MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Entertainment
  • Chiranjeevi Review: రామ్‌ చరణ్‌ పెద్ది సినిమాపై చిరంజీవి రివ్యూ.. తండ్రిగా గర్వపడే విషయం బయటపెట్టిన మెగాస్టార్‌

Chiranjeevi Review: రామ్‌ చరణ్‌ పెద్ది సినిమాపై చిరంజీవి రివ్యూ.. తండ్రిగా గర్వపడే విషయం బయటపెట్టిన మెగాస్టార్‌

రామ్‌ చరణ్‌ నటించిన `పెద్ది` సినిమా ఈ గురువారం విడుదలై థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ క్రమంలో ఈ మూవీపై చిరంజీవి తనదైన రివ్యూ ఇచ్చారు. తండ్రిగా గర్వపడుతున్నాడట. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Jun 04 2026, 04:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రామ్‌ చరణ్‌ పెద్దిపై చిరంజీవి రియాక్షన్‌
Image Credit : Asianet News

రామ్‌ చరణ్‌ పెద్దిపై చిరంజీవి రియాక్షన్‌

రామ్‌ చరణ్‌ హీరోగా నటించిన `పెద్ది` సినిమా భారీ అంచనాల మధ్య ఈ రోజు గురువారం విడుదలైంది. అయితే బుధవారం రాత్రి నుంచే ప్రీమియర్స్ ప్రదర్శించారు. దీనికి మిశ్రమ స్పందన లభించింది. ముఖ్యంగా రామ్‌ చరణ్‌ నటనపై ప్రశంసలు దక్కుతున్నాయి. అవార్డుల ఫిల్మ్ అంటూ అంతా ప్రశంసిస్తున్నారు. కథ, ఆర్టిస్ట్ ల పర్‌ఫెర్మెన్స్ గురించి అంతా మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలో ఈ మూవీపై తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి స్పందించారు. తన తనయుడిని చూసి గర్వంగా ఉందని చెప్పారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
పెద్దిపై చిరంజీవి రివ్యూ
Image Credit : Asianet News

పెద్దిపై చిరంజీవి రివ్యూ

`పెద్ది` మూవీపై చిరంజీవి తనదైన స్టయిల్‌లో రివ్యూ ఇచ్చాడు. కొడుకుని చూసి గర్వంగా ఉందని చెప్పి, మిగిలిన అందరు కాస్ట్, క్రూ గురించి ప్రత్యేకంగా కామెంట్‌ చేశారు. అందరిపై ప్రశంసలు కురిపించారు. తాను షూటింగ్‌ నిమిత్తం పొల్లాచిలో ఉన్నారట. కానీ తన మనసంతా పెద్ది మూవీ దగ్గరే ఉందని తెలిపారు చిరంజీవి.

35
రామ్‌ చరణ్‌ నటన చూసి గర్వంగా ఉందన్నారు చిరంజీవి
Image Credit : Asianet News

రామ్‌ చరణ్‌ నటన చూసి గర్వంగా ఉందన్నారు చిరంజీవి

ఈ సినిమా కోసం రామ్‌ చరణ్‌ గత రెండేళ్లు పడ్డ కష్టం, చూపించిన శ్రద్ధాశక్తులు అన్నీ తాను దగ్గరుండి చూశానని చెప్పారు. ఈ రోజు ప్రేక్షకుల ప్రేమ, ప్రశంసలు చూస్తుంటే ఒక తండ్రిగా మాత్రమే కాదు, ఒక నటుడిగా కూడా తనకు ఎంతో గర్వంగా ఉందన్నారు చిరంజీవి. `పెద్ది` పాత్రలో పూర్తిగా లీనం కావడానికి తను అహర్నిశలు చేసిన కృషి పట్టుదల, నిజాయితీ ప్రతి సన్నివేశంలో స్పష్టంగా కనిపిస్తున్నాయని, ఆ కష్టానికి దక్కిన ప్రతిఫలమే ఈ విజయమని చెప్పారు చిరు. రామ్‌ చరణ్‌ నటనని ఆకాశానికి ఎత్తేశారు.

45
దర్శకుడిపై చిరు ప్రశంసలు
Image Credit : Asianet News

దర్శకుడిపై చిరు ప్రశంసలు

ఇక మిగిలిన వారి గురించి చెబుతూ, దర్శకుడు బుచ్చిబాబుపై ప్రశంసలు కురిపించారు. ఇలాంటి అద్భుతమైన కథని రాసి, అంతే అద్భుతంగా తెరపై ఆవిష్కరించిన దర్శకుడు బుచ్చిబాబుకి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. అలాగే తన తొలి చిత్రాన్నే ఇంత భారీ స్థాయిలో, రాజీ లేకుండా నిర్మించిన నిర్మాత వెంకట్‌ సతీష్‌ కిలారుకి శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి భారీ చిత్రంలో నటించిన తన మిత్రుడు శివరాజ్‌ కుమార్‌కి, అప్పలసూరిగా పాత్రలో జీవించిన జగపతిబాబుకి అభినందనలు తెలిపారు.  

55
తెలుగు సినిమాకి గర్వకారణం పెద్ది
Image Credit : Asianet News

తెలుగు సినిమాకి గర్వకారణం పెద్ది

రెహ్మాన్‌ గురించి చెబుతూ, అద్భుతమైన పాటలు అందించారని, హృదయాన్ని కదిలించిన నేపథ్య సంగీతాన్ని అందించారని రెహ్మాన్‌ని అభినందించారు. తన కెమెరాతో ప్రతి ఫ్రేమ్‌ని అద్భుతంగా మలిచాడని రత్నవేలుకి, అలాగే అమోఘమైన ఆర్ట్ వర్క్ అందించారని అవినాష్‌ కొల్లాని, ఎడిటర్‌ నవీన్‌ నూలి తన నైపుణ్యంతో సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లాడని అభినందించారు. ఈ సినిమా విజయంలో భాగమైన జాన్వీ కపూర్‌, దివ్యేందు, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు, అలాగే వృద్ధి సినిమాస్‌, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్‌ రైటింగ్స్ సంస్థలకు ఆయన అభినందనలు తెలిపారు. పెద్ది సాధించిన ఈ ఘన విజయం తెలుగు సినిమాకి గర్వంగా నిలవాలని, మరెన్నో మైలురాళ్లు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని తెలిపారు చిరంజీవి. పెద్ది సినిమాపై ఆయన ఇచ్చిన రివ్యూ వైరల్‌గా మారింది.

Congratulations to our #PEDDI, my dear @AlwaysRamCharan and the entire cast & crew on this incredible blockbuster! 💐💐💐

నేను షూటింగ్ నిమిత్తం పొల్లాచిలో ఉన్నా కూడా నా మనసంతా “పెద్ది” దగ్గరే ఉంది.

గత రెండేళ్లగా ఈ సినిమా కోసం చరణ్ పడ్డ కష్టం, చూపించిన శ్రద్ధాశక్తులు అన్నీ… pic.twitter.com/gZwN99aERV

— Chiranjeevi Konidela (@KChiruTweets) June 4, 2026

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
రామ్ చరణ్ కొణిదెల
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
krishna: చార్లీ చాప్లిన్ గెటప్ వేయమంటే సూపర్ స్టార్ కృష్ణ ఏమన్నారో తెలుసా? షాక్ అయిన దర్శకుడు.. అస్సలు ఊహించలేదు..
Recommended image2
Irumudi 27 Days Collections: థియేటర్లో రవితేజ మాస్‌ జాతర.. 27వ రోజూ ఇరుముడికి సంచలన వసూళ్లు.. ఇక ఓటీటీ వంతు
Recommended image3
Temper Vamsi: టెంపర్ వంశీకి టెంపర్ లేచింది, రోహిత్ తో తీవ్ర స్థాయికి చేరిన గొడవ.. చుక్కలు చూపించిన దేబ్జానీ
Related Stories
Recommended image1
Peddi Movie Review: పెద్ది మూవీ రివ్యూ, రేటింగ్‌.. రామ్‌ చరణ్‌, జాన్వీకపూర్‌ల సినిమా ఎలా ఉందంటే?
Recommended image2
Ram Charan: రాంచరణ్ నటనపై విమర్శలు, వరస్ట్ నుంచి ది బెస్ట్ వరకు..నోరు మెదపకుండా 5 సినిమాలతో ఇచ్చిపడేశాడు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved