MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • ఒక తండ్రి గా చెబుతున్నా, తలుచుకుంటే బాధేస్తోంది, రామ్ చరణ్ ఎమోషనల్ కామెంట్స్

ఒక తండ్రి గా చెబుతున్నా, తలుచుకుంటే బాధేస్తోంది, రామ్ చరణ్ ఎమోషనల్ కామెంట్స్

మాదకద్రవ్యాల నివారణ పోరాటంలో ఐక్యంగా నిలబడాలంటూ పిలుపునిచ్చారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. మాదకద్రవ్యాలను నిర్మూలించడానికి ప్రతి ఒక్కరు ఒక సైనికుడిలా మారాలని పిలుపునిచ్చారు. 

4 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 27 2025, 06:05 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Image Credit : Asianet News

అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో నిర్వహించింది. ఈ కార్యక్రమానికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యారు. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, రామ్ చరణ్‌ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. ఈ ఈవెంట్ లో రౌడీ హీరో విజయ్ దేవరకొండతో పాటు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా పాల్గొన్నారు. ఈసందర్భంగా మాదకద్రవ్యాల నివారణ పోరాటంలో ఐక్యంగా నిలబడాలని వాటిని నిర్మూలించడానికి ప్రతి ఒక్కరు ఒక సైనికుడిలాపోరాడాలని అన్నారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Image Credit : Asianet News

రామ్ చరణ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, మై బ్రదర్ విజయ్ దేవరకొండ కి, దిల్ రాజ్ గారికి పెద్దలందరికీ థాంక్యూ సో మచ్. ఇక్కడికి వచ్చిన మా ఫ్రెండ్స్ కి హాయ్. నేను స్కూల్లో ఉన్నప్పుడు ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రమ్స్ వెళ్లేవాడిని. ఇక్కడ మీ అందరిని చూస్తుంటే ఆ రోజులు గుర్తుకొస్తున్నాయి. 

ఇంత చక్కని కార్యక్రమాన్ని నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ పోలీసు శాఖకు ధన్యవాదాలు. ఇలాంటి అవేర్నెస్ కచ్చితంగా కావాలి.కొన్ని సంవత్సరాల క్రితం కొన్ని స్కూల్స్ బయట గోలి సోడాలు చాక్లెట్లు దొరికే చోట మాదకద్రవ్యాలు అమ్ముతున్నారని వార్తలు చూసి చాలా షాక్ అయ్యాను. ఇది ఇంత పెద్ద ఆర్గనైజడ్ క్రైమ్ లాగా అయిపోయిందా అని చాలా బాధేసింది అన్నారు.

37
Image Credit : Asianet News

అప్పుడు నేను పేరెంట్ ని కాదు. ఇప్పుడు నేను పేరెంట్ ని. రేపు పొద్దున్న మా పిల్లల్ని బయటకి పంపించాలంటే భయంగా ఉంటుంది. మాదక ద్రవ్యాలు జీవితాన్ని నాశనం చేస్తాయి. పొద్దున్నే లేచి వ్యాయామం చేసి, మన వర్క్ పూర్తి చేసి. ఇంటికి వచ్చి ఓ ఆట ఆడుకుని, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడంలో హై ఉంటుంది. ఒక మంచి హిట్ సినిమా తీసినప్పుడు ఒక హై ఉంటుంది. మంచి మార్క్స్ తెచ్చుకోవడం ఒక హై. ఫ్యామిలీతో క్వాలిటీ టైం స్పెండ్ చేయడం హై. గేమ్స్ ఆడటం ఒక హై. 

మనందరం కూడా మాదక ద్రవ్య రహిత సమాజం కోసం పోరాడాలి. మన భవిష్యత్తుని మనమే ప్రొటెక్ట్ చేసుకుందాం. మేము అందరం తెలంగాణ గవర్నమెంట్ కి సపోర్ట్ చేస్తున్నాం. మాదక ద్రవ్యాలను నిర్మూలించడానికి ప్రతి ఒక్కరు ఒక సోల్జర్ లాగా మారాలి అని అన్నారు రామ్ చరణ్.

47
Image Credit : Asianet News

విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి గారికి, పెద్దలందరికీ నమస్కారం. ఒకసారి వైజాగ్ లో షూటింగ్ చేస్తున్నప్పుడు మాదకద్రవ్యాల వ్యతిరేక క్యాంపెయిన్ కోసం ఒక బైట్ అడిగితే ఇచ్చాను. అప్పుడు నాకు అంత సీరియస్ గా ఈ సమస్య గురించి అవేర్నెస్ లేదు. 

కానీ కొంతకాలం తర్వాత ఒక పోలీస్ ఆఫీసర్ ఇది ఎంత పెద్ద సమస్యో చెప్పిన తర్వాత తప్పకుండా ఈ విషయంలో అవేర్నెస్ కల్పించాలనిపించింది. ఎవరు కూడా ఇలాంటి సిచువేషన్ ఫేస్ చేయకూడదు. ఇది మన బాధ్యతలాగా అనిపించింది. మనకి మన హెల్త్ ముఖ్యం. హెల్త్ లేకపోతే ఏమీ చేయలేం. యువతని పాడు చేస్తే ఒక దేశాన్ని పాడు చేసినట్టే  అన్నారు. 

ఒక్కసారి దానికి అలవాటు పడితే ఇంకా జీవితంలో మరో లక్ష్యం అంటూ ఉండదు. మన దేశం మనం నెంబర్ వన్ లో ఉండాలంటే మాదకద్రవ్యాలని రానివ్వకూడదు. అది జీవితాన్ని నాశనం చేస్తుంది. జీవితంలో ఆనందం కావాలంటే వ్యాయామం చేయండి. డబ్బులు సంపాదించండి. అప్పుడు సమాజం గౌరవిస్తుంది. మన పేరెంట్స్ గర్వపడతారు. అందరికీ థాంక్యూ'అన్నారు.

57
Image Credit : Asianet News

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అంతర్జాతీయ మాదకద్రవ్యాల నియంత్రణ దినోత్సవ కార్యక్రమానికి నాతోపాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన యువ మిత్రులు ఫిలిం ఇండస్ట్రీలో ఒక నూతన శకాన్ని ప్రారంభించిన రామ్ చరణ్ గారికి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా స్వాగతం పలుకుతున్నాను. 

ఈరోజు ఈ వేదికపై ఉన్న మేము ఎవరు కూడా పెద్దపెద్ద బ్యాగ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళం కాదు. చిరంజీవి గారు ఏ బ్యాగ్రౌండ్ లేకుండా కష్టపడి దేశమే గర్వించదగ్గ మహానటుడుగా మంచి మనిషిగా గుర్తింపు పొందారు. దాదాపు 50 సంవత్సరాల నిరంతర శ్రమ కఠోర దీక్షతో వాళ్లు రాణించగలిగారు. ఎన్ని కష్టాలు వచ్చినా కృంగిపోలేదు మాదకద్రవ్యాలు వైపు చూడలేదు. వ్యసనాల వైపు బానిసలు కాలేదు. ఎన్ని కష్టాలను వచ్చినా ఎదుర్కుని ప్రపంచానికే ఆదర్శంగా నిలిచారు అని అన్నారు. 

67
Image Credit : Asianet News

రామ్ చరణ్ నాకు స్కూల్ కి వెళ్ళినప్పుడు నుంచి తెలుసు. నా కళ్ళముందే స్కూల్ కి వెళ్లే కుర్రాడు రియల్ స్టార్ లాగా ఫిల్మ్ ఇండస్ట్రీలో రాణించి ఈరోజు ఆస్కార్ అవార్డుని సాధించి దేశానికి ఒక గౌరవం తెచ్చి పెట్టాడు. ఇది మామూలు గౌరవం కాదు. చిరంజీవి గారి కొడుకు కాబట్టి, ఆయన పేరు ఉంటే మన ఇళ్లల్లో ఫంక్షన్ కి పిలుస్తాము. కానీ ఆస్కార్ అవార్డు మనం ఇవ్వలేము కదా. రామ్ చరణ్ స్వతహాగా కష్టపడ్డాడు కాబట్టి అవార్డు వచ్చింది. దానికి కారణం దీక్ష పట్టుదలతో ఆ రంగంలో రాణించడం. అందుకే మీ అందరికీ చెప్తున్నాను సినిమాలో వాళ్ళు పోషించే పాత్రలు కాదు, రియల్ లైఫ్ లో వారిని ఆదర్శంగా తీసుకోండి. మాదకద్రవ్యాల నిర్మూలనకు అందరూ సామాజిక బాధ్యత తీసుకొని సమాజంలో హీరోలుగా నిలబడండి.'అన్నారు.

77
Image Credit : Asianet News

టీఎఫ్డీసీ చైర్మన్‌, నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ రేవంత్ రెడ్డి గారికి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి. విజయ్ దేవరకొండ గారి,కి పెద్దలందరికీ నమస్కారం. తొమ్మిది నెలల క్రితం ముఖ్యమంత్రి గారితో ప్రయాణం చేస్తున్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మాదకద్రవ్యాలు లేకుండా చేయాలని ఆయన చెప్పారు.

 అలా నిర్మూలించాలంటే అందరం కంకణం కట్టుకోవాలని ఆయన చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా నా వంతు ఒక ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను గాని నా కుటుంబ సభ్యులు గానీ నాకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరు కూడా మాదకద్రవ్యాలు తీసుకోకుండా నేను చేయగలుగుతాను.

నాలాగే మీరందరూ కూడా ప్రతిజ్ఞ తీసుకుంటే మన తెలంగాణ రాష్ట్రం మొత్తం మాదకద్రవ్యాలు లేకుండా చేయగలుగుతాం. ఇలాంటి అవేర్నెస్ మనందరికీ అవసరం. ఈమధ్య మలయాళం ఫిలిం ఇండస్ట్రీలో ఒక నిర్ణయం తీసుకున్నారు. 

మాదకద్రవ్యాలు తీసుకుని ఎవరైనా పట్టుబడితే ఆ ఇండస్ట్రీ నుంచి బహిష్కరిస్తామని నిర్ణయించారు. దీనిపై మాట్లాడి తెలుగు ఇండస్ట్రీలో కూడా అది పాటించేలాగా చేస్తాం. అందరం ప్రతిజ్ఞ తీసుకుంటే మన రాష్ట్రాన్ని మాదకద్రవ్యాలు లేని రాష్ట్రంగా చేయగలుగుతాం. అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, పలువురు ఉన్నత అధికారులు పాల్గొన్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
రామ్ చరణ్ కొణిదెల
విజయ్ దేవరకొండ
అనుముల రేవంత్ రెడ్డి
తెలంగాణ
హైదరాబాద్
దిల్ రాజు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Mysaa Teaser Review: రష్మిక మైసా టీజర్, పాన్ ఇండియా స్టార్లు కూడా సాటిరారు.. ఆ విజువల్స్ ఏంటి భయ్యా
Recommended image2
Nani: ఇలాంటి సినిమాలెందుకు చేస్తున్నావ్‌.. నానికి అమ్మ వార్నింగ్‌.. జడల వివాదంపై ఎట్టకేలకు వివరణ
Recommended image3
Suriya Jyotika Mumbai House: భార్య కోసం షాకింగ్ డెసిషన్.. సూర్య రూ.200 కోట్ల ఇల్లు ఎందుకు వదిలేశాడో తెలుసా ?
Related Stories
Recommended image1
60 ఏళ్లుగా ఫిల్మ్ ఇండస్ట్రీని ఏలుతున్న ఈ స్టార్ హీరోను గుర్తు పట్టారా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved