MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఉస్తాద్ భగత్ సింగ్ కు షాక్ ఇచ్చిన రాకాస కలెక్షన్స్, నిజమెంత? రెండు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసింది?

ఉస్తాద్ భగత్ సింగ్ కు షాక్ ఇచ్చిన రాకాస కలెక్షన్స్, నిజమెంత? రెండు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసింది?

ఇటీవల విడుదలైన రాకాస చిత్రం విడుదలకు ముందే యూత్ ఆడియన్స్‌లో మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది. ఆ క్రేజ్‌కు తగ్గట్టుగానే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ సాధించింది. యూత్‌లో ఉన్న అంచనాలు ఈ చిత్రానికి మొదటి రోజు నుంచే కలెక్షన్స్ రూపంలో కనిపించాయి.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 05 2026, 02:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
రాకాస ఫస్ట్ డే కలెక్షన్స్..
Image Credit : Asianet News

రాకాస ఫస్ట్ డే కలెక్షన్స్..

ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ చిత్రం మొదటి రోజున ప్రపంచవ్యాప్తంగా దాదాపు 6 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. రెండో రోజు కూడా అదే జోరు చూపించిన ఈసినిమా.. వరల్డ్ వైడ్ గా 10.30 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించినట్టు. మూవీ టీమ్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.

అదే సమయంలో షేర్ పరంగా చూస్తే మొదటి రోజు వరల్డ్ వైడ్‌గా 2.51 కోట్ల రూపాయలు వసూలయ్యాయి. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచే 1 కోటి 76 లక్షల రూపాయల షేర్ నమోదైంది. కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా ప్రాంతాల నుంచి కలిపి 15 లక్షల రూపాయల షేర్ రాగా, ఓవర్సీస్ మార్కెట్ నుంచి 60 లక్షల రూపాయల షేర్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
రెండో్ రోజు ఎంత వసూలు చేసిందంటే?
Image Credit : Asianet News

రెండో్ రోజు ఎంత వసూలు చేసిందంటే?

ఇక రెండవ రోజు కలెక్షన్స్ విషయానికి వస్తే, ఈ చిత్రం డీసెంట్ హోల్డ్‌ను కొనసాగించినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో రెండవ రోజు దాదాపు 1 కోటి 60 లక్షల రూపాయల షేర్ నమోదైంది. కర్ణాటక ప్రాంతంలో మొదటి రోజు కంటే మెరుగైన ప్రదర్శన కనబరిచి 20 లక్షల రూపాయల షేర్ సాధించింది. ఓవర్సీస్‌లో ఈ చిత్రం రెండవ రోజు 50 లక్షల రూపాయల షేర్ వసూళ్లు సాధించినట్లు సమాచారం.

మొత్తం మీద రెండవ రోజు వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రం 2 కోట్ల 30 లక్షల రూపాయల షేర్ వసూళ్లు నమోదు చేసింది. రెండు రోజులకు కలిపి మొత్తం 4 కోట్ల 80 లక్షల రూపాయల షేర్ వసూళ్లు వచ్చినట్లు ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్‌లో ఈ చిత్రం ఇప్పటికే కోటి రూపాయల షేర్ మార్క్‌ను దాటినట్టు సమాచారం.

34
ఉస్తాద్ భగత్ సింగ్ తో పోలిక..
Image Credit : X/@MythriOfficial

ఉస్తాద్ భగత్ సింగ్ తో పోలిక..

ఇక ఈ సినిమా కలెక్షన్స్‌ను మరో చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ తో పోలుస్తూ సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. ఆ చిత్రం ఓవర్సీస్‌లో సుమారు 4 కోట్ల రూపాయల షేర్ వసూళ్లు సాధించింది. అయితే ‘రాకాస’ చిత్రం ఆ స్థాయిని చేరే అవకాశాలు తక్కువగా ఉన్నాయని ట్రేడ్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

ఈ చిత్రానికి ఓవర్సీస్ క్లోజింగ్ షేర్ సుమారు 2 కోట్లకు లోపే ఉండే అవకాశముందని అంచనా వేస్తున్నారు.సోషల్ మీడియాలో కొందరు ‘రాకాస’ చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రికార్డులను దాటుతుందని ప్రచారం చేస్తున్నప్పటికీ, అందులో వాస్తవం లేదని ట్రేడ్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

44
బ్రేక్ ఈవెన్ సాధించాలంటే
Image Credit : Asianet News

బ్రేక్ ఈవెన్ సాధించాలంటే

మూడవ రోజు విషయానికి వస్తే, ఈ చిత్రం మరింత డీసెంట్ స్థాయిలో వసూళ్లు నమోదు చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. బుక్ మై షో ట్రెండ్స్ ప్రకారం ప్రతి గంటకు 3 వేలకుపైగా టికెట్లు అమ్ముడవుతున్నాయి. అయితే బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఈ చిత్రం వచ్చే రోజుల్లో కూడా ఇదే స్థాయి హోల్డ్‌ను కొనసాగించాల్సిన అవసరం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
VK Naresh: చంద్రబాబే పిల్లల్ని కనమని చెప్పాడు, నా తప్పేం లేదు... ట్రోల్స్ పై నరేష్‌ రియాక్షన్‌
Recommended image2
Aishwarya Lekshmi: ఆ చెత్త పనుల వల్లే ఇన్‌స్టాగ్రామ్‌కు గుడ్‌బై చెప్పా.. నిజాలు బయటపెట్టిన హీరోయిన్
Recommended image3
Gangster Stories: గ్యాంగ్‌స్టర్ కథలకు అడ్డా.. ఆ ఏరియా బ్యాక్‌డ్రాప్‌లో సినిమా తీస్తే హిట్టే!
Related Stories
Recommended image1
Rashmika Mandanna మాత్రమే టాప్ లో ఎలా? ఇండియన్ సినిమాను ఏలడానికి కారణాలివే
Recommended image2
సుడిగాలి సుధీర్ ను వెంటాడుతున్న బాధ, బుల్లితెర స్టార్ ఎమోషనల్ కామెంట్స్ ఎవరి గురించి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved