తాను రెండోసారి తల్లి అయిన విషయాన్ని ఇలియానా పరోక్షంగా ప్రకటించింది. ఈ మేరకు ఇలియానా చేసిన సోషల్ మీడియా పోస్ట్ వైరల్ గా మారింది.
ప్రేక్షకులకు ఇలియానా గురించి పరిచయం అవసరం లేదు. దేవదాసు చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఇలియానా చాలా కాలం పాటు టాప్ హీరోయిన్ గా కొనసాగింది. తన గ్లామర్ తో యువతలో విపరీతంగా ఇలియానా క్రేజ్ తెచ్చుకుంది. గతంలో ఇలియానా ప్రేమ వ్యహారాలు, లవ్ ఫెయిల్యూర్ తర్వాత డిప్రెషన్ లాంటి విషయాలతో తరచుగా వార్తల్లో నిలిచేది. వివాహం చేసుకున్న తర్వాత ఇలియానా తన వ్యక్తిగత జీవితం గురించి వీలైనంత వరకు గోప్యంగా ఉంచుతోంది.
తన భర్త మైకేల్ డోలన్ ని కూడా అభిమానులకు ఆలస్యం గా పరిచయం చేసింది. ఈ దంపతులకు ఇప్పటికే ఓ కొడుకు సంతానం. తాజాగా తాను మరోసారి తల్లి అయినట్లు ఇలియానా సోషల్ మీడియా ద్వారా హింట్ ఇచ్చింది.
గతంలో తన మొదటి ప్రెగ్నన్సీ వార్తతో ఇలియానా అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసిన విషయం తెలిసిందే. ఇటీవల ఫాదర్స్ డే సందర్భంగా ఆమె షేర్ చేసిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రెండో బిడ్డ పుట్టినట్టు హింట్ ఇచ్చిందా? అన్నది పెద్ద చర్చగా మారింది.
ఇలియానా మొదటి ప్రెగ్నన్సీ
ఇలియానా ఏప్రిల్ 2023లో తన మొదటి ప్రెగ్నన్సీ విషయాన్ని ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. అప్పటివరకు ఆమె పెళ్లి అయిన విషయాన్ని కూడా గోప్యంగా ఉంచింది. దీనితో ఇలియానా పెళ్లికాకుండానే తల్లి అవుతోందా అనే రూమర్స్ వ్యాపించాయి. ఆ తర్వాత తన పెళ్లికి సంబంధించిన ఒకే ఒక్క ఫోటోను ఓ రీల్‌లో షేర్ చేసింది.
ఆగస్టు 2023లో ఆమె తన మొదటి కుమారుడు పుట్టిన విషయాన్నిప్రకటించింది. అతనికి కోవా ఫోనిక్స్ డోలన్ అనే పేరు పెట్టారు. అప్పటి నుండి ఆమె తన కుటుంబ జీవితాన్ని పూర్తిగా ప్రైవేట్‌గా ఉంచారు.
రెండోసారి తల్లి అవుతున్నట్లు చెప్పకనే చెప్పింది
గత ఏడాది అక్టోబర్ లో ఇలియానా తనకి రెండో ప్రెగ్నన్సీ పాజిటివ్ గా వచ్చినట్లు పరోక్షంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఇది చూసిన అభిమానులు ఆమె మరోసారి గర్భవతి అయినట్టు అంతా భావించారు. కానీ ఇలియానా తన సెకండ్ ప్రెగ్నన్సీ బేబీ బంప్ ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేయలేదు.
ఇటీవల, ఇలియానా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరిలో "నీవు గర్భవతివి అని చెప్పకుండానే నీ ప్రెగ్నన్సీ గురించి చెప్పు" అనే మెసేజ్‌తో మరో సంకేతం ఇచ్చారు. దీనితో ఇలియానా రెండోసారి తల్లి కాబోతున్నట్లు అభిమానులు ఫిక్స్ అయ్యారు.
ఫాదర్స్ డే రోజు హింట్ ఇచ్చిన ఇలియానా
ఇటీవల ఫాదర్స్ డే సందర్భంగా, ఇలియానా తన భర్త మైకేల్ డోలన్ ఓ చిన్నపిల్లాడిని ముద్దుగా పట్టుకున్న ఫోటోను షేర్ చేశారు. ఆ ఫోటోపై "టుడే 3:30 pm" అని టైమ్ స్టాంప్ ఉండడం విశేషం. తనకి రెండో బిడ్డ పుట్టిన విషయాన్ని ఇలియానా ఇలా పరోక్షంగా ప్రకటించిందా అనే చర్చ మొదలైంది. అందుకే ఆమె టైం గురించి ప్రత్యేకంగా చెప్పింది అని అభిమానులు అంటున్నారు.

ఫ్యామిలీ విషయంలో గోపత్య పాటిస్తున్న ఇలియానా
ఇలియానా ఇప్పటి వరకు తమ రెండో బిడ్డ గురించి స్పష్టమైన ప్రకటన ఇవ్వలేదు. రెండో గర్భం ద్వారా ఆమెకి పుట్టింది అబ్బాయా ? అమ్మాయా ? అనే విషయాన్ని కూడా తెలపలేదు. సోషల్ మీడియాలో ఇలియానా తరచుగా పోస్ట్ లు పెడుతూనే ఉంటుంది. కానీ తన భర్త పిల్లల గురించి ఎక్కువగా ఆమె గోప్యత పాటిస్తోంది.
సోషల్ మీడియాలో ఫ్యాన్స్ రియాక్షన్
ఇలియానా షేర్ చేసిన తాజా ఫోటోపై అభిమానులు, ఫాలోవర్లు పెద్దఎత్తున స్పందిస్తున్నారు. "ఇలియానా రెండోసారి తల్లి అయిందా ? ఓ మై గాడ్, కంగ్రాట్స్ అంటూ పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ నుంచి కామెంట్స్ కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఇలియానా ఈ కామెంట్లకు స్పందించలేదు.
తెలుగులో ఇలియానా నటించిన చిత్రాలు
దేవదాసు చిత్రంలో ఇలియానా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో రామ్ పోతినేని జంటగా నటించిన ఆ చిత్రం సూపర్ హిట్ అయింది. వెంటనే ఆమెకి సూపర్ స్టార్ మహేష్ బాబుతో పోకిరి చిత్రంలో నటించే గోల్డెన్ ఛాన్స్ దక్కింది. పోకిరి టాలీవుడ్ చరిత్రని తిరగరాసిన చిత్రం అనే చెప్పాలి. ఈ మూవీతో ఇలియానా ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది.
టాలీవుడ్ లో తొలిసారి రూ.1 కోటి రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ గా ఎదిగింది. ఆ తర్వాత ఇలియానా ఎన్టీఆర్ తో రాఖీ, ప్రభాస్ తో మున్నా లాంటి చిత్రాల్లో నటించింది. పవన్ కళ్యాణ్ సరసన నటించిన జల్సా చిత్రం కమర్షియల్ సక్సెస్ గా నిలిచింది.
రవితేజ తో నటించిన కిక్, అల్లు అర్జున్ తో నటించిన జులాయి చిత్రాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. మధ్యలో ఆమెకి శక్తి, నేను నా రాక్షసి లాంటి ఫ్లాపులు ఎదురయ్యాయి. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఆమె మరోసారి నటించిన దేవుడు చేసిన మనుషులు చిత్రం డిజాస్టర్ గా నిలిచింది.
కెరీర్ లో ఇలియానా చేసిన మిస్టేక్
ఇలియానా కెరీర్ పరంగా పెద్ద మిస్టేక్ చేసింది. సౌత్ లో స్టార్ హీరోయిన్ గా వరుస అవకాశాలు దక్కుతున్న టైంలో ఇలియానా బాలీవుడ్ కి వెళ్లాలని నిర్ణయించుకోవడం ఆమె చేసిన బిగ్ మిస్టేక్. ఆమె తీసుకున్న ఆ నిర్ణయం కెరీర్ పై తీవ్ర ప్రభావం చూపింది. బాలీవుడ్ లో సరైన అవకాశాలు రాలేదు. వచ్చిన చిత్రాలు కూడా నిరాశ పరిచాయి.
తెలుగులో ఇలియానా చివరి చిత్రం
దీనితో ఇలియానా పూర్తిగా క్రేజ్ కోల్పోయింది. ఆ తర్వాత ఆస్ట్రేలియాకి చెందిన ఓ ఫోటో గ్రాఫర్ తో ప్రేమలో పడడం, ఆ ప్రేమ విఫలం కావడం, దీనితో డిప్రెషన్ లోకి వెళ్లడం లాంటి సంఘటనలు ఇలియానా జీవితంలో చోటు చేసుకున్నాయి. తిరిగి ఇలియానా టాలీవుడ్ లో అమర్ అక్బర్ ఆంటోని చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఆ మూవీ కూడా డిజాస్టర్ కావడంతో సౌత్ లో హీరోయిన్ గా ఆమెకి దారులన్నీ మూసుకుపోయాయి.
ప్రస్తుతం ఇలియానా అప్పుడప్పుడూ హిందీ చిత్రాల్లో నటిస్తోంది. ఎక్కువ సమయం కుటుంబానికి కేటాయిస్తోంది. భర్త పిల్లలతో ఇలియానా మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది.
