- Home
- Entertainment
- ట్రైన్ లో రామ్ చరణ్ ఊర మాస్ ఫైట్, ఇండియన్ సినిమా చరిత్రలోనే నెవర్ బిఫోర్ యాక్షన్ ఎపిసోడ్
ట్రైన్ లో రామ్ చరణ్ ఊర మాస్ ఫైట్, ఇండియన్ సినిమా చరిత్రలోనే నెవర్ బిఫోర్ యాక్షన్ ఎపిసోడ్
బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతోంది. ప్రస్తుతం ట్రైన్ లో సాగే యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. ఈ సీన్ కి సంబంధించిన మైండ్ బ్లోయింగ్ విషయాలు వైరల్ అవుతున్నాయి.

రామ్ చరణ్ పెద్ది మూవీ
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘పెద్ది’ భారీ స్థాయిలో రూపొందుతోంది. దర్శకుడు బుచ్చి బాబు సానా గ్రాండ్ విజన్‌కు రామ్ చరణ్ డెడికేషన్ తోడైంది. ఇటీవల విడుదలైన టైటిల్ గ్లింప్స్ దేశవ్యాప్తంగా మంచి క్రేజీ రెస్పాన్స్ అందుకున్న సంగతి తెలిసిందే.
ఈ మూవీ కేవలం క్రీడా నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం మాత్రమే కాదు. స్పోర్ట్స్ డ్రామాకు డైరెక్టర్ బుచ్చిబాబు గ్రామీణ భావోద్వేగాలు, యాక్షన్, అద్భుతమైన విజువల్స్ జోడించి ఈ చిత్రాన్ని పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. వృద్ది సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా సమర్పిస్తున్నాయి.
అబ్బురపరిచే ట్రైన్ ఫైట్ సన్నివేశం
చిత్రీకరణ పూర్తిగా ప్లాన్ ప్రకారమే ముందుకెళ్తోంది. ఇటీవలే ఒక విలేజ్ సెట్ లో కీలక సన్నివేశాలు, భారీ యాక్షన్ బ్లాక్ చిత్రీకరించారు. ఇప్పుడు చిత్రబృందం హైదరాబాద్‌లోని ప్రత్యేకంగా నిర్మించిన ఒక మరో సెట్ లో షూటింగ్ జరుపుతోంది. ఈ సెట్ లో భారతీయ చిత్ర పరిశ్రమలోనే గతంలో ఎన్నడూ చూడని విధంగా అత్యంత వినూత్నంగా, భారీగా సాగే రైలు యాక్షన్ సీక్వెన్స్ ను బుచ్చిబాబు రామ్ చరణ్ పై చిత్రీకరిస్తున్నారు. ఈ యాక్షన్ ఎపిసోడ్ ప్రేక్షకులకు విజువల్ వండర్ లా అనిపిస్తుందని తెలుస్తోంది.
రిస్కీ స్టంట్స్ చేస్తున్న రామ్ చరణ్
ఈ భారీ ట్రైన్ యాక్షన్ ఎపిసోడ్‌కి ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా నేతృత్వం వహిస్తున్నారు. అతని అద్భుత డిజైన్‌తో రూపొందించిన ట్రైన్ సెటప్ విజువల్ గా ఒక గొప్ప అనుభూతిని కలిగించనుంది. ఈ సీక్వెన్స్‌లో రామ్ చరణ్ తన కెరీర్‌లోనే అత్యంత సాహసోపేతమైన స్టంట్స్ చేస్తుండటం విశేషం. గ్రాండ్ గా కనిపిస్తూనే రియలిస్టిక్ గా ఈ యాక్షన్ ఎపిసోడ్ ఉండేలా బుచ్చిబాబు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఈ యాక్షన్ సీక్వెన్స్‌ను యాక్షన్ కోరియోగ్రాఫర్ నబకాంత్ మాస్టర్ రూపొందిస్తున్నారు. పుష్ప 2 చిత్రంలో నబకాంత్ కొరియోగ్రఫీ అందించిన యాక్షన్ సీన్స్ కి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం పలు పెద్ద ప్రాజెక్టుల్లో పని చేస్తున్న నబకాంత్, ఈ సినిమా కోసం అత్యంత ప్రతిష్టాత్మకమైన యాక్షన్ భాగాన్ని రూపొందిస్తున్నారు.
కీలక పాత్రల్లో శివరాజ్ కుమార్, జగపతి బాబు
ఈ ట్రైన్ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. పెద్ద తెరపై ఈ సీన్ ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభవాన్ని అందించనుంది. జన్వి కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో శివరాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
సినిమాటోగ్రఫీకి ఆర్. రత్నవేలు బాధ్యత వహిస్తుండగా, సంగీతాన్ని ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ.ఆర్. రెహమాన్ అందిస్తున్నారు. ఎడిటింగ్‌ను నేషనల్ అవార్డ్ విజేత నవీన్ నూలి నిర్వర్తిస్తుండగా, ప్రొడక్షన్ డిజైన్‌ను అవినాష్ కొల్లా అందిస్తున్నారు.
రిలీజ్ డేట్ ఫిక్స్
ఈ సినిమాను 2026 మార్చి 27, రామ్ చరణ్ పుట్టినరోజున విడుదల చేయనున్నట్లు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆకాశాన్ని తాకే అంచనాలు నెలకొల్పింది. ‘పెద్ది’ సినిమా రామ్ చరణ్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలవనుందని చిత్రబృందం తెలిపింది.
రామ్ చరణ్ చివరగా నటించిన గేమ్ ఛేంజర్ చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. దీనితో పెద్ది మూవీపై మెగా అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. శంకర్ దర్శకత్వంలో పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన గేమ్ ఛేంజర్ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది.