- Home
- Entertainment
- రాంచరణ్, బాలకృష్ణ ఇద్దరికీ చుక్కలు చూపించిన వెంకటేష్..పెద్ద హంగామాతో వచ్చి తుస్సుమన్న సూపర్ స్టార్
రాంచరణ్, బాలకృష్ణ ఇద్దరికీ చుక్కలు చూపించిన వెంకటేష్..పెద్ద హంగామాతో వచ్చి తుస్సుమన్న సూపర్ స్టార్
Ram Charan: విక్టరీ వెంకటేష్ దెబ్బకు రాంచరణ్, నందమూరి బాలకృష్ణ నటించిన సినిమాలు బలయ్యాయి. చివరికి ఓ సూపర్ స్టార్ కూడా వెంకీ ప్రభంజనం ముందు నిలబడలేకపోయారు.

ఆ వివాదంపై దిల్ రాజు కామెంట్స్
టాలీవుడ్ లో అగ్ర హీరోల మధ్య, సినిమా రిలీజ్ ల విషయంలో పోటీ సహజం. సంక్రాంతికి ఈ పోటీ ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. అనేక సందర్భాల్లో సంక్రాంతికి థియేటర్ల సమస్యలు రావడం చూస్తూనే ఉన్నాం. థియేటర్ల సమస్యలు వచ్చినప్పుడల్లా దిల్ రాజు పేరు విపిస్తూనే ఉంటుంది. 2019 సంక్రాంతికి జరిగిన వివాదం గురించి దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో స్పందించారు.
సంక్రాంతి సినిమాలు
2019 సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద మెగా పవర్ స్టార్ రాంచరణ్, నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో వెంకటేష్ సినిమా మాత్రమే విజయం సాధించింది. రాంచరణ్, బాలయ్య సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. ఆ చిత్రాలు ఏంటంటే.. వినయ విధేయ రామ, ఎన్టీఆర్ కథానాయకుడు, ఎఫ్2. ఈ చిత్రాలు ముందుగానే సంక్రాంతికి డేట్లు ఫిక్స్ చేసుకుని తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు పంచుకున్నాయి.
డబ్బింగ్ సినిమాలు
కానీ సడెన్ గా ఈ సినిమాల మధ్యలోకి తమిళ డబ్బింగ్ చిత్రం సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన పేట వచ్చింది. ఆ టైంలో దిల్ రాజు మాట్లాడుతూ డబ్బింగ్ సినిమాలకు సంక్రాంతి టైంలో ఎక్కువ థియేటర్లు ఇవ్వడం కుదరదు అని అన్నారు. దీనితో మీడియాలో, ఇండస్ట్రీ వర్గాల్లో పెద్ద చర్చ జరిగింది. మొత్తానికి ఎలాగోలా పేట చిత్రాన్ని తెలుగులో కూడా రిలీజ్ చేశారు.
వెంకీ ముందు నిలబడలేకపోయిన రాంచరణ్, బాలయ్య
విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి నటించిన ఎఫ్ 2 చిత్రం సంచలన విజయం సాధించింది. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రానికి ఫ్యామిలీ ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. రాంచరణ్ వినయ విధేయ రామ, బాలయ్య ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రాలు వెంకటేష్ ప్రభంజనం ముందు నిలబడలేకపోయాయి. ఆఖరికి సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా కూడా నిలబడలేకపోయింది.
దళపతి విజయ్ సినిమా
ఎఫ్2 చిత్రానికి నిర్మాత దిల్ రాజే. ఆ తర్వాత తాను నిర్మించిన దళపతి విజయ్ వారసుడు చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేసినప్పుడు.. పేట సినిమాని మనసులో పెట్టుకుని నన్ను ఇబ్బంది పెట్టాలని చూశారు. దళపతి విజయ్ హీరో కాబట్టి అది తమిళ సినిమా అని దానిని సంక్రాంతికి రిలీజ్ చేయడమే కాకుండా థియేటర్లు ఎలా ఆక్రమిస్తారు అంటూ తనని వివాదంలోకి లాగే ప్రయత్నం చేశారు అని దిల్ రాజు తెలిపారు.

