MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • మెగా అభిమానులకు డబుల్ ధమాకా.. రామ్ చరణ్ సినిమా నుంచి రెండు అప్ డేట్స్ రెడీ..

మెగా అభిమానులకు డబుల్ ధమాకా.. రామ్ చరణ్ సినిమా నుంచి రెండు అప్ డేట్స్ రెడీ..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకు గుడ్ న్యూస్. ఆయన సినిమా నుంచి భారీ అప్ డేట్స్ రెడీ అవుతున్నాయి. బర్త్ డే కానుకగా.. అభిమానులకు డబుల్ ధమాకా అందించబోతున్నాడు చరణ్. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Mar 13 2026, 05:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా
Image Credit : Asianet News

రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు ఒకేసారి రెండు పండగలాంటి వార్తలు బయటకు రాబోతున్నాయి. ఈ నెల 27న చరణ్ బర్త్‌ డే కానుకగా ఆయన నటిస్తున్న రెండు భారీ బడ్జెట్ సినిమాల నుంచి కీలక అప్‌డేట్స్ రావచ్చని టాలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో మెగా అభిమానులు ఆ రోజు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
సుకుమార్ ఏం ప్లాన్ చేస్తున్నాడు.
Image Credit : Asianet News

సుకుమార్ ఏం ప్లాన్ చేస్తున్నాడు.

రంగస్థలం’ బ్లాక్‌బస్టర్ తర్వాత రామ్ చరణ్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ మళ్లీ కలవబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ‘RC17’ అనే వర్కింగ్ టైటిల్‌తో రూపుదిద్దుకుంటోంది. ఇటీవల ‘పుష్ప 2’ సినిమాతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సుకుమార్, ఈ కొత్త ప్రాజెక్ట్‌పై ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో చరణ్ పుట్టినరోజున ‘RC17’ సినిమాకు సంబంధించిన కీలక అప్‌డేట్ వచ్చే అవకాశముందని టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది.

Related Articles

Related image1
మోహన్ బాబు కి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన హీరోయిన్, ఆమె భర్తకు మంచు హీరో వార్నింగ్, ఇంతకీ ఎవరామె?
Related image2
కృష్ణ సినిమా కోసం 100 కిలో మీటర్లు లారీలో వెళ్లి చూసిన ముఖ్యమంత్రి ఎవరో తెలుసా?
34
టైటిల్ పోస్టర్ వస్తుందా..?
Image Credit : Instagram/ Ram Charan

టైటిల్ పోస్టర్ వస్తుందా..?

ఈ అప్‌డేట్‌లో భాగంగా సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేయడంతో పాటు షూటింగ్ ప్రారంభ తేదీని కూడా ప్రకటించవచ్చని సమాచారం. ఇప్పటికే ‘రంగస్థలం’తో భారీ విజయాన్ని అందుకున్న ఈ కాంబినేషన్ మళ్లీ కలిసి సినిమా చేయబోతుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకే ‘RC17’కి సంబంధించిన అధికారిక ప్రకటన కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

44
పెద్ది నుంచి ఫుల్ మీల్స్..
Image Credit : Asianet News

పెద్ది నుంచి ఫుల్ మీల్స్..

మరోవైపు దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న పీరియడ్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’లో కూడా రామ్ చరణ్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లు సమాచారం. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ , పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.

ఈ సినిమా ఏప్రిల్ 30న విడుదల కావాల్సి ఉండటంతో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేయాలని చిత్రబృందం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా చరణ్ పుట్టినరోజు సందర్భంగా ‘పెద్ది’ టీజర్‌ను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఈ టీజర్‌పై కూడా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
రామ్ చరణ్ కొణిదెల
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Samarasimha Reddy Review: చిరంజీవికి ఎంతో ఇష్టమైన బాలకృష్ణ సినిమా, 365 రోజులు ఆడిన ట్రెండ్ సెట్టర్, సమరసింహా రెడ్డి రివ్యూ
Recommended image2
Chiranjeevi Stunts: దున్నపోతుల మధ్యలో రియల్ స్టంట్స్, రెడీగా అంబులెన్స్.. స్నేహితుల కోసం తెగించిన చిరంజీవి
Recommended image3
Upcoming Movies: రజనీతో అజిత్ పోటీ, సూర్య హ్యాట్రిక్ కొడతాడా?.. వచ్చే 4 నెలల్లో రాబోతున్న భారీ చిత్రాలివే
Related Stories
Recommended image1
మోహన్ బాబు కి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన హీరోయిన్, ఆమె భర్తకు మంచు హీరో వార్నింగ్, ఇంతకీ ఎవరామె?
Recommended image2
కృష్ణ సినిమా కోసం 100 కిలో మీటర్లు లారీలో వెళ్లి చూసిన ముఖ్యమంత్రి ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved