- Home
- Entertainment
- MSG Movie: మన శంకర వరప్రసాద్ గారు మూవీ ఫ్లాప్ కాకుండా కాపాడింది ఎవరో తెలుసా ? చిరంజీవి, వెంకటేష్ కాదు
MSG Movie: మన శంకర వరప్రసాద్ గారు మూవీ ఫ్లాప్ కాకుండా కాపాడింది ఎవరో తెలుసా ? చిరంజీవి, వెంకటేష్ కాదు
చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు మూవీ విషయంలో సంఘటన జరిగింది. ఆ తప్పు జరిగి ఉంటే సినిమా ఫ్లాప్ అయ్యే అవకాశాలు ఎక్కువ. అలా జరగకుండా ఓ వ్యక్తి కాపాడారు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.

చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు మూవీ
మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు మూవీ రీజినల్ ఇండస్ట్రీ హిట్ గా సంచలనం సృష్టించింది. చిరంజీవి తన ఫుల్ గ్రేస్ తో కనిపిస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో మరోసారి నిరూపించబడింది. అనిల్ రావిపూడి వింటేజ్ చిరుని ప్రెజెంట్ చేసే సింపుల్ స్టోరీతో మ్యాజిక్ చేశారు. చిరంజీవి కామెడీ టైమింగ్, నయనతారతో సన్నివేశాలు, శిశిరేఖ సాంగ్, ఇంటర్వెల్ ఎపిసోడ్, సెంటిమెంట్, చివర్లో వెంకీతో చేసిన అల్లరి ఇవన్నీ ఈ చిత్రంలో హైలైట్ గా నిలిచాయి.
ఈసారి కూడా దొరకని అనిల్ రావిపూడి
అనిల్ రావిపూడి ఈసారైనా దొరికిపోతాడు అంటూ పెద్ద చర్చే జరిగింది. ఈసారి కూడా అనిల్ దొరకలేదు. తాను ఆడియన్స్ కి దొరికిపోయాను అని అనిల్ మన శంకర వరప్రసాద్ గారు సక్సెస్ మీట్ లో సరదాగా తెలిపారు. మన శంకర వరప్రసాద్ గారు మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది కానీ.. అట్టర్ ఫ్లాప్ అయ్యే ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది. సినిమా అంత బావుంటే ఎందుకు ఫ్లాప్ అవుతుంది అని అనుకోవచ్చు.
స్క్రీన్ ప్లే కీలకం
సరైన నిర్ణయంతో ఓ వ్యక్తి మన శంకర వరప్రసాద్ గారు మూవీ ఫ్లాప్ కాకుండా కాపాడారు. ఆ వ్యక్తి ఎవరో కాదు డైరెక్టర్ అనిల్ రావిపూడి. రిలీజ్ కి ముందు రిలీజ్ కి ముందు ఆసక్తికర సంఘటన జరిగిందట. అనిల్ రావిపూడి ఈ చిత్రానికి ముందుగా అనుకున్న స్క్రీన్ ప్లే వేరట. సినిమా ఎంత బావున్నా, ఎంత బాగా తెరకెక్కించిన స్క్రీన్ ప్లే లోపం వల్ల చాలా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. కాబట్టి స్క్రీన్ ప్లే కరెక్ట్ గా ఉండడం చాలా కీలకం. ఈ ఈ చిత్రానికి ఎడిటింగ్ జరుగుతున్నప్పుడు అనిల్ రావిపూడి వేరే స్క్రీన్ ప్లే అనుకున్నారట.
ముందుగా అనుకున్న స్క్రీన్ ప్లే ఇదే
ఈ చిత్రంలో అసలు శశిరేఖతో పరిచయం ఎలా ఏర్పడింది అని మినిస్టర్ అడిగినప్పుడు ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. వరప్రసాద్.. శశిరేఖతో జరిగిన పరిచయాన్ని గుర్తు చేసుకుంటూ ఫ్లాష్ బ్యాక్ చెబుతారు. కానీ ముందు అనిల్ రావిపూడి ఈ స్క్రీన్ ప్లే అనుకోలేదట. శశిరేఖతో పరిచయం ఎలా ఏర్పడింది అని మంత్రి అడగడంతో.. ఎలా కలిసాం అనేది మంచినీళ్ళు తాగుతూ కూడా మాట్లాడుకోవచ్చు.. ముందు ఎలా విడిపోయామో వినండి అని అంటారు. అప్పుడు శశిరేఖ, వరప్రసాద్ మధ్య జరిగిన గొడవలతో ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. ముందు మేం అనుకున్నా స్క్రీన్ ప్లే ఆర్డర్ ఇది.
శశిరేఖతో విడిపోయిన సీన్స్
ఆ తర్వాత శంకర వరప్రసాద్ తన పిల్లలని కలిసినప్పుడు.. కూతురు ఆశీర్వదించే విధంగా రెండు చేతులతో ఒక సైన్ ఇస్తుంది. అప్పుడు వరప్రసాద్ కి తన భార్య శశిరేఖని కలిసిన సన్నివేశాలు గుర్తుకు వస్తాయి. వాళ్లిద్దరూ తొలిసారి కలిసినప్పుడు కూడా శశిరేఖ రెండు చేతులతో అదే సైన్ ఇస్తూ ఆశీర్వదిస్తుంది. ముందు విడిపోయిన సన్నివేశాలు.. ఆ తర్వాత మొదట కలిసిన లవ్ సీన్స్.. ఇదీ మేం అనుకున్న స్క్రీన్ ప్లే ఆర్డర్.
మన శంకర వరప్రసాద్ గారు ఫ్లాప్ అయ్యే ప్రమాదం
ఈ స్క్రీన్ ప్లే తో ఎడిటింగ్ రూమ్ లో నేను సినిమా చూసినప్పుడు ప్రేక్షకుడి కోణంలో కథకి నేను కనెక్ట్ కాలేకున్నా. వరప్రసాద్, శిశిరేఖ ఎలా కలిశారో తెలియకుండా.. వాళ్ళు విడిపోయిన సీన్స్ లో ఫీల్ రావడం లేదు. ఈ స్క్రీన్ ప్లే తో వెళితే రిజల్ట్ ఏమవుతుందో అనే భయం వేసింది. దీనితో రిస్క్ తీసుకోలేదు. ఇప్పుడున్న స్క్రీన్ ప్లేకి మార్చేశాం. ఇది బాగా వర్కౌట్ అయింది అని అనిల్ రావిపూడి తెలిపారు.

