ్వక.. లేదా హిట్ అవుతుందో లేదో అని నమ్మకం లేక.. లేదా.. డైరెక్టర్ మీద డౌట్ తోనో.. స్టార్ హీరోలు కొన్ని కథలను రిజెక్ట్ చేస్తుంటారు. ఆ కథలతో మరో స్టార్ హీరో హిట్ కొట్టిన సందర్భాలు కోకొల్లలు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా పటాస్ సినిమాను అలాగే మిస్ అయ్యాడు. ఇలానే చాలామంది హీరోలు సినిమాలు మిస్ చేసుకున్నారు. అలాంటి అరుదైన సందర్భంగురించే ఇప్పుడు మాట్లాడుకుందా..? మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేయాలసిన సినిమాను మహేష్ బాబు చేసిన సూపర్ హిట్ కొట్టాడట తెలుసా..?
Ram Charan
ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ వరల్డ్ స్టార్ గా ఎదిగాడు రామ్ చరణ్. వరుసగా పాన్ ఇండియా సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నాడు. మెగా కాంపౌండ్ నుంచి వచ్చినా.. తన సొంత ఇమేజ్ తో ఎదిగి చూసించాడు చరణ్. జేమ్స్ కామరూన్ లాంటి దర్శకులతో శభాష్ అనిపించుకున్నాడు చరణ్. అయితే ఆయన కెరీర్ లో కూడా కొన్ని ప్లాప్ లు తప్పలేదు. సినిమాల విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తున్న ఈ స్టార్ హీరో ఓ సందర్భంలో ఓ సూపర్ హిట్ కథను వదిలేసుకున్నాడు.
Mahesh Babu
అటు సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా చాలా జాగ్రత్తగా సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. ఏడాదికి ఒక్క సినిమా మాత్రమే చేసే మహేష్ బాబు.. ఉన్న టైమ్ అంతా తన ఫ్యామిలీకే కేటాయిస్తుంటాడు. కాస్త టైమ్ దొరికితే చాలు..ఫ్యామిలీని తీసుకుని ఫారెన్ చెక్కేస్తుంటాడు. ఈక్రమంలో ఆయన కొన్ని సినిమాలు మిస్ అవ్వగా.. రామ్ చరణ్ మిస్ అయిన కథతో తాను సూపర్ హిట్ కొట్టాడు సూపర్ స్టార్.
మోక్షజ్ఞ కోసం కత్తిలాంటి హీరోయిన్, బాలయ్య ప్లాన్ మామూలుగా లేదుగా..?
ఇంతకీ ఆ సినిమా ఏదో కాదు శ్రీమంతుడు. అవును కొరటాల శివ దర్శకత్వంలో.. మైత్రీమేకర్స్ నిర్మించిన ఈసినిమా రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ సాధించింది. నాన్ బాహుబలి రికార్డ్స్ ను బ్రేక్ చేసేసింది. అంతే కాదు వరుసగా హ్యాట్రిక్ ఫెయిల్యూర్స్ ను ఫేస్ చేసిన మహేష్ బాబుకు ఈమూవీ సూపర్ హిట్ ఇవ్వడంతో.. మహేష్ కు ఎంతో ధైర్యం వచ్చింది.
ఇక ఈమూవీని మహేష్ బాబు చేయాలసింది కాదట. ముందుగా ఈ కథ మెగా పవర్ స్టార్ రామ్ చరణ దగ్గరకు వెళ్లిందట. కాని రామ్ చరణ్ ఈ సినిమాన చేయడానికి ఇంట్రెస్ట్ చూపించలేదట. దాంతో ఇదే కథను మహేష్ కు వినిపించాడట కొరటాల శివ. దాంతో మహేష్ కు కథ నచ్చడం. వెంటనే షూటింగ్.. హిట్ అన్నీ జరిగిపోతూనే ఉన్నాయి.
Manchu Vishnu
ఇకప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి సినిమా కోసం రెడీ అవుతున్నాడు. అసలే ఏడాదికి ఒక్క సినిమా మాత్రమేచేసే మహేష్ బాబు.. రాజమౌళి సినిమా కోసం రెండు నుంచి నాలుగేళ్ళ వరకూ టైమ్ కేటాయించాల్సిందే. అసలే పాన్ వరల్డ్ స్థాయి కాబట్టి కాస్త టైమ్ పట్టే అవకాశం లేకపోలేదు.
ఇటు రామ్ చరణ్ కూడా బిజీ బిజీగా ఉన్నాడు . శంకర్ డైరెక్షన్ లో గేమ్ ఛేంజర్ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. ఈమూవీ తరువాత బుచ్చిబాబు సాన డైరెక్షన్ లో మరో సినిమా ఓపెనింగ్ కూడా జరిగిపోయింది. ఈసినిమాల్ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించబోతోంది.