క్రేజీ దర్శకుడితో రామ్ చరణ్ సినిమా?.. ఫ్యాన్స్ కి పిచ్చెక్కించే వార్త వైరల్
రామ్ చరణ్ కి సంబంధించిన క్రేజీ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఓ సంచలన దర్శకుడితో చరణ్ సినిమా చేయబోతున్నారని సమాచారం.

రామ్ చరణ్ కొత్త సినిమాలకు సంబంధించి గత కొన్ని రోజులుగా రకరకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆయనతో సినిమాలు చేయడానికి చాలా మంది దర్శకులు క్యూ కడుతున్నారట. అందులో భాగంగా క్రేజీ డైరెక్టర్స్ నేమ్స్ తెరపైకి వచ్చాయి.
ప్రశాంత్ నీల్ తో సినిమా ఉంటుందని, అలాగే లోకేష్ కనగరాజ్‌తో ఓ సినిమా అనుకుంటున్నారనే వార్తలు వినిపించాయి. అదే సమయంలో దిల్ రాజు ప్రొడక్షన్‌లో మరో సినిమా చేస్తున్నారంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి.
కానీ అందులో నిజం లేదని టీమ్ స్పందించింది. దిల్ రాజు నిర్మాణంలో సినిమా చేస్తున్నారనేది నిజం కాదని, ఫేక్ న్యూస్ అని తేల్చి చెప్పారు. అదే సమయంలో ఇతర దర్శకులకు సంబంధించీ కూడా క్లారిటీ ఇచ్చారు.
ప్రస్తుతం బుచ్చిబాబు(ఆర్‌సీ16)తో సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత సుకుమార్‌తో(ఆర్‌సీ17) సినిమా ఉంటుందని స్పష్టం చేశారు. మరేదీ కన్ఫమ్ కాలేదని వెల్లడించారు. కాన చరణ్‌తో ఇతర దర్శకులు కథలు చర్చిస్తున్నట్టు సమాచారం.
ఈ క్రమంలో ఇప్పుడు మరో క్రేజీ డైరెక్టర్ పేరు తెరపైకి వచ్చింది. చరణ్ ఓ సంచలన దర్శకుడితో సినిమా చేయబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఆ దర్శకుడు ఎవరో కాదు సందీప్ రెడ్డి వంగా. `అర్జున్‌రెడ్డి`, `యానిమల్` చిత్రాలతో సంచలనాలు సృష్టించారు సందీప్ రెడ్డి వంగా. ఆయన రామ్ చరణ్‌కి స్క్రిప్ట్ చెప్పారని సమాచారం.
ఈ మూవీ లాక్ అయ్యిందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు వైరల్ అవుతున్నాయి. ఈ కాంబోలో సినిమా చేస్తే ఎలా ఉంటుందనే పోస్ట్ లు కూడా కనిపించాయి. ఇవి ఫ్యాన్స్ ఉత్సాహంతో పెట్టిన పోస్టులా? నిజంగానే చర్చలు జరిగాయా? అనేది సస్పెన్స్. ఏది నిజమనేది క్లారిటీ లేదు.
అయితే గత కొంత కాలంగా సందీప్‌రెడ్డి వంగా మెగా ఫ్యామిలీతో ట్రావెల్ అవుతున్నాడు. చిరంజీవి, చరణ్‌లతో చర్చలు జరిగాయని కూడా తెలిసింది. ఈ యాంగిల్‌లో ఈ రూమర్‌లోనూ నిజం లేకపోలేదు.
కానీ దీనిపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. అయితే ఈ కాంబినేషన్ సెట్ అయితే మాత్రం మెగా ఫ్యాన్స్ కి బిగ్గెస్ట్ సెలబ్రేషన్‌లా ఉండబోతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఏం జరుగుతుందో చూడాలి.
read more: `మద గజ రాజ` మూవీ రివ్యూ, రేటింగ్
ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా చేతిలో రెండు సినిమాలున్నాయి. మొదట ప్రభాస్‌తో `స్పిరిట్` చేయాల్సి ఉంది.ఈ మూవీ మే నుంచి స్టార్ట్ అవుతుందని తెలుస్తుంది. లేదంటే ద్వితీయార్థంలో స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందట.
దీని తర్వాత అల్లు అర్జున్‌తో ఓ సినిమా చేసే కమిట్‌మెంట్ ఉంది. ఈ రెండు పూర్తయితేనే సందీప్ మరో సినిమా చేయగలడు. ఒకవేళ చరణ్ తో సినిమా అయినా ఈ రెండు సినిమాల తర్వాతనే ఉండే అవకాశాలున్నాయి. దేనికైనా కొంత కాలం వెయిట్ చేయాల్సిందే.
read more: మొన్న వినాయక్, ఇప్పుడు నాగ్ అశ్విన్.. `విశ్వంభర`లో ఏం జరుగుతుంది? చిరంజీవి భయానికి కారణమదేనా?
also read: ఎన్టీఆర్,పవన్, వెంకటేష్, బాలయ్య అయిపోయారు రామ్ చరణ్ మొదలెట్టాడు, RC16 కోసం చరణ్ ప్రయోగం.