- Home
- Entertainment
- ఎన్టీ రామారావు, చిరంజీవి కాదు.. రామ్ చరణ్‌కి ఇష్టమైన నటుడు ఎవరో తెలుసా? ఆయన ఆల్‌రౌండర్
ఎన్టీ రామారావు, చిరంజీవి కాదు.. రామ్ చరణ్‌కి ఇష్టమైన నటుడు ఎవరో తెలుసా? ఆయన ఆల్‌రౌండర్
Ram Charan Favourite Actor: రామ్ చరణ్ ని హీరోగా, నటుడిగా ఎంతో మంది ఇష్టపడతారు. మరి ఆయనకు ఇష్టమైన నటుడు ఎవరు? అనేది చూస్తే అందులో చిరు, పవన్, ఎన్టీ రామారావులు కూడా కాదట.

ram charan favourite actor not Chiranjeevi nt ramarao and anr
రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ఇమేజ్‌తో రాణిస్తున్నారు. ఆయనకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఆయన్ని చూసి ఇన్‌స్పైర్ అయ్యే యువత చాలా మంది ఉంటారు. వాళ్లు సినిమాలోకి రావాలనుకుంటారు. రామ్ చరణ్‌కి ఇష్టమైన నటుడు ఎవరు? ఎవరిని ఆయన అంతగా అభిమానిస్తారు? అనేది చూస్తే ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి.
Chiranjeevi - NTR
సాధారణంగా మెగాస్టార్ ఇంట్లోనే ఉన్నారు. చిరంజీవిని మించి ఇంకా ఎవరు ఉంటారని భావించొచ్చు. ఆయన కాకపోతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. కచ్చితంగా ఇద్దరిలో ఎవరో ఒకరు ఇష్టమైన నటుడు అవుతారని చెప్పొచ్చు. కానీ రామ్ చరణ్ దృష్టిలో ఈ ఇద్దరు లేరు. అంతేకాదు ఎన్టీ రామారావు, ఏఎన్నారు లు కూడా కాదట. చరణ్‌కి ఇష్టమైన నటుడు వేరే ఉన్నారు. ఆయన ఆర్ రౌండర్ కావడం విశేషం.
మరి రామ్ చరణ్ ఎక్కుగా ఆరాధించే నటుడు ఎవరు? నటన పరంగా ఎవరిని ఎక్కువగా అభిమానిస్తారనేది చూస్తే ఆయన ఎస్వీఆర్(ఎస్వీ రంగారావు)ని అభిమానిస్తారట. ఆయన నటన అన్నా, ఆయన ఆహార్యం అన్నా,
డైలాగ్ డెలివరీ అన్నా, పాత్రలో జీవించే తీరు అన్నా, మొత్తంగా ఆయన నట విశ్వరూపం అన్నా తనకు బాగా నచ్చుతాయని, ఆయనే తన అభిమాన నటుడు అని తెలిపారు రామ్ చరణ్. `మగధీర` సినిమా సమయంలో రామ్ చరణ్ ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించడం విశేషం.
ఇక తన సమకాలీకుల్లో కోలీవుడ్ స్టార్ సూర్య తనకు ఇష్టమైన హీరో అని తెలిపారు. అలాగే హీరోయిన్ల విషయానికి వస్తే ఫేవరేజ్ హీరోయిన్ గా సమంత పేరు చెప్పడం విశేషం. రామ్ చరణ్ చెప్పిన ఈ సమాధానం ఆశ్చర్యపరుస్తుంది.
జనరల్‌గా తన సమకాలీకుల పేర్లు చెప్పేందుకు హీరోలు వెనకడుగు వేస్తుంటారు. కాంపిటీటర్ నేమ్స్ అస్సలు చెప్పరు. కానీ చరణ్ అలాంటిదేదీ లేకుండా ఈజీగా చెప్పేయడం విశేషం.
కెరీర్ పరంగా చూస్తే రామ్ చరణ్ మొన్నటి వరకు `గేమ్ ఛేంజర్` విషయంలో ట్రోలింగ్ గురయ్యాడు. కానీ అవేవీ లెక్క చేయకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతున్నాడు రామ్ చరణ్. ప్రస్తుతం ఆయన బుచ్చిబాబు దర్శకత్వంలో `ఆర్‌సీ16` మూవీలో నటిస్తున్నారు.
ఇది ఊరమాస్ రా అండ్ రస్టిక్ కథతో రూపొందుతుందని తెలుస్తుంది. ఈ మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు రామ్ చరణ్. ఈ మూవీ ఈ ఏడాది డిసెంబర్‌లో విడుదల చేయాలని బుచ్చిబాబు ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగా షూటింగ్ వేగంగా చేయబోతున్నట్టు సమాచారం.
read more: Oka Pathakam Prakaaram Movie Review: `ఒక పథకం ప్రకారం` మూవీ రివ్యూ
also read: బాబాయ్ బాలయ్య, అబ్బాయి ఎన్టీఆర్, ఇద్దరితో రొమాన్స్ చేసిన హీరోయిన్లు ఎవరో తెలుసా?