MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రామ్ చరణ్ తో త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా.. ఎలా మిస్ అయ్యిందో తెలుసా?

రామ్ చరణ్ తో త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా.. ఎలా మిస్ అయ్యిందో తెలుసా?

టాలీవుడ్ లో చాలామంది స్టార్ హీరోలతో త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలు చేసి సూపర్ హిట్ కొట్టారు. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు, ఎన్టీఆర్ లాంటి స్టార్స్ తో త్రివిక్రమ్ సినిమాలు చేశాడు. కానీ రామ్ చరణ్ తో త్రివిక్రమ్ కాంబో ఎందుకు సెట్ అవ్వలేదు. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Feb 15 2026, 11:28 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్..
Image Credit : our own

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్..

టాలీవుడ్ లో మాటల మాంత్రికుడు అనే పేరు తెచ్చుకున్న దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. మాటల తూటాలు పేల్చే ఈ దర్శకుడు.. కామెడీ పంచ్ లతో సీరియస్ క్యారెక్టర్ తో కూడా హాస్యం పండించగలడు. ఆయన డైలాగ్స్ రాసిన సినిమాలైనా.. డైరెక్షన్ చేసిన సినిమాలైనా.. ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టవు. అలాంటి అద్భుతమైన సినిమాలు అందించిన త్రివిక్రమ్.. ఈమధ్య కాలంలో ఫెయిల్యూర్స్ ను ఫేస్ చేయాల్సి వస్తోంది.

24
స్టార్ హీరోలతో త్రివిక్రమ్ సినిమాలు..
Image Credit : Asianet News

స్టార్ హీరోలతో త్రివిక్రమ్ సినిమాలు..

టాలీవుడ్ లో రైటర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన త్రివిక్రమ్.. రైటర్ గా కింగ్ నాగార్జున, వెంకటేష్, చిరంజీవి సినిమాలకు పనిచేశారు. దర్శకుడిగా మారిన తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఎక్కువ సినిమాలు చేసిన ఆయన..అల్లు అర్జున్ తో జులాయ్, ఎన్టీఆర్ తో అరవింద సమేత, మహేష్ బాబుతో ఖాలేజా, గుంటూరు కారం లాంటి సినిమాలు చేశారు. అయితే టాలీవుడ్ లో ఆయన చాలామంది స్టార్ హీరోలతో పనిచేశారు కానీ.. మెగా పవర్ స్టార్ తో మాత్రం ఒక్క సినిమా కూడా చేయలేదు. కారణం ఏంటంటే?

Related Articles

Related image1
Nagarjuna : ధురంధర్ లో అవకాశంపై క్లారిటీ ఇచ్చిన నాగార్జున, అసలు నిజం ఏంటంటే?
Related image2
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 కి ముహూర్తం ఫిక్స్ ? ఈసారి హోస్ట్ గా నాగార్జున ఉంటాడా.. లేదా?
34
రామ్ చరణ్ తో త్రివిక్రమ్ కాంబినేషన్..
Image Credit : Asianet News

రామ్ చరణ్ తో త్రివిక్రమ్ కాంబినేషన్..

త్రివిక్రమ్-రామ్ చరణ్ కలిసి సినిమా చేయనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. కానీ అందులో నిజం లేదని.. గతంలోనే నిర్మాత నాగ వంశీ వెల్లడించారు. త్రివిక్రమ్ తో వెంకటేష్ సినిమాతో పాటు, ఎన్టీఆర్ తో ఒక మూవీ ఉందని అన్నారు. 

అయితే గతంలో త్రివిక్రమ్- రామ్ చరణ్ కాంబోలో ఓ సినిమా చేయాల్సింది మిస్ అయ్యిందట. ఈ విషయంలో అఫీషియలం ఇన్ఫర్మేషన్ లేదు కానీ.. త్రివిక్రమ్ చరణ్ కు కథ చెప్పాడని, అది విని చరణ్ బాగుంది.. చేద్దాం అని అన్నాడని టాక్. కానీ ఆతరువాత కొన్ని పరిణామాల వల్ల.. ఈసినిమా సెట్స్ వరకూ వెళ్లలేదట. ఇందులో నిజం ఎంతో తెలియాల్సిఉంది.

44
వెంకటేష్ సినిమాలో త్రివిక్రమ్ బిజీ..
Image Credit : Instagram

వెంకటేష్ సినిమాలో త్రివిక్రమ్ బిజీ..

ప్రస్తుతం వెంకటేష్ తో ఆదర్శ కుటుంబం House No 47 - AK47 అనే సినిమాను చేస్తున్నాడు త్రివిక్రమ్. ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎందుకంటే త్రివిక్రమ్ అండ్ వెంకటేష్ కాంబినేషన్ లో గతంలో నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి లాంటి అద్భుతమైన సినిమాలు వచ్చాయి. 

ఇక ఈ సినిమా షూటింది హైదరాబాద్‌లోని అలుమినియం ఫ్యాక్టరీలో స్టార్ట్ అయ్యింది. ఈ సినిమా సమ్మర్ 2026 విడుదల లక్ష్యంగా షూటింగ్ చాలా స్పీడ్ గా చేస్తున్నట్టు సమాచారం. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాను ది హారిక అండ్ హాస్సిన్ ఎంటర్టైన్‌మెంట్ బ్యానర్‌ పై నిర్మిస్తున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
రామ్ చరణ్ కొణిదెల
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
పవన్ కళ్యాణ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Nagarjuna : ధురంధర్ లో అవకాశంపై క్లారిటీ ఇచ్చిన నాగార్జున, అసలు నిజం ఏంటంటే?
Recommended image2
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 కి ముహూర్తం ఫిక్స్ ? ఈసారి హోస్ట్ గా నాగార్జున ఉంటాడా.. లేదా?
Recommended image3
Prabhas: `కపుల్‌ ఫ్రెండ్లీ`కి ప్రభాస్‌ రివ్యూ, `వర్షం`తో పోలిక.. అదిరిపోయేలా `క్వీన్` టైటిల్‌ గ్లింప్స్
Related Stories
Recommended image1
Nagarjuna : ధురంధర్ లో అవకాశంపై క్లారిటీ ఇచ్చిన నాగార్జున, అసలు నిజం ఏంటంటే?
Recommended image2
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 కి ముహూర్తం ఫిక్స్ ? ఈసారి హోస్ట్ గా నాగార్జున ఉంటాడా.. లేదా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved