- Home
- Entertainment
- జాతకాలు నమ్మడం వల్ల ఆగిపోయిన బాలకృష్ణ సినిమా..గ్రహాలు అనుకూలించిన తర్వాత చేద్దాం అనుకున్నారు కానీ
జాతకాలు నమ్మడం వల్ల ఆగిపోయిన బాలకృష్ణ సినిమా..గ్రహాలు అనుకూలించిన తర్వాత చేద్దాం అనుకున్నారు కానీ
Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ కెరీర్ లో కొన్ని సినిమాలో మధ్యలోనే ఆగిపోయాయి. అందులో ఒక చిత్రం జాతకాల ప్రభావం వల్ల అటకెక్కింది. ఆ మూవీ ఏంటో ఈ కథనంలో తెలుసుకోండి.

Nandamuri Balakrishna
నందమూరి బాలకృష్ణ స్టార్ హీరోగా ఎదగడంలో కీలక పాత్ర వహించిన దర్శకులు కొందరు ఉన్నారు. వారిలో కోడి రామకృష్ణ ముందు వరుసలో ఉంటారు. కోడి రామకృష్ణ, బాలయ్య కాంబోలో మంగమ్మ గారి మనవడు, ముద్దుల మావయ్య, మువ్వ గోపాలుడు లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి. బాలకృష్ణ కెరీర్ కి టర్నింగ్ పాయింట్ గా నిలిచిన సినిమా అంటే మంగమ్మ గారి మనవడు అనే చెప్పాలి.
ఆగిపోయిన జానపద చిత్రం
బాలకృష్ణ, కోడి రామకృష్ణ కాంబినేషన్ చాలా కాలం పాటు కొనసాగింది. వీరి కాంబోలో ఒక భారీ జానపద చిత్రం తెరకెక్కాల్సింది. ఈ మూవీ పేరు విక్రమ సింహ భూపతి. కోడి రామకృష్ణ టచ్ చేయని జోనర్ జానపదమే. విక్రమ సింహ భూపతి మూవీ కంప్లీట్ అయి ఉంటే ఆయన కోరిక నెరవేరేది. కానీ 60 శాతం షూటింగ్ పూర్తయ్యాక ఈ చిత్రం ఆగిపోయింది.
జ్యోతిష్యులు చెప్పడంతో
అసలు ఆ మూవీ ఎందుకు ఆగిపోయిందో తనకు కూడా కంప్లీట్ గా తెలియదు అని కోడి రామకృష్ణ ఓ ఇంటర్వ్యూలో అన్నారు. ఆ సమయంలో కొన్ని సంఘటనలు జరిగాయి. అయినప్పటికీ ఆ సినిమా ఆగిపోకుండా ఉండాల్సింది. ఆ మూవీ షూటింగ్ సమయంలో నిర్మాత గోపాల్ రెడ్డి అనారోగ్యానికి గురయ్యారు. ఆయనకి నమ్మకమైన జ్యోతిష్యులు నెల్లూరులో ఉన్నారు. ప్రస్తుతం మీ జాతకం సరిగ్గాలేదు. ఇప్పుడు ఈ సినిమా ఆపేయడం మంచిది అని చెప్పారు.
60 శాతం షూటింగ్ పూర్తి
దీనితో ఆ సినిమా షూటింగ్ ఆగిపోయింది. బాలకృష్ణకి విషయం చెప్పాం. ఆయన కూడా జ్యోతిష్యులు చెప్పింది పాటించాల్సిందే. ఈ సినిమాని ఇంకెప్పుడైనా చేద్దాం. నేను ఇంతలో మరో మూవీ పూర్తి చేసి వస్తాను అని అన్నారు. కానీ ఆ తర్వాత గోపాల్ రెడ్డి కోలుకోలేకపోయారు. ఆ విధంగా విక్రమ సింహ భూపతి మూవీ ఆగిపోయింది. షూట్ చేసిన 60 శాతం మూవీ చాలా అద్భుతంగా వచ్చింది అని కోడి రామకృష్ణ తెలిపారు.
జాతకాలపై బాలయ్య నమ్మకం
ఆ తర్వాత ఈ చిత్రాన్ని తిరిగి ప్రారంభించాలి అని చాలా ప్రయత్నించాం అయినా కుదర్లేదు. జాతకాలపై బాలకృష్ణకి బలమైన నమ్మకం ఉంది. బాలకృష్ణ నిర్మాతలకు ఫేవరిట్ హీరో అని కోడి రామకృష్ణ తెలిపారు.

