క్లింకార ఫేస్ అప్పుడే చూపిస్తా..కన్నీళ్లు పెట్టిన రామ్ చరణ్
మ్ చరణ్ కన్నీళ్ళు పెట్టారు. తన కూతురు గురించి చెపుతూ ఎమోషనల్ అయ్యారు.. క్లింకారఫేస్ ను ఎప్పుడు చూపించాలి అనుకుంటున్నారో వెల్లడించారు. ఇంతకీ క్లింకారను ఎప్పుడు చూపించబోతున్నారో తెలుసా..?
మెగా పవన్ స్టార్ రామ్ చరణ్ ఈ సంక్రాంతికి గేమ్ ఛేంజర్ తో రంగంలోకి దిగబోతున్నారు. జనవరి 10 ప్రపంచ వ్యాప్తంగా ఈసినిమా రిలీజ్ కాబోతోంది. శంకర్ డైరెక్ట్ చేసిన గేమ్ ఛేంజర్ లో చరణ్ జోడీగా కియారా అద్వాని, అంజలి నటించారు. వీరితో పాటు శ్రీకాంత్, ఎస్ జే సూర్య, సముద్రఖని, సునిల్, నవీన్ చంద్ర కూడా ఇంపార్టెంట్ రోల్స్ చేశారు.
Also Read: రామ్ చరణ్ - అల్లు అర్జున్ కు బాబాయ్ గా నటించిన హీరో ఎవరో తెలుసా..?
ఇక ఈమూవీ కోసం మెగా ఫ్యాన్స్ వెయ్యి కళ్ళతోఎదురుచూస్తున్నారు. ఈక్రమంలో గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ ను భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు నిర్మాత దిల్ రాజు. ఈక్రమంలోరామ్ చరణ్ కూడా ఈసారి టీవీ కార్యక్రమాల ద్వారా కూడా పరమోషన్ కు హాజరవుతున్నారు. హిందీ బిగ్ బాస్ లో సందడి చేసిన రామ్ చరణ్.. తెలుగులో బాలయ్యబాబుహోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 3 లో కూడా సందడి చేశాడు.
Also Read: మహేష్ బాబు - నందమూరి బ్రహ్మణి కాంబోలో మిస్ అయిన సినిమా..?
ఇక బాలయ్యతో కలిసి సరదాగా ఆటలు, పాటలు.. చరణ్ ను ఒక ఆట ఆడేసుకున్నారు బాలయ్య. ఈక్రమంలో తన ఫ్యామిలీ గురించి వచ్చినప్పుడు ఎమోషనల్ అయ్యారు రామ్ చరణ్. మరీ ముఖ్యంగా క్లింకార గురించి మాట్లాడినప్పుడు కళ్ల వెంట నీళ్ళు కూడా పెట్టుకున్నారు. తనతో ఓ గంట అయినా అలా సరదాగా ఆడుకుంటేనే తనకు హ్యాపీగా ఉంటుంది అన్నారు.
బక్కగా ఉంటుంది. బాగా అల్లరి చేస్తుంది అని చెప్పిన రామ్ చరణ్. తన ఫేస్ ను ఎప్పుడు రివిల్ చేస్తావు అని అడిగినప్పుడు మాత్రం.. క్లింకార తనను నాన్నా అనిపిలిచిన వెంటనే తనను అందరికి చూపిస్తానని అన్నారు. దాంతో మెగా ఫ్యాన్స్ కూడా ఎమోషనల్ అవుతున్నారు. ఇక ఈ షోలోనే రామ్ చరణ్ అమ్మా, నాన్నమ్మ మాట్లాడిన వీడియోను కూడా ప్లే చేశారు.
వారు చరణ్ ను ఓ ప్రశ్న అడిగారు అది కూడా ఓ లెటర్ లో రాసి ఇచ్చారు. వారు ఏం అడిగారంటే 2025 లో ఓ వారసుడిని ఇవ్వాలంటూ అడిగారు. దాంతో చరణ్ ఏం సమాధానం చెప్పాడు అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇక గేమ్ ఛేంజర్ రిలీజ్ దగ్గర పడుతుండటంతో.. ప్రమోషన్స్ ను అంతే ఫాస్ట్ గా నిర్వహిస్తున్నారు గేమ్ ఛేంజర్ టీమ్. ఈక్రమంలో బాలయ్యషోలో రామ్ చరణ్ ఎపిసోడ్ హైలెట్ కాబోతోంది. ఇక ఈ ఎపిసోడ్. ఆహాలో ఈనెల 8న స్ట్రీమింగ్ కాబోతోంది.