జగన్ మాత్రమే కాదు.. స్టార్ హీరోలను వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా అవమానించాడు.. సీనియర్ యాక్టర్ సంచలన వ్యాఖ్యలు.
సినిమా ఇండస్ట్రీకి వైసీపికి దూరం ఎక్కువ.. జగన్ స్టార్ హీరోలను అవమానించాడని ఫ్యాన్స్ మనసుల్లో గట్టిగా నాటుకుపోయింది. అయితే గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా ఇలానే చేశాడు అని టాలీవుడ్ స్టార్ యాక్టర్ మురళీ మోహన్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
టాలీవుడ్ కు వైసీపీకి గ్యాప్ ఉన్నది అనేది అందరికి తెలిసిన విషయమే.. పోసాని లాంటి కొంత మంది తప్పించి ఆల్మోస్ట్ ఇండస్ట్రీ అంతా వైసీపికి దూరంగానే ఉన్నారు. కాగా జగన్ స్టార్ హీరోలను ఇంటికి పిలిచి అవమానించాడని.. ఫ్యాన్స్ లోకి గట్టిగా నాటుకుపోయింది. జగన్ సీఎం అయ్యాక సినిమా వాళ్లు స్పందించలేదని.. సన్మానించలేదని వైసీపీలో కోపం ఉంది. ఆకోపంతోనే టికెట్ రేట్ల విషయంలో.. రిలీజ్ ల విషయంలో ఇబ్బందిపెట్టకనే పెట్టేశారు.
దాంతో ఇండస్ట్రీలో జగన్ అంటే ఇంకాస్త వ్యాతిరేకత పెరిగిపోయింది. ఈలోపు ఇండస్ట్రీ పెద్దలను తన దగ్గరకు రప్పించుకోవడం.. వచ్చినవారికి కనీస మర్యాద ఇవ్వకుండా.. గేటు దగ్గరే ఆపేసి వారిని లోపలికి నడిపించడం లాంటి చర్యలు జగన్ పై వ్యతిరేకతు రెట్టింపు చేశాయి. సినిమా సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన పాన్ ఇండియా స్టార్లను గేటు నుంచి నడిపించడం.. అందరిని ఆశ్చర్యపరిచింది.
చిరంజీవి లాంటి స్టార్ చేత రెండు చేతులు జోడించి దండం పెట్టించుకోవడం.. అంతటి స్టార్ హీరో అలా రెండు చేతులు జోడించి దండం పెడుతుంటే.. వద్దని వారించకపోగా..వెటకారంగా నవ్వడం లాంటివి.. ఇండస్ట్రీ జనాలకు నచ్చలేదు. ఫ్యాన్స్ అయితే కోపంతో రగిలిపోయారు. ఈ ఇంపాక్ట్ కూడా ఎలక్షన్స్ లో బాగా చూపించింది. జగన్ స్టార్ హీరోలను అవమానించాడు అన్న విషయం గట్టిగా పబ్లిసిటీ అయ్యింది.
అయితే తాజాగా తెలిసిన మరో విషయం ఏంటంటే.. జగన్ మాత్రమే కాదు.. ఆయన తండ్రి.. మాజీ సీఎం.. దివంగత రాజశేఖర్ రెడ్డి కూడా ఇలానే స్టార్ హీరోలను అవమానించారట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్ సీనియర్ నటుడు మురళీ మోహన్ చెప్పారు. అవమానించారు అని చెప్పాలేం కాని.. స్టార్ హీరోలకు ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వలేదట. అసలు ఏం జరిగింది.. వైఎస్ ఏమన్నారు అంటే..
మురళీ మోహన్ మాట్లాడుతూ... మద్రాస్ నుంచి వచ్చినప్పటి నుంచి.. టాలీవుడ్ కు సొంత బిల్డింగ్ కాని.. ప్లేస్ కాని లేదు. దాంతో మేమంతా కలిసి యూనియన్ గా ఏర్పడ్డాము. దాని కోసం ఓ బిల్డింగ్ కట్టుకోవాలి అని అనుకున్నాము. అప్పుడు ప్లేస్ కొనేంత డబ్బులు యూనియన్ దగ్గర లేవు. దాంతో సినిమా డెవలప్ మెంట్ కోసం హైదరాబాద్ లో 25 ఎకరాలు కేటాయించారు. అందులో ఓ ఎకరం ఇస్తే.. యూనియన్ బిల్డింగ్ కట్టుకుంటామని అడగడానికి.. అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి దగ్గర కు వెళ్ళాము అన్నారు మురళీ మోహన్.
అప్పటికే నేను తెలుగు దేశంలో ఉన్నాను అందుకే నేను రాను వస్తే.. ఆయన ఏమంటారో అని చెప్పాను.. కాని మీరు రాకుంటే ఎలాగా అని అన్నారు. దాంతో నేను వెనకాల కూర్చుంటాను.. మీరు ముందుండి అడగండి అన్నాను. అనుకున్నట్టుగానే నేను వెనకాల కూర్చున్నాను. అప్పుడు ఈ విషయం అడిగిన వెంటనే.. వైస్ ఎస్ నా వైపు చూసి.. మురళీమోహన్ రియలెస్టేట్ బాగా చేస్తున్నాడు కదా.. అంత పెద్ద వ్యక్తి మీ వెనకాల ఉండగా.. మీకు స్థలం మేము ఇవ్వడం ఏంటీ.. అని అనేశారు. నేను ఊహించిందే జరిగింది అని అన్నారు మురళీ మోహన్.
ఇక స్థలం ఇవ్వం అని చెప్పకనేచెప్పారు కదా.. అనుకున్నాను. టాలీవుడ్ లో స్టార్ హీరోలంతా వెళ్ళారు కదా.. నేను వైఎస్ ను ఓ చిన్న ఫోటో దిగుదాం సార్ అని అడిగాను.. కాని ఆయన సీరియస్ గా ఫేస్ పెట్టి.. టైమ్ లేదు అని చెప్పి వెళ్లిపోయాడు. ఒక్క ఫోటో దిగడానికి ఎంత టైమ్ పడుతుంది. అప్పుడు ఫోటో దిగితే.. అది ఒక గుర్తుగా ఉండేది కదా..నాగేశ్వరావు గారు, చిరంజీవి, నాగార్జున, బాలయ్య, వెంకటేష్, మోహన్ బాబు, స్టార నిర్మాతలు, దర్శకులు ఇలా చాలామంది పెద్దవారు ఉన్నారు. వారు అక్కడ నిలుచుని ఉండగానే ఆయన ఆ మాట అని వెళ్ళిపోయారు.
నిజానికి ఫోటో దిగాలి అంటే 5 నిమిషాల పని.. ఆయన ఉండి దిగాలి అనుకుంటే దిగేవారు.. కాని వైస్ ఎస్ కు ఇష్టం లేదు అని తెలిసి పోయింది అన్నారు మురళీ మోహన్. ఇలా జగన్ మాత్రమే కాదు.. ఒక రకంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా సినిమా వాళ్లను..ముఖ్యంగా స్టార్ హీరోలను ఇలా చిన్నబుచ్చుకునేలా చేశారట.